రెడ్ మీ నోట్ 4 వచ్చేసిందోచ్!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమి క్రేజీ రెడ్ మీ నోట్ 4 కొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రెడ్ మీ నోట్ 3 స్మార్ట్ ఫోన్ తో ఫోన్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న షియోమి 2017 ఆర్థిక సంవత్సరంలో తొలి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ నోట్ 4 ఎలిగెంట్ డిజైన్ తో భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వీటి ధరలను వరుసగా రూ. 9,999,(2జీబీ) రూ.10,999 (3 జీబీ) ధరను రూ. 12, 999 (4జీబీ) గా కంపెనీ నిర్ణయించింది. సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది.
షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు
2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే(రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్)
డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ కెమెరా, f/2.0 అపెర్చ్యూర్
85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2జీబీ/3జీబీ ర్యామ్, 16జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ
128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రార్డ్ సెన్సార్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్‌ఫేస్
4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్‌బీ, బ్లూటూత్, జీపీఎస్
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
175 గ్రాముల బరువు
కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది.