Mivi Launched Fort S60 and S100 Made in India Soundbars - Sakshi
Sakshi News home page

Mivi Made in India Soundbars: బడ్జెట్‌ ధరలో.. ఇన్‌బిల్ట్‌ సబ్‌ వూఫర్స్‌తో మివి సౌండ్‌బార్‌

Published Fri, Apr 8 2022 4:55 PM | Last Updated on Fri, Apr 8 2022 5:47 PM

Details About Mivi Sound Bar With inbuilt Sub Woofer - Sakshi

భారతదేశపు మొట్ట మొదటి దేశీ సౌండ్ బార్స్ ఫోర్ట్ ఎస్60, ఫోర్ట్ ఎస్100లను మివి సంస్థ లాంఛ్‌ చేసింది. మివికి చెందిన ఇంజినీర్లు, ఆడియో నిపుణులు ఎన్నో నెలల పాటు శ్రమించి భారతీయ వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా సౌండ్‌బార్లను మార్కెట్‌లోకి తెచ్చారు. ఇండియాలో పరిమితంగా ఉండే ఇంటి స్థలం, బాస్‌పై ఉండే మక్కువను దృష్టిలో ఉంచుకుని సౌండ్‌బార్‌లోనే ఇన్‌బిల్ట్‌గా సబ్‌వూఫర్స్‌ను డిజైన్‌ చేశారు. ఈ రెండు సౌండ్‌బార్లు కూడా మివికి చెందిన హైదరాబాద్ తయారీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. మివి ఫోర్ట్ ఎస్ 60, ఫోర్ట్ ఎస్100 లను ఎక్స్ క్లూజివ్‌గా ఫ్లిప్ కార్ట్‌తో పాటు  మివి వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు వరుసగా రూ.3,499, రూ.4,999లుగా ఉన్నాయి. 

ఇండియాలో సంగీతాభిమానులు భారీగా ఉన్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇక్కడి  అభిరుచికి తగ్గట్టుగా సౌండ్‌ సిస్టమ్స్‌ రావడం లేదు. దిగుమతి అవుతున్న సౌండ్‌ సిస్టమ్స్‌ అన్నీ వెస్ట్రన్‌ స్టైల్‌కి తగ్గట్టుగుఆ ఉంటున్నాయి. అందుకే మన వాళ్లకి తగ్గట్టుగా కొత్త సౌండ్‌ బార్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు మివి సహవ్యవస్థాపకులు, సీఎంఓ మిదుల దేవభక్తుని తెలిపారు.

ఫీచర్స్‌
- 2.2 చానల్‌ సరౌండ్ – సౌండ్ అనుభూతి
- వీడియో, గేమ్స్‌కి తగ్గట్టుగా సంగీతం
- స్లిమ్‌ అండ్‌ స్లీక్‌ వాల్‌మౌంటెండ్‌ డిజైన్‌ 
-  బ్లూ టూత్, ఎయూఎక్స్, కోయాక్సియల్, యూఎస్‌బీ
- ప్లగ్ అండ్ ప్లే ఆపరేటింగ్‌
-  మ్యూజిక్, మూవీ, న్యూస్ మోడ్‌ ఆప్షన్లు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement