భారతదేశపు అతిపెద్ద రిటైలర్ అయిన 'రిలయన్స్ రిటైల్ లిమిటెడ్' హర్మాన్ భాగస్వామ్యంతో ఏకంగా ఆరు హోమ్ థియేటర్స్ కలిగిన ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. బీపీఎల్ బ్రాండ్‌తో ప్రారంభమైన ఈ టీవీలు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ అయిన స్పీకర్ మాడ్యూల్స్ పొందుతాయి. కాబట్టి యూజర్లు మంచి ఆడియో అనుభవాన్ని పొందవచ్చు. ఇది థియేటర్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్లో మంచి క్వాలిటీ మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆడియో సిస్టం కలిగి ఉన్న టీవీల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ రిటైల్ ఈ కొత్త ఎల్ఈడీ టీవీ లాంచ్ చేసింది. ఇది ఆడియో ఈఎఫ్ఎక్స్ ట్యూనింగ్ సాఫ్ట్‌వేర్ పొందటమే కాకుండా.. నాలుగు ఏఐ అల్గారిథమ్‌లను పొందుతుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడు వారి ఇళ్లలో సౌకర్యవంతంగా సినిమాటిక్ అనుభూతిని పొందగలరని సంస్థ వెల్లడిస్తోంది.
రిలయన్స్ బీపీఎల్ హోమ్ థియేటర్ ఎల్ఈడీ టీవీలు.. సరికొత్త క్యూఎల్ఈడీ, 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే పొందుతాయి. ఈ ఎల్ఈడీ టీవీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లు, పెద్ద ఫార్మాట్ స్టోర్‌లలో, లేటెస్ట్ రిటైల్ అవుట్‌లెట్‌లలో, జియో మార్ట్.కామ్, రిలయన్స్ డిజిటల్.ఇన్ వంటి ఈకామర్స్ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment