Chhattisgarh: Man Gifts His Ex-Lover Home Theatre With Bomb As Wedding Gift - Sakshi
Sakshi News home page

మాజీ ప్రేయసి పెళ్లిలో హోం థియేటర్‌ గిఫ్ట్‌.. కట్‌ చేస్తే బ్లాస్ట్‌

Published Wed, Apr 5 2023 9:08 AM | Last Updated on Wed, Apr 5 2023 11:10 AM

Man Gifts His Ex Home Theatre With Bomb As Wedding Gift - Sakshi

క్రైమ్‌: ప్రేమించానంది. వెంట తిరిగింది. కానీ, చివరకు తనను కాదని మరో వ్యక్తిని వివాహమాడింది. అది తట్టుకోలేకపోయాడు. మరిచిపోలేని గుణపాఠం నేర్పాలనుకున్నాడు. డేంజరస్‌ కానుకతో మాజీ ప్రేయసి సహా ఆమె అత్తింటివాళ్లందరినీ చంపాలని ప్లాన్‌ వేశాడు. కానీ, అది వికటించి కొత్త పెళ్లి కొడుకు, అతని సోదరుడు చనిపోయారు. చివరకు సైకో ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. 

ఛత్తీస్‌గఢ్‌ ఖబిర్దామ్‌ హోం థియేటర్‌ పేలుడు ఘటనలో మిస్టరీని స్థానిక పోలీసులు చేధించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. కావాలనే చేసిన పని అని తేల్చారు పోలీసులు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో..  ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్‌ వేసినట్లు పోలీసులు తేల్చారు. 

ఏప్రిల్‌ 1వ తేదీన హేమేంద్ర మేరావికి స్థానికంగా ఉండే ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా భారీగా కానుకలు వచ్చాయి. ఆ మరుసటి రోజు కానుకలు ఉంచిన గదిలోకి హేమేంద్ర, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందులోంచి హోం థియేటర్‌ను తీయగా..  అది భారీ విస్పోటనంతో పేలిపోయి హేమేంద్ర అక్కడికక్కడే మరణించాడు.

పేలుడు ధాటికి ఆ గది గోడలు, పైకప్పు సైతం కూలిపోయాయి. హేమేంద్ర సోదరుడు రాజ్‌కుమార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరో నలుగురు(ఏడాదిన్నర బాలుడు కూడా) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ హోం థియేటర్‌ ఇచ్చింది సార్జూ అనే యువకుడని, అతనికి నవవధువుకి గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తేల్చారు. మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంలో అతను ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్‌ వేశాడట. హోం థియేటర్‌లో బాంబు ఫిక్స్‌ చేసి ఇచ్చాడట. అలా చివరకు  రెండు ప్రాణాలు పోవడంతో పాటు నిందితుడు కటకటాల పాలయ్యాడు.

ఇదీ చదవండి: ఊయలలో బొమ్మ.. కాలువలో నిహారిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement