ప్రేమించిన యువకుడే మాజీ ప్రేయసి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు.
మహబూబాబాద్: ప్రేమించిన యువకుడే మాజీ ప్రేయసి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లున్న యువతిని ఇద్దరు యువకులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. వారు ఆ యువతి దుస్తులు చించి ఆకారణంగా దాడి చేసిన సంఘటన జిల్లాలో సంచలనం రెకెత్తించింది. జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్ర సమయంలో సికింద్రాబాద్ తండాకు చెందిన 18 సంవత్సారల యువతిని ఆమె మాజీ ప్రియుడు, పట్టణానికి చెందిన మాదాసు మల్లేష్ అతని స్నేహితుడు సునిల్‌తో కలిసి బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లారు.
మద్యం మత్తులో వారిని గమనించిన ఆమె ఆటోలో ఎక్కేందుకు నిరాకరించడంతో కొట్టి బలవంతంగా తాళ్ళపూసపల్లి సమీపంలోకి తీసుకెళ్లారు. సదరు యువతి కేకలు వేయడంతో అదవద్దని ఆమెపై దాడి చేసి దుస్తులు చించివేశారు. యువతి కేకలు విన్న స్థానికులు పరుగున సంఘటన స్థలానికి రావడంతో మల్లేష్, సునిల్ అక్కడి నుంచి పరార్ అయ్యారు. గాయపడిన యువతిని స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.