Home Theater
-
ఇంట్లోనే వెండితెర
సాక్షి, భీమవరం: వెండితెర వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. టూరింగ్ టాకీస్ రోజుల్లో కొత్త సినిమాలు పట్టణాల్లో మాత్రమే విడుదలయ్యేవి. అప్పట్లో ఎడ్ల బళ్లు కట్టుకుని మరీ ఇంటిళ్లపాది వెళ్లి చూసి వచ్చేవారు. కాలం మారింది. ఇప్పుడు ఎంత పెద్ద హిరో సినిమా అయినా నెలరోజుల్లోనే ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో వస్తుంటే ఆధునిక పరిజ్ఞానం హోమ్ థియేటర్ల రూపంలో వెండితెరను ఇంటికే తెస్తోంది. థియేటర్లో చూసిన అనుభూతిని అందిస్తోంది. కొన్నాళ్లు నగరాలకే పరిమితమైన ఈ హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్నిప్రాంతాలకూ విస్తరిస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడగా ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటీటీనే ఏకైక వినోద సాధనమైంది. సినిమాలు నేరుగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ కావడం మొదలైంది. చౌక ప్లాన్లు, ఇంటిళ్లిపాది చూసే అవకాశం ఉండటంతో కొద్ది రోజుల్లోనే వీటికి ఆదరణ అమాంతం పెరిగిపోయింది. ఇంట్లోనే థియేటర్ అనుభూతి గతంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే కనిపించే హోమ్ థియేటర్ కల్చర్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. సంపన్న వర్గాలతో పాటు కాస్తోకూస్తో డబ్బున్న వారు కూడా వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. హోం థియేటర్ సెట్ చేయడానికి కనీసం 10 గీ 15 అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్ ఉండాలి.నాణ్యమైన సౌండ్ సిస్టమ్, స్క్రీన్, అభిరుచికి తగ్గట్టుగా సిట్టింగ్, ఇంటీరియర్ డికరేషన్ను బట్టి హోం థియేటర్‌కు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. స్క్రీన్, ప్రొజెక్టర్, యాంప్లిఫయర్, స్పీకర్స్, సౌండ్ ప్రూఫింగ్ తదితరాలను అమర్చుతారు. అధికశాతం మంది రూ.5 లక్షల వరకు వెచ్చిస్తుండగా, కొందరు రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు టెక్నీషియన్స్ చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 300కు పైగా హోమ్ థియేటర్లు ఉన్నాయంటున్నారు. తాజాగా ఏలూరు సమీపంలోని 150 విల్లాల్లో కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా హోం థియేటర్లు సిద్ధం చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఒక హోం థియేటర్స్ అధినేత ఆర్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. ప్రైవేట్ థియేటర్లకు పెరుగుతున్న ఆదరణ వినోదానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో సినిమాలు చూసేందుకు, ఈవెంట్స్, ప్రత్యేక వేడుకల కోసం మినీ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. పది మంది లేదా కుటుంబ సభ్యులతో నిర్వహించే బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకలకు ఇవి అనువుగా ఉంటున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ఇవి ట్రెండింగ్‌గా మారాయి. స్క్రీన్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, పది మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్, ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా వీటిని తయారుచేస్తున్నారు. 30 X 20 చ.అడుగులు మొదలుకొని కొంత స్థలంలో మినీ హోం థియేటర్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఔత్సాహిక యువత ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ఈ తరహా మినీ థియేటర్లు భీమవరంలో ఐదు వరకు వచ్చాయి. సీజన్‌ను బట్టి గంటకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు వీటికి అద్దె ఉంటుంది. మరో పక్క యువతను ఆకర్షించేందుకు జ్యూస్, ఐస్‌క్రీం పార్లర్లు, హోటళ్లలోను హోం థియేటర్ల ఏర్పాటుకు వ్యాపారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈవెంట్ల కోసం ఇటీవల కాలంలో ప్రైవేట్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భీమవరంలోని మా మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్‌లో ఏర్పాటుచేసిన మినీ థియేటర్‌కు ఆదరణ బాగుంది. గంటల చొప్పున థియేటర్‌ను రెంట్‌కు ఇస్తుంటాం. –జి.కృష్ణంరాజు, మ్యాజిక్ పిక్చర్ ల్యాండ్, భీమవరం -
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
కొత్త పెళ్లికొడుకును చంపింది మాజీ ప్రియుడే!
క్రైమ్: ప్రేమించానంది. వెంట తిరిగింది. కానీ, చివరకు తనను కాదని మరో వ్యక్తిని వివాహమాడింది. అది తట్టుకోలేకపోయాడు. మరిచిపోలేని గుణపాఠం నేర్పాలనుకున్నాడు. డేంజరస్ కానుకతో మాజీ ప్రేయసి సహా ఆమె అత్తింటివాళ్లందరినీ చంపాలని ప్లాన్ వేశాడు. కానీ, అది వికటించి కొత్త పెళ్లి కొడుకు, అతని సోదరుడు చనిపోయారు. చివరకు సైకో ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. ఛత్తీస్‌గఢ్ ఖబిర్దామ్ హోం థియేటర్ పేలుడు ఘటనలో మిస్టరీని స్థానిక పోలీసులు చేధించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. కావాలనే చేసిన పని అని తేల్చారు పోలీసులు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఏప్రిల్ 1వ తేదీన హేమేంద్ర మేరావికి స్థానికంగా ఉండే ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా భారీగా కానుకలు వచ్చాయి. ఆ మరుసటి రోజు కానుకలు ఉంచిన గదిలోకి హేమేంద్ర, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందులోంచి హోం థియేటర్‌ను తీయగా.. అది భారీ విస్పోటనంతో పేలిపోయి హేమేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పేలుడు ధాటికి ఆ గది గోడలు, పైకప్పు సైతం కూలిపోయాయి. హేమేంద్ర సోదరుడు రాజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరో నలుగురు(ఏడాదిన్నర బాలుడు కూడా) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ హోం థియేటర్ ఇచ్చింది సార్జూ అనే యువకుడని, అతనికి నవవధువుకి గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తేల్చారు. మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంలో అతను ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడట. హోం థియేటర్లో బాంబు ఫిక్స్ చేసి ఇచ్చాడట. అలా చివరకు రెండు ప్రాణాలు పోవడంతో పాటు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఇదీ చదవండి: ఊయలలో బొమ్మ.. కాలువలో నిహారిక -
ఎంతటి విషాదం! బాంబులా పేలిన గిఫ్ట్.. పెళ్లైన రెండు రోజులకే..
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు కానీ పెళ్లైన రెండు రోజులకే ఓ వరుడు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే ఆ వధువు కలలు కలలుగానే మిగిలిపోయింది. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లాలోని చమరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి ఇటీవల అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి రకరకాల బహుమతులు వచ్చాయి. సోమవారం ఉదయం ప్రాంతంలో హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్ చేసి చూస్తున్నారు. అందులో వారికి ఒక హోమ్ థియేటర్ ఉంది. పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులతో కలిసి బహుమతిగా వచ్చిన హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్ చేశాడు. అయితే ఒక్కసారిగా హోమ్ థియేటర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయి గోడ కూలిపోవడంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఫోరెన్సిక్స్ నివేదిక వచ్చే వరకు ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది ప్రమాదవశాత్తు పేలిందా లేదా మరేదైన కుట్ర దాగుందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. -
ఇంట్లోనే వెండితెర.. విస్తరించిన కొత్త కల్చర్
వినోదం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. 50 ఏళ్ల క్రితం కొత్త సినిమా కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి మరీ చూసేవారు. ఎందుకంటే అప్పట్లో మండలాల్లో కూడా సినిమాలు విడుదలయ్యేవి కావు. ఆ తర్వాత మండల కేంద్రాలకూ చేరాయి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయిన 30 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నారు. కొందరు థియేటర్ అనుభూతి పొందేందుకు హోమ్ థియేటర్ల(హోమ్ సినిమా సెగ్మెంట్)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద, పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు జిల్లాకు విస్తరించింది. కర్నూలు: సగటు ప్రేక్షకుడికి సినిమా ఒక ప్రధాన వినోద సాధనం. తెలుగు చిత్రసీమలో 80 ఏళ్లకు పైగా ఇది రాజ్యమేలుతోంది. పండుగలు, పర్వదినాల్లో నిర్మాతలు స్టార్‌హీరోల సినిమాలు విడుదల చేసి భారీగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించుకుని కలెక్షన్లు కొల్లగొడుతారు. సినిమా ఏదైనా బాగుందంటే ప్రతి రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం. ఈ సందడి 100, 175, 365 రోజుల పాటు ఉండేది. ఇదంతా ఒకప్పటి కథ. కోవిడ్–19 వైరస్ సినిమా కథనూ మార్చేసింది. కోవిడ్‌కు ముందు కోవిడ్ తర్వాత అనే విధంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో థియేటర్లు బంద్ చేసిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లో గాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అంతకుముందు కూడా ఓటీటీ సంస్కృతి ఉన్నా కోవిడ్ సమయంలో దీనికి ఆదరణ బాగా పెరిగింది. ఇంట్లోనే టీవీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు వీక్షించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ప్రస్తుతం సినిమా ఎంత బాగున్నా ఒకేసారి ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేస్తుండటంతో 30 రోజులకు మించి ఆడటం లేదు. ఈ క్రమంలో 30 రోజుల తర్వాత ఓటీటీలోనూ ఆ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేందుకు ఔత్సాహికులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంట్లోనే హోమ్ థియేటర్‌తో మజా ! ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాక మనం కోరుకున్న సినిమాను ఇంట్లోనూ కూర్చున్న చోట ఆన్లైన్లో నొక్కి చూడవచ్చనే అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చింది. దీంతో పైస్థాయి మధ్యతరగతి, ఉన్నతస్థాయి ప్రజలందరూ వారి ఇంట్లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఈ కల్చర్ కనిపించేది. ఇప్పుడు క్రమంగా జిల్లాకు పాకింది. కాస్త పెద్ద ఇళ్లు ఉన్న వారు హోమ్ థియేటర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక హోమ్ థియేటర్ ఏర్పాటు కావాలంటే రూ.5 లక్షలు ఉంటే చాలు. ఆ పై థియేటర్ గదిని, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, కుర్చీల సంఖ్యను బట్టి రూ.35 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇందు కోసం వీటిని ఏర్పాటు చేసే నిర్వాహకులు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. డెమో కూడా అక్కడే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే డెమో థియేటర్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు ఎవ్వరైనా స్నేహితులు, బంధువులు హోమ్ థియేటర్ చేయించుకుని ఉంటే వారిని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని వాకబు చేసి మరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. డోన్ సమీపంలోని గ్రామంలో ఓ భూస్వామి తనకూ హోమ్‌థియేటర్ కావాలని పట్టుబట్టి అక్కడ సెల్‌ఫోన్ టవర్ లేకపోయినా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటయ్యేలోగా నిర్వాహకులతో మాట్లాడి సెల్‌టవర్‌ను ఇంటి వద్ద ఏర్పాటు చేయించుకున్నాడంటే హోమ్థియేటర్పై ఉన్న మక్కువ అర్థం అవుతుంది. మంచి టీవీ ధరలోనే హోమ్ థియేటర్ అన్ని రకాల ఫీచర్లు, సౌండ్ సిస్టమ్‌తో ఉన్న బ్రాండెడ్ టీవీని కొనుగోలు చేయాలంటే రూ.2.5 లక్షలకు పైగానే వెచ్చించాలి. ఇలాంటి పెద్దతెర ఉన్న టీవీని తెచ్చుకుని చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి రెండింతలు మొత్తం ఖర్చు పెడితే ఏకంగా ఇంట్లోనే సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్న అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు. సొంత ఇల్లు ఉండి థియేటర్ ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్న చాలా మంది ఇప్పుడు హోమ్ థియేటర్‌వైపు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం రూ.5లక్షల నుంచి రూ.35 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. హోమ్‌థియేటర్ ఏర్పాటు కావాలంటే కనీసం 11/22 నుంచి 22/44 వరకు విస్తీర్ణంలో ఉన్న హాలులో 7.1 నుంచి 17.4 ఛానల్స్ వరకు స్పీకర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు నుంచి 20 మంది దాకా కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంటోంది. అన్ని భాషల్లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్ ఓటీటీలో చూసే అవకాశం ఉండటంతో హోమ్ థియేటర్‌కు ఆదరణ పెరుగుతోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 250 ఇళ్లలో హోమ్థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. -
బడ్జెట్ ధరలో.. ఇన్‌బిల్ట్ సబ్ వూఫర్స్‌తో మివి సౌండ్‌బార్
భారతదేశపు మొట్ట మొదటి దేశీ సౌండ్ బార్స్ ఫోర్ట్ ఎస్60, ఫోర్ట్ ఎస్100లను మివి సంస్థ లాంఛ్ చేసింది. మివికి చెందిన ఇంజినీర్లు, ఆడియో నిపుణులు ఎన్నో నెలల పాటు శ్రమించి భారతీయ వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా సౌండ్బార్లను మార్కెట్లోకి తెచ్చారు. ఇండియాలో పరిమితంగా ఉండే ఇంటి స్థలం, బాస్‌పై ఉండే మక్కువను దృష్టిలో ఉంచుకుని సౌండ్బార్లోనే ఇన్‌బిల్ట్‌గా సబ్వూఫర్స్ను డిజైన్ చేశారు. ఈ రెండు సౌండ్బార్లు కూడా మివికి చెందిన హైదరాబాద్ తయారీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. మివి ఫోర్ట్ ఎస్ 60, ఫోర్ట్ ఎస్100 లను ఎక్స్ క్లూజివ్గా ఫ్లిప్ కార్ట్‌తో పాటు మివి వెబ్సైట్లో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు వరుసగా రూ.3,499, రూ.4,999లుగా ఉన్నాయి. ఇండియాలో సంగీతాభిమానులు భారీగా ఉన్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇక్కడి అభిరుచికి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్స్ రావడం లేదు. దిగుమతి అవుతున్న సౌండ్ సిస్టమ్స్ అన్నీ వెస్ట్రన్ స్టైల్‌కి తగ్గట్టుగుఆ ఉంటున్నాయి. అందుకే మన వాళ్లకి తగ్గట్టుగా కొత్త సౌండ్ బార్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు మివి సహవ్యవస్థాపకులు, సీఎంఓ మిదుల దేవభక్తుని తెలిపారు. ఫీచర్స్ - 2.2 చానల్ సరౌండ్ – సౌండ్ అనుభూతి - వీడియో, గేమ్స్‌కి తగ్గట్టుగా సంగీతం - స్లిమ్ అండ్ స్లీక్ వాల్మౌంటెండ్ డిజైన్ - బ్లూ టూత్, ఎయూఎక్స్, కోయాక్సియల్, యూఎస్బీ - ప్లగ్ అండ్ ప్లే ఆపరేటింగ్ - మ్యూజిక్, మూవీ, న్యూస్ మోడ్ ఆప్షన్లు -
థియేటర్స్ Vs హోమ్ థియేటర్స్
Theatre Vs Home Theater : ఓ వైపు మల్టీప్లెక్సీల్లో టికెట్లు అధిక ధరలు..పార్కింగ్ ఫీజుల నుంచి పాప్‌కార్న్, కేక్‌లు, పఫ్, కూల్‌డ్రింక్ ధరలతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్స్‌కు వెళ్ళేందుకు ధైర్యం చేయడం లేదు. ఓ చిన్న కుటుంబం తమ పిల్లలతో కలిసి సరదాగా సినిమా చూద్దామంటే రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చు అయ్యే పరిస్దితి ఏర్పడింది. ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్, వూట్ తదితర ఓవర్ ది టాప్ వీడియో కంటెంట్ ప్రొవైడర్లు కొత్త సినిమాలను నట్టింట్లోకి తెచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్స్ వర్సస్ హోమ్ థియేటర్స్ అనే పరిస్థితి ఏర్పడింది. యావరేజ్ అంటే కుదరదు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 60 మూవీ థియేటర్లు ఉన్నాయి. నగరంలో మొత్తం పెద్ద థియేటర్లు 14 ఉండగా మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఎస్2లో మూడు స్క్రీన్లు, ది సినిమాలో ఐదు స్క్రీన్లు, రెయిన్ థియేటర్స్‌లో మూడు స్క్రీన్ లీలామహల్, సిరి థియేటర్లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు, కంటెంట్ బాగున్న చిత్రాలు, కాంబినేషన్ వర్కవుట్ అయ్యే సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్లు కళకళాడుతున్నాయి. గతంలోలా యావరేజ్, బిలో యావరేజ్ చిత్రాలు వస్తే ప్రేక్షకుడు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. వాళ్లు సేఫ్.. వీళ్లు డౌట్ సినిమా విడుదల కాకముందే నిర్మాతలు చిత్రాన్ని పంపిణీ దారులకు అమ్మేస్తున్నారు. అంతేకాదు ఓటీటీ రైట్స్ కింద అమెజాన్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెట్‌వర్క్ స్క్రీమింగ్లకు విక్రయిస్తున్నారు. చిత్రం విడుదలయ్యాక 20 రోజుల నుంచి 30 రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపైకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్ పరిస్దితి మాత్రం దయనీయంగా ఉంటుంది. సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల్లోపే థియేటర్స్ నుంచి రెవిన్యూ వస్తోంది. గతంలో 100రోజులు 150రోజులు ధియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలు జగరడం లేదు. సినిమా టాక్ బాగుంటేనే పెట్టిన పెట్టుబడి వచ్చేది. లేదంటే అంతే సంగతులు, దీనికి తోడు పైరసీ బెడద ఉండనే ఉంది. 30 రోజుల్లోనే కొత్త సినిమా విడుదలైన 20 నుంచి 30 రోజుల్లోనే కొత్త సినిమాలను చూసే అవకాశం నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర ఓటీటీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా అవకాశం లభిస్తోంది. ఈ ఓటీటీ కంపెనీలు నెలరోజులు, ఏడాది ప్యాకేజీల వంతున ప్రేక్షకులకు చందాదారులగా చేర్చుకుంటున్నాయి. ఒక సినిమాని థియేటర్‌కి వెళ్లి కుటుంబ సమేతంగా చూసే ఖర్చుతో అత్యంత ఖరీదైన పాపులర్ ఓటీటీకి సంవత్సర చందా కట్టేయ్యోచ్చు. కొత్త సినిమాలతో పాటు వందలాది ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓటీటీకి తోడు ఇంటర్నెట్ కనెక్షన్ తప్ప మరో భారం ఉండనే ఉండదు. అమెజాన్ స్టిక్‌తో... ఇటీవల ప్రతీ ఇంటిలో ఎల్సీడీ, ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. కొన్ని టీవీ కంపెనీలు నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్‌గా అందిస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ లేని వాళ్లకు ఫైర్‌స్టిక్ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ని అందిస్తోంది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఫైర్ స్టిక్‌తో సినిమాలు చూసేయొచ్చు. టీవీతో కూడా పోటీ అమేజాన్ ప్రైమ్. నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్ తదితర ఓటీటీలలో సినిమా కంటెంట్ తో పాటు ఒరిజనల్ కంటెంట్ కూడా లభిస్తుంది. వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, సినిమాలను ఈ ఓటీటీలే నిర్మించి నేరుగా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరోవైపు జీ , సోనీ, స్టార్ చానల్స్, సన్‌నెట్‌వర్క్ వంటి టీవీ ఛానల్స్‌కి అనుబంధంగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో టీవీలో కంటే ముందే సీరియల్స్‌ని ఓటీటీలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ఓటీటీటీ ఛానల్స్ సినిమా థియేటర్లకే కాదు టీవీ ఛానల్స్‌కి సైతం పోటీగా మారాయి. చదవండి : నెట్‌ఫ్లిక్స్‌పై ప్రశంసలను కురిపించిన అమెజాన్ అధినేత..! యూజర్లు షాక్..! -
హోమ్ థియేటర్.. ఎంటర్టైన్మెంట్ అడ్డా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్, హాట్‌స్టార్, జీ, ఈరోస్, సన్... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంపెనీ తమకు ప్రత్యేక హక్కులున్న సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌తో ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయ్!!. కొన్ని కంపెనీలు కాస్త ముందుకెళ్లి సొంత కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. స్మార్ట్ టీవీల సాయంతో ఇంట్లోనే సినిమాలు చూసే జనం పెరుగుతుండటం వల్లే!! కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి... ఇళ్లనే థియేటర్లుగా మార్చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ కలిసో... బంధువులతోనో రిలీజైన సినిమాలను సై తం అదే రోజు చూసేస్తున్నారు. వారికిపుడు హోమ్ థియేటర్ అంటే ఎంటర్టైన్మెంట్ అడ్డా!. ఇపుడీ ట్రెండ్ నగరాలను దాటి చిన్న పట్టణాలకూ విస్తరించింది. తక్కువలో తక్కువ రూ.1.5 లక్షలతోనూ హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసుకునే వీలుండటమే చాలామందిని దీనివైపు మొగ్గేలా చేస్తోంది. ఎంత పెడితే అంత హిట్!! హోమ్ థియేటర్ గురించి చెప్పాలంటే... ఎంత ఖర్చు పెడితే అంత సూపర్ హిట్. కొందరు దీనికోసం రూ.3.5 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారంటే అతిశయోక్తేమీ కాదు. ఇంకొందరు ఏకంగా 600 అంగుళాల తెరను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే హోమ్ థియేటర్ కోసం రూ.1 కోటి అంతకన్నా ఎక్కువ ఖర్చు చేసిన వారు 50 మంది వరకూ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.2013 నుంచీ దేశంలో ఈ రంగం పుంజుకుంటూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడాదికి 20,000 వరకూ హోమ్ థియేటర్ ఇన్స్టలేషన్లు జరుగుతున్నాయనేది గణాంకాలు చెబుతున్న మాట.దేశవ్యాప్తంగా చూస్తే ముంబై, ఢిల్లీ వంటి మెట్రోల తరవాత హైదరాబాద్ 5వ స్థానంలో నిలుస్తోంది. ఇదీ... హోమ్ థియేటర్ సిస్టమ్ సినిమా థియేటర్ స్థాయిలో కాకపోయినా సాధారణ టీవీని మించిన పెద్ద తెర హోమ్ థియేటర్ ప్రత్యేకత. ప్రొజెక్టర్ ద్వారా తెరపై పిక్చర్ వేసుకుని చూడటమే కాక... గోడనే స్క్రీన్‌గా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. కాకపోతే దీనికోసం ప్రత్యేక పెయింట్‌ను వాడాలి. ఈ రంగంలో కెనడాకు చెందిన ‘స్క్రీన్ గో’ బ్రాండ్ అగ్రగామిగా ఉంది. 80 అంగుళాల తెరకు పెయింట్ చేయాలంటే రూ.12,000 ఖర్చవుతుంది.అలా కాకుండా ఫ్రంట్ ప్రొజెక్షన్ స్క్రీన్ లేదా అకౌస్టిక్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సౌండ్ కోసం స్పీకర్స్, ఏవీ రిసీవర్స్/ ప్రాసెసర్స్ వాడాలి. అత్యుత్తమ శబ్దం కోసం అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక దీనికి హోమ్ ఆటోమేషన్ కూడా తోడైతే నాలుగైదు రిమోట్లకు బదులుగా స్మార్ట్‌ఫోన్ లేదా ఐప్యాడ్‌తో ఆపరేట్ చేసుకునేందుకు వీలవుతుంది. 55 అంగుళాలు, ఆపైన టీవీ ఉంటే సైతం హోమ్ థియేటర్‌గా మార్చుకోవచ్చు. చిన్న పట్టణాలకూ విస్తరణ.. హోమ్ థియేటర్ల ట్రెండ్ ఇపుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. ఏపీలో నరసాపురం, పాలకొల్లు, భీమడోలు, తెలంగాణలో తాండూరు, శంషాబాద్ వంటి పలు ప్రాంతాలకూ పాకింది. హైదరాబాదీ కంపెనీలు ఏటా 2,000 హోమ్ థియేటర్లను ఇన్స్టాల్ చేస్తున్నాయి. ఇందులో 30 శాతం హైదరాబాద్ వెలుపల ఉంటాయని ఈ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీ వెక్టర్ సిస్టమ్స్ తెలియజేసింది. ఇక హోమ్ థియేటర్ ఒకసారి ఇన్స్టాల్ చేస్తే 8–10 ఏళ్లపాటు మన్నుతుంది. బ్రాండెడ్ కంపెనీలు రెండేళ్లు వారంటీ ఇస్తున్నాయి. అకౌస్టిక్స్తో అయితే సిస్టమ్ ఏర్పాటుకు 4 వారాలు పడుతుంది. అకౌస్టిక్స్ లేకుండా అయితే రెండు రోజుల్లో పూర్తి చేయొచ్చు. కనీసం రూ.1.5 లక్షల నుంచి... హోమ్ థియేటర్ ఏర్పాటుకు కనీసం రూ.1.5 లక్షలు అవుతుంది. ఇక గరిష్ఠం ఎంతన్నది చెప్పలేం. సోనీ, ప్యానాసోనిక్, బార్కో, ఎప్సన్, బెన్క్యు వంటి బ్రాండ్ల ప్రొజెక్టర్ల ధర రూ.60 వేల నుంచి రూ.60 లక్షల వరకు ఉంది. రూ.1 లక్ష ఆపైన ప్రొజెక్టర్ల విభాగంలో తమకు 60 శాతం వాటా ఉన్నట్లు సోనీ ఇండియా ప్రతినిధి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. స్పీకర్స్‌లో బీఅండ్డబ్లు్య, మానిటర్ ఆడియో, డాలి, మేయర్, బోస్ వంటి బ్రాండ్ల ధర రూ.40 వేల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంది. ఏవీ రిసీవర్లు సైతం రూ.25 వేల నుంచి 25 లక్షల దాకా లభిస్తున్నాయి. అకౌస్టిక్స్‌కు చదరపు అడుగుకు రూ.150– 2,500 ఖర్చవుతుంది. సీట్లు రూ.20 వేల నుంచి రూ.6 లక్షల దాకా ఉన్నాయి. ఆటోమేషన్ కావాలంటే రూ.1.5 లక్షలవుతుంది. ప్రపంచవ్యాప్త కంటెంట్‌తో.. హోమ్ థియేటర్ ఉన్న స్నేహితుడు, బంధువు ఇంట్లో కలుసుకోవడం ఇపుడో ట్రెండ్‌గా మారింది. క్యూబ్ సర్వర్‌కు కనెక్ట్ అయి రిలీజ్ అయిన రోజే ఇంట్లో సినిమా చూస్తున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజాలతో అంతర్జాతీయ కంటెంట్ కూడా ఇంటర్నెట్లో లభ్యమవుతోంది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మా కంపెనీ ఇప్పటి వరకు 1,000కిపైగా ఇన్స్టలేషన్స్ పూర్తి చేసింది. హైదరాబాద్‌లో అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా గుర్తింపు ఉన్న ఏకైక సంస్థ మాదే. ఫైనాన్స్ కంపెనీలు గనక వీటికి ఈఎంఐ సదుపాయం కల్పిస్తే ఈ విభాగంలో అనూహ్య వృద్ధి ఉంటుంది. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
శాంసంగ్ హోం థియేటర్లు : ధర ఎంతంటే?
సాక్షి, న్యూఢిల్లీ: సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ అతి ఖరీదైన హోం థియేటర్‌ను లాంచ్ చేసింది. దేశీయంగా ఇన్ హోం ఎంటర్టైన్మెంట్ను సమూలంగా మార్చివేసే లక్ష్యంతో 'ఎల్ఈడీ ఫర్ హోమ్' ప్రారంభించామని శాంసంగ్ ప్రకటించింది. ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎల్ఈడీ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ ఎల్ఈడీ పేరిట ఈ హోమ్ స్క్రీన్‌ను లాంచ్ చేసింది. సూపర్ ప్రీమియం స్ర్కీన్ తో ఇంట్లోనే థియేట్ అనుభవాన్ని పంచేందుకు ఈ సరికొత్త ఎల్ఈడీ హోం థియేటర్లను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ ఎంటర్టైన్మెంట్లో తాజా ఆవిష్కరణ ఒక విప్లవంగా పేర్కొంది. ఈ హోమ్ స్క్రీన్‌పై వినియోగదారులు అత్యద్భుతమైన, అత్యంత నాణ్యత కలిగిన దృశ్యాలను ఎక్స్పీరియన్స్ చేయవచ్చని తెలిపింది. అంతేకాదు హోమ్ స్క్రీన్లు అన్నింటికీ ఒక లక్షకు పైగా గంటల జీవిత కాలం ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది. 110-అంగుళాల ఫుల్ హెచ్డీ, 130-అంగుళాల ఫుల్ హెచ్డీ, 220 అంగుళాలు (అల్ట్రా హెచ్డీ) 260-అంగుళాలు (అల్ట్రా-హెచ్డీ) సిరీస్ వీటిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ. 1 కోట్లు, రూ. 3.5 కోట్లు గా ఉండనున్నాయి.తమ లేటెస్ట్ డివైస్ కట్టింగ్-ఎడ్జ్ డిస్ప్లే అనుభవాన్ని వినియోగదారులను అందించేందుకు అంకితభావంతో ఉన్నామని పునీత్ సేథి, (వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ శాంసంగ్ ఇండియా )ప్రకటనలో తెలిపారు. -
మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్: మెల్బాన్ కంపెనీ తాజాగా రెండు ఎల్ఈడీ టీవీలు, ఒక హోమ్ థియేటర్ సిస్టమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ32, ఈ40 శ్రేణిలో 32, 40 అంగుళాల హై డెఫినిషన్ ఎల్ఈడీ టీవీలతోపాటు ఎంబీ-5100 పేరుతో 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్‌ను కంపెనీ ఇక్కడ ఆవిష్కరించింది. వీటికి బీఐఎస్ ధ్రువీకరణ ఉందని, అందుబాటు ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.