sound system
-
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
సరిగమలు ఎక్కడంటే అక్కడ.. శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!
శబ్ధం, సంగీతం విషయంలో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వస్తోంది. గ్రామోఫోన్తో మొదలు పెట్టి ఐపాడ్ వరకు సంగీతం క్వాలిటీ పెరుగుతుంటే సంగీతాన్ని అందించే పరికరాల పరిమాణం తగ్గుతూ వస్తోంది. తాజాగా అమెరికాకు చెందని మసాచుసెట్స్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధన ఫలితాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. స్పీకర్లు, ట్వీటర్లు, వూఫర్లు వంటి హంగామా ఏమీ లేకుండా కేవలం ఒక కాగితం సైజు పరిమాణంలో ఉండే పరికరాన్ని రూపొందించారు మసాచుసెట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కాగితంలా సన్నగా, అతి తక్కువ బరువుతో ఉండే ఈ పరికరాన్ని ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. ఏం చక్క సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు,. వాల్‌పేపర్ స్పీకర్లకు సంబంధించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయంటున్నారు మసాచుసెట్స్ పరిశోధకులు. అయితే పేపర్ థిన్ స్పీకర్ల విషయంలో కీలక దశను అధిగమించామని.. ఇకపై క్వాలిటీ, డ్యూరబులిటీని పెంచడంపైనే దృష్టి పెడతామంటున్నారు. మరికొద్ది రోజుల్లో మ్యూజిక ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో రివల్యూషనరీ మార్పులు అయితే వస్తాయంటున్నారు. చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
బడ్జెట్ ధరలో.. ఇన్‌బిల్ట్ సబ్ వూఫర్స్‌తో మివి సౌండ్‌బార్
భారతదేశపు మొట్ట మొదటి దేశీ సౌండ్ బార్స్ ఫోర్ట్ ఎస్60, ఫోర్ట్ ఎస్100లను మివి సంస్థ లాంఛ్ చేసింది. మివికి చెందిన ఇంజినీర్లు, ఆడియో నిపుణులు ఎన్నో నెలల పాటు శ్రమించి భారతీయ వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా సౌండ్బార్లను మార్కెట్లోకి తెచ్చారు. ఇండియాలో పరిమితంగా ఉండే ఇంటి స్థలం, బాస్‌పై ఉండే మక్కువను దృష్టిలో ఉంచుకుని సౌండ్బార్లోనే ఇన్‌బిల్ట్‌గా సబ్వూఫర్స్ను డిజైన్ చేశారు. ఈ రెండు సౌండ్బార్లు కూడా మివికి చెందిన హైదరాబాద్ తయారీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. మివి ఫోర్ట్ ఎస్ 60, ఫోర్ట్ ఎస్100 లను ఎక్స్ క్లూజివ్గా ఫ్లిప్ కార్ట్‌తో పాటు మివి వెబ్సైట్లో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు వరుసగా రూ.3,499, రూ.4,999లుగా ఉన్నాయి. ఇండియాలో సంగీతాభిమానులు భారీగా ఉన్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇక్కడి అభిరుచికి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్స్ రావడం లేదు. దిగుమతి అవుతున్న సౌండ్ సిస్టమ్స్ అన్నీ వెస్ట్రన్ స్టైల్‌కి తగ్గట్టుగుఆ ఉంటున్నాయి. అందుకే మన వాళ్లకి తగ్గట్టుగా కొత్త సౌండ్ బార్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు మివి సహవ్యవస్థాపకులు, సీఎంఓ మిదుల దేవభక్తుని తెలిపారు. ఫీచర్స్ - 2.2 చానల్ సరౌండ్ – సౌండ్ అనుభూతి - వీడియో, గేమ్స్‌కి తగ్గట్టుగా సంగీతం - స్లిమ్ అండ్ స్లీక్ వాల్మౌంటెండ్ డిజైన్ - బ్లూ టూత్, ఎయూఎక్స్, కోయాక్సియల్, యూఎస్బీ - ప్లగ్ అండ్ ప్లే ఆపరేటింగ్ - మ్యూజిక్, మూవీ, న్యూస్ మోడ్ ఆప్షన్లు -
మైకుల వైర్లు కట్ చేయించిన ఎస్సై!
సాక్షి, ధారూరు: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయకుల ఊరేగింపులో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్ చేసి హల్చల్ చేశారు. దీంతో యువత, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్ఐ ఎవరికీ చెప్పకుండా మైకులకు ఉన్న వైర్లను కట్‌చేసి సౌండ్ సిస్టంను బంద్ చేయించారు. దీంతో యువకులతోపాటు భక్తులు ఆందోళనకు దిగారు. మైకులకు అనుమతి ఇవ్వకుంటే వినాయక విగ్రహాలను కదలనివ్వమని, పోలీస్‌స్టేషన్‌లో విగ్రహాలను పెడతామని, పోలీసులే నిమజ్జనం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఎస్ఐ పట్టించుకోకుండా ఊరుకున్నారు. దీంతో యువకులు పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ‘జై బోలో.. గణేశ్ మహరాజ్ కీ జై’ అంటూ నినదించారు. చివరకు ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్పంచ్ చంద్రమౌలి, గ్రామస్తులు చర్చలు జరిపారు. ధారూరు సీఐ రాజశేఖర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఎస్ఐ మిన్నుకండిపోయారు. అనంతరం యువకులు శాంతించి నిమజ్జనం పూర్తి చేయడంతో సమస్య సద్దుమణిగంది. -
ఇక థియేటర్లలో కొత్త సౌండ్ సిస్టమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని సినిమా ప్రేక్షకులు ఇక నుంచి థియేటర్లలో నూతన అనుభూతికి లోనుకానున్నారు. బెల్జియం కంపెనీ ఆరో టెక్నాలజీస్ రూపొందించిన ‘ఆరో 11.1’ అనే అత్యాధునిక 3డీ సౌండ్ సిస్టమ్‌ను సినీ నిర్మాణ రంగంలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ వివిధ థియేటర్లలో పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్-4లో తొలుత ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. త్వర లో 100 థియేటర్లలో అందుబాటులోకి రానుంది. ప్రేక్షకులు మంచి శబ్దాన్ని కోరుకుంటున్నారని, ఈ సౌండ్ సిస్టమ్ కలిగిన థియేటర్లు హౌస్ ఫుల్తో నడుస్తున్నాయని సురేష్ ప్రొడక్షన్స్ ఎండీ డి.సురేష్ బాబు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. సినిమా ఆడియో మిక్సింగ్ కోసం రామానాయుడు స్టూడియోల్లో ఆరో 3డీ టెక్నాలజీని వినియోగిస్తామని వెల్లడించారు. రేసుగుర్రం సినిమా ఈ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుందని చెప్పారు.ఆరో టెక్నాలజీ కోసం ఒక్కో థియేటర్‌కు రూ.12-15 లక్షల వ్యయం అవుతుంది. దశలవారీగా రాష్ట్రంలోని ప్రధాన థియేటర్లకు విస్తరిస్తాం’ అని సురేష్ బాబు వివరించారు. హెడ్‌ఫోన్స్ కూడా.. ప్రేక్షకులు మైమరచిపోయేలా, సహజ సిద్ధంగా శబ్దం ఉంటుందని ఆరో టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విల్ఫ్రైడ్ వాన్ బాలెన్ పేర్కొన్నారు. ఆరో పరిజ్ఞానంతో 2014లో మ్యూజిక్ సిస్టమ్, హెడ్‌ఫోన్స్ వంటి మరిన్ని ఉత్పాదనలను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. నాలుగేళ్లు శ్రమించి సినిమా విభాగం కోసం ఆరో 11.1 సౌండ్ సిస్టమ్‌ను రూపొందించినట్టు చెప్పారు. థియేటర్లో మూడు దశల్లో ఈ వ్యవస్థను అమరుస్తామని, ఏ సీట్లో కూర్చున్నా శబ్దం ఒకేలా వినపడుతుందని వివరించారు. ఆరో ఉత్పత్తులను దేశంలో బార్కో ఇండియా పంపిణీ చేస్తుంది.