Groom & his brother dead as home theatre, a wedding gift explodes - Sakshi
Sakshi News home page

ఎంతటి విషాదం! బాంబులా పేలిన గిఫ్ట్‌.. పెళ్లైన రెండు రోజులకే..

Published Tue, Apr 4 2023 12:34 PM | Last Updated on Tue, Apr 4 2023 1:29 PM

Wedding Gift Home Theatre Explosion Groom, Brother Killed Chattisgarh - Sakshi

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు కానీ పెళ్లైన రెండు రోజులకే ఓ వరుడు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే ఆ వధువు కలలు కలలుగానే మిగిలిపోయింది. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని చమరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి ఇటీవల అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

పెళ్లలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి రకరకాల బహుమతులు వచ్చాయి. సోమవారం ఉదయం ప్రాంతంలో హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్‌ చేసి చూస్తున్నారు. అందులో వారికి ఒక హోమ్ థియేటర్‌ ఉంది. పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులతో కలిసి బహుమతిగా వచ్చిన హోమ్‌ థియేటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్‌ చేశాడు. అయితే ఒక్కసారిగా హోమ్‌ థియేటర్‌ పేలింది.

పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయి గోడ కూలిపోవడంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఫోరెన్సిక్స్ నివేదిక వచ్చే వరకు ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది ప్రమాదవశాత్తు పేలిందా లేదా మరేదైన కుట్ర దాగుందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement