రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’ | Munna Kasi Heza Movie In Post Production | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

Published Thu, Jul 25 2019 12:33 PM | Last Updated on Thu, Jul 25 2019 12:33 PM

Munna Kasi Heza Movie In Post Production - Sakshi

మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని మంచి ప్రశంసలు పొందారు  మున్నా కాశీ.  ఆయన   హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం ‘హేజా’. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్,  బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు,  ఆర్.ఎక్స్ 100 ఫేమ్ ల‌క్ష్మణ్‌, లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి. ఈ సందర్భంగా 

దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఒక మ్యూజికల్ హారర్‌గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్ఆర్ హైలెట్ గా నిలవనుంది.

టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన స‌హ‌నిర్మాత  వి.య‌న్ వోలెటి, నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్,  డాల్బీ మిక్సింగ్‌తో రూపొందుతోంది. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement