lanuched
-
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
బడ్జెట్ ధరలో.. ఇన్‌బిల్ట్ సబ్ వూఫర్స్‌తో మివి సౌండ్‌బార్
భారతదేశపు మొట్ట మొదటి దేశీ సౌండ్ బార్స్ ఫోర్ట్ ఎస్60, ఫోర్ట్ ఎస్100లను మివి సంస్థ లాంఛ్ చేసింది. మివికి చెందిన ఇంజినీర్లు, ఆడియో నిపుణులు ఎన్నో నెలల పాటు శ్రమించి భారతీయ వినియోగ దారుల అభిరుచులకు తగ్గట్టుగా సౌండ్బార్లను మార్కెట్లోకి తెచ్చారు. ఇండియాలో పరిమితంగా ఉండే ఇంటి స్థలం, బాస్‌పై ఉండే మక్కువను దృష్టిలో ఉంచుకుని సౌండ్బార్లోనే ఇన్‌బిల్ట్‌గా సబ్వూఫర్స్ను డిజైన్ చేశారు. ఈ రెండు సౌండ్బార్లు కూడా మివికి చెందిన హైదరాబాద్ తయారీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. మివి ఫోర్ట్ ఎస్ 60, ఫోర్ట్ ఎస్100 లను ఎక్స్ క్లూజివ్గా ఫ్లిప్ కార్ట్‌తో పాటు మివి వెబ్సైట్లో అమ్మకానికి ఉంచారు. వీటి ధరలు వరుసగా రూ.3,499, రూ.4,999లుగా ఉన్నాయి. ఇండియాలో సంగీతాభిమానులు భారీగా ఉన్నారు. అయితే స్థానిక పరిస్థితులు, ఇక్కడి అభిరుచికి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్స్ రావడం లేదు. దిగుమతి అవుతున్న సౌండ్ సిస్టమ్స్ అన్నీ వెస్ట్రన్ స్టైల్‌కి తగ్గట్టుగుఆ ఉంటున్నాయి. అందుకే మన వాళ్లకి తగ్గట్టుగా కొత్త సౌండ్ బార్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు మివి సహవ్యవస్థాపకులు, సీఎంఓ మిదుల దేవభక్తుని తెలిపారు. ఫీచర్స్ - 2.2 చానల్ సరౌండ్ – సౌండ్ అనుభూతి - వీడియో, గేమ్స్‌కి తగ్గట్టుగా సంగీతం - స్లిమ్ అండ్ స్లీక్ వాల్మౌంటెండ్ డిజైన్ - బ్లూ టూత్, ఎయూఎక్స్, కోయాక్సియల్, యూఎస్బీ - ప్లగ్ అండ్ ప్లే ఆపరేటింగ్ - మ్యూజిక్, మూవీ, న్యూస్ మోడ్ ఆప్షన్లు -
భారత్‌లో డుకాటీ హైపర్‌మోటార్డ్ 950
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ డుకాటీ తాజాగా భారత్‌లో హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో హైపర్‌మోటార్డ్ 950 ఆర్వీఈ రూ.12.99 లక్షలు, హైపర్‌మోటార్డ్ 950 ఎస్పీ రూ.16.24 లక్షలు ఉంది. ట్విన్ సిలిండర్ ఇంజన్, 114 హెచ్‌పీ పవర్, 14.5 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్, స్పోర్ట్, టూరింగ్ మోడ్స్‌తో రూపొందించింది. హూపర్మెటార్డ్ 950 బైక్ డెలివరీలు ప్రారంభం అయినట్టు డుకాటీ తెలిపింది. అంతర్జాతీయంగా విజయవంతం కావడంతో ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేసినట్టు వివరించింది. -
రెడ్ మీ నోట్ 4 వచ్చేసిందోచ్!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమి క్రేజీ రెడ్ మీ నోట్ 4 కొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రెడ్ మీ నోట్ 3 స్మార్ట్ ఫోన్ తో ఫోన్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న షియోమి 2017 ఆర్థిక సంవత్సరంలో తొలి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ నోట్ 4 ఎలిగెంట్ డిజైన్ తో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వీటి ధరలను వరుసగా రూ. 9,999,(2జీబీ) రూ.10,999 (3 జీబీ) ధరను రూ. 12, 999 (4జీబీ) గా కంపెనీ నిర్ణయించింది. సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో 5.5 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే(రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్) డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ కెమెరా, f/2.0 అపెర్చ్యూర్ 85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2జీబీ/3జీబీ ర్యామ్, 16జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్ఫేస్ 4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎస్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాముల బరువు కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది.