![MIT Researchers Created Wallpaper thin Speakers - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/3/shock.jpg.webp?itok=ydTAoCmp)
శబ్ధం, సంగీతం విషయంలో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వస్తోంది. గ్రామోఫోన్‌తో మొదలు పెట్టి ఐపాడ్ వరకు సంగీతం క్వాలిటీ పెరుగుతుంటే సంగీతాన్ని అందించే పరికరాల పరిమాణం తగ్గుతూ వస్తోంది. తాజాగా అమెరికాకు చెందని మసాచుసెట్స్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధన ఫలితాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి.
స్పీకర్లు, ట్వీటర్లు, వూఫర్లు వంటి హంగామా ఏమీ లేకుండా కేవలం ఒక కాగితం సైజు పరిమాణంలో ఉండే పరికరాన్ని రూపొందించారు మసాచుసెట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కాగితంలా సన్నగా, అతి తక్కువ బరువుతో ఉండే ఈ పరికరాన్ని ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. ఏం చక్క సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు,.
వాల్‌పేపర్ స్పీకర్లకు సంబంధించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయంటున్నారు మసాచుసెట్స్ పరిశోధకులు. అయితే పేపర్ థిన్ స్పీకర్ల విషయంలో కీలక దశను అధిగమించామని.. ఇకపై క్వాలిటీ, డ్యూరబులిటీని పెంచడంపైనే దృష్టి పెడతామంటున్నారు. మరికొద్ది రోజుల్లో మ్యూజిక ఇన్‌స్ట్రుమెంట్స్ విషయంలో రివల్యూషనరీ మార్పులు అయితే వస్తాయంటున్నారు.
చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment