LED TV
-
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం.. రిలయన్స్ కొత్త ఎల్ఈడీ టీవీ
భారతదేశపు అతిపెద్ద రిటైలర్ అయిన 'రిలయన్స్ రిటైల్ లిమిటెడ్' హర్మాన్ భాగస్వామ్యంతో ఏకంగా ఆరు హోమ్ థియేటర్స్ కలిగిన ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. బీపీఎల్ బ్రాండ్‌తో ప్రారంభమైన ఈ టీవీలు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ అయిన స్పీకర్ మాడ్యూల్స్ పొందుతాయి. కాబట్టి యూజర్లు మంచి ఆడియో అనుభవాన్ని పొందవచ్చు. ఇది థియేటర్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం మార్కెట్లో మంచి క్వాలిటీ మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆడియో సిస్టం కలిగి ఉన్న టీవీల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ రిటైల్ ఈ కొత్త ఎల్ఈడీ టీవీ లాంచ్ చేసింది. ఇది ఆడియో ఈఎఫ్ఎక్స్ ట్యూనింగ్ సాఫ్ట్వేర్ పొందటమే కాకుండా.. నాలుగు ఏఐ అల్గారిథమ్‌లను పొందుతుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడు వారి ఇళ్లలో సౌకర్యవంతంగా సినిమాటిక్ అనుభూతిని పొందగలరని సంస్థ వెల్లడిస్తోంది.రిలయన్స్ బీపీఎల్ హోమ్ థియేటర్ ఎల్ఈడీ టీవీలు.. సరికొత్త క్యూఎల్ఈడీ, 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే పొందుతాయి. ఈ ఎల్ఈడీ టీవీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లు, పెద్ద ఫార్మాట్ స్టోర్లలో, లేటెస్ట్ రిటైల్ అవుట్లెట్లలో, జియో మార్ట్.కామ్, రిలయన్స్ డిజిటల్.ఇన్ వంటి ఈకామర్స్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. -
వామ్మో రూ. 1.15 కోట్లు.. ఇది టీవీ ధర!
Samsung Micro LED TV: కోటి రూపాయల కంటే ఖరీదైన టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా? రూ.1 కోటి కంటే ఎక్కువ ఖరీదు చేసే టీవీని ప్రముఖ టెలివిజన్ కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. 110-అంగుళాల భారీ మైక్రో ఎల్ఈడీ టీవీని రూ. 1,14,99,000 ధరకు శాంసంగ్ తాజాగా లాంచ్ చేసింది. అల్ట్రా-ప్రీమియం వీక్షణ అనుభవాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం మైక్రో ఎల్ఈడీ టీవీని రూపొందించనట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ శామ్సంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు. శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ ఆగస్ట్ 2 నుంచి దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ అధీకృత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. టీవీ ప్రత్యేకతలివే.. 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్ఈడీ అంటే పెద్ద సైజు ఎల్ఈడీలలో 1/10వ వంతు. ఆకట్టుకునే డెప్త్, వైబ్రెంట్ కలర్స్, అధిక స్థాయి స్పష్టత, కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీలో మైక్రో ఎల్ఈడీతోపాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఉన్నాయి. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. అద్భుతమైన త్రీడీ సౌండ్, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. మైక్రో ఏఐ ప్రాసెసర్ మల్టీ-ఇంటెలిజెన్స్ ఏఐ అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్పాన్షన్+ పాత వీడియోలను కూడా మెరుగ్గా ప్రదర్శిస్తుంది. -
చందమామ రావే... రోలర్ కోస్టర్ తేవే! రూపాయి ఖర్చు లేకుండా!
పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఆస్తులు ఏం ఉంటాయి? ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోను చూస్తే... ‘నిజమే సుమీ!’ అనిపిస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేసే వాటిలో రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఒకటి. అయితే బయటికి పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఆనందంలో భాగం చేయడానికి టైమ్ సరిపోవడంతో పాటు డబ్బులు కూడా సరిపోవాలి. ఈ వైరల్ వీడియో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్ఈడీ టీవీతో ‘రోలర్ కోస్టర్ రైడ్’ను ఇంట్లోకి తీసుకువచ్చారు. సాఫ్ట్ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను కూర్చోబెట్టారు. చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు. టీవీలో రోలర్ కోస్టర్ వర్చువల్ వీడియోను ప్లే చేశారు. పాప ఆ రైడ్‌లో భాగం అయింది. సంతోషంతో నవ్వుతూనే ఉంది! View this post on Instagram A post shared by Kaashvi Rathore (@princess_point_.l) -
అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!
మీరు తక్కువ బడ్జెట్లో ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. కేవలం 7వేల రూపాయలకు ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో ఫీచర్లు పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గుతున్నాయి. గతంలో ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 32 ఇంచెస్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్ టీవీ రూ. 10వేలు లోపే దొరుకుతోంది. తాజాగా అమెజాన్ రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్ టీవీ తన కస్టమర్లకు అందిస్తోంది. అమెజాన్ అదిరిపోయే ఆఫర్ VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర చూస్తే బడ్జెట్లోనే దొరుకుతోంది. ఎలా అంటే కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999 ఉండగా, అమెజాన్ వెబ్సైట్లో 48% డిస్కౌంట్‌ను లభ్యమవుతోంది. ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్టలతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్‌లు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్‌కు అమెజాన్ బంపరాఫర్! -
కళ్ళు చెదిరే ధరలో.. 43 ఇంచెస్ LED TV..
-
ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
లక్నో: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. దాదాపుగా అన్ని ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలే ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని వినియోగించటంలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాలపైకి వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని ఓ ఇంటిలో ఎల్ఈడీ టీవీ పేలిపోయి 16 ఏళ్ల అమరేందర్ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. తన స్నేహితులతో కలిసి బాధితుడు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడలు సైతం బీటలువారాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. ఈ ఘటనలో బాధితుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా టీవీలు పేలిన సంఘటనలు చాలా అరుదు. దీనికి గల కారణాలపై నిపుణులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడకు బిగించిన ఎల్ఈడీ టీవీ పేలటం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.’ అని గాజియాబాద్ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. టీవీ పేలిపోవటంతో గోడలకు ఏర్పడిన పగుళ్లు ఎల్ఈడీ టీవీ బ్లాస్ట్‌కు కారణాలు.. ►పాత, నకిలీ కెపాసిటర్: ఎల్ఈడీ టీవీలు పేలడానికి ప్రధానంగా పాత లేదా నకిలీ కెపాసిటర్ కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన స్థాయిలో కెపాసిటర్ విద్యుత్తును సరఫరా చేస్తుంది. అయితే, కెపాసిటర్ వల్ల ఆ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు. ► ఓల్టేజ్ హెచ్చుతగ్గులు: విద్యుత్తు ఓల్టెజ్ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయి. ► ఓవర్ హీట్: టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్లతో కనెక్ట్ చేస్తే ఓవర్ హీట్ అవుతుంది. నకిలీ కెపాసిటర్ లాగే ఓవర్ హీట్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ►నిర్వహణ లేకపోవటం: టీవీని గోడకు బిగించామంటే దానిని పట్టించుకోరు. నిర్వహణ సరిగా లేకపోవటం, రిపేర్లు సరైన రీతిలో చేయించకపోవటం వంటివి సైతం పేలడానికి దారితీస్తాయి. రిపేర్ వచ్చినప్పుడు సరైన సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాలి. రిపేర్ కోసం నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలి. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ హక్కుల గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
జనాలు ఈ 'టీవీ' బ్రాండ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్జీ నిలిచింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీ అవార్డు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. -
మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా ఇలా మార్చేయండి....!
ప్రస్తుత కాలంలో టీవీలు లేని ఇళ్లు ఉన్నాయంటే చాలా అరుదు. పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చును. ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లోని పాత ఎల్ఈడీ లేదా ఎల్సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లను ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చును. ప్రస్తుతం మీ ఇంట్లోని టీవీలకు హెచ్డీఎమ్ఐ పోర్ట్ ఉన్నట్లయితే స్మార్ట్ టీవీలుగా ఇట్టే మార్చేయచ్చు. దాంతో పాటుగా ఇంట్లో వై-ఫై కనెక్టివీటి కూడా అవసరం. మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్లో పలు రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. 1. అమెజాన్ ఫైర్ స్టిక్ అమెజాన్ ఫైర్ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. అలెక్సానుపయోగించి వాయిస్ కంట్రోల్ ద్వారా ఓటీటీ యాప్‌లను ఇట్టే పొందవచ్చును. ఫైర్ స్టిక్‌ను హెచ్డీఎమ్ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్ చేయాలి. దీని ధర రూ. 3,999. 2. టాటా స్కై బింజీ+ టాటా స్కై బింజీ సెటప్ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చును. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్ ఫీచరును ఏర్పాటు చేశారు. హెచ్డీఎమ్ఐ పోర్ట్‌తో స్మార్ట్ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999. 3. షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే బాక్స్‌తో మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ గాడ్జెట్‌తో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్డీఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3,499. 4.యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4 కే బాక్స్ యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్ఈడీ టీవీలను స్మార్ట్ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499. 5. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఉండడటంతో వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చును దీని ధర రూ. 3,999. -
ఈ మైక్రో ఎల్ఈడి టీవీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
శామ్సంగ్ తన మైక్రో ఎల్ఈడీ టీవీని 'ది వాల్' పేరుతో రెండవ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన దానికంటే ప్రకాశవంతంగా ఉంది. ది వాల్ కొత్త వెర్షన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే దీని ధర ఎంత అనేది తెలిస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతారు. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన మొదటి-జెన్ వెర్షన్ 110 అంగుళాల వెర్షన్ ధరనే $156000 (సుమారు ₹1,16,10,612)గా ఉంది. 2021 మైక్రో ఎల్ఈడీ టీవీ 'ది వాల్' ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి దీని ధర మొదటి-జెన్ వెర్షన్ కంటే (రూ.కోటి కంటే) ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ది వాల్ మైక్రో ఎల్ఈడీ టీవీ అనేది 1,000 అంగుళాల డిస్ ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 16కె రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ కొత్త వెర్షన్లో అందించిన ఎల్ఈడీ ప్యాన్సల్స్ హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శామ్సంగ్ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీని డిస్ ప్లే వెడల్పు చిన్నదిగా ఉంటుంది. శామ్సంగ్ పేర్కొన్న ప్రకారం.. ఇది వాల్, రిటైల్ స్థలాలు, ఐటీ కార్యాలయ భవనాలలో, షాపింగ్ మాల్స్ లో వినియోగించడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. ఇందులో హై-ఎండ్ హోమ్ థియేటర్ సెటప్ ఉంది. -
మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్!
వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ కొత్త టీవీని లాంచ్ చేసింది. సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ ఈడీ సిరీస్ కింద ఈ స్మార్ట్ టీవీని విడుదల చేస్తున్నట్లు సోనీ ప్రతినిధులు తెలిపారు. దీని ధర రూ.2.99లక్షలుగా నిర్ణయించారు. ఫీచర్స్ విషయానికొస్తే ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ఇంచెంస్ : 65 అంగుళాలు ఓఎల్ఇడి ప్యానెల్ ఎక్స్ ఆర్ కాగ్నిటీవ్ ప్రాసెసర్. ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్ ద్వారా ఎకౌస్టిక్ సర్ఫేస్ ఆడియోని 3డి సరౌండ్ అప్‌స్కేలింగ్‌తో జాగ్రత్త తీసుకుంటుంది. కొత్త బ్రేవియా టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేందుకు వీలుగా బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జె డిజైన్ చేసినట్లు, అందులో గేమ్ మోడ్, హెచ్డిఎంఐ 2.1 సపోర్ట్, 4 కె 120 ఎఫ్పిఎస్, విఆర్ఆర్, ఎల్ఎల్ఎం ఉన్నాయి. గేమ్‌ను ఆస్వాధించి, ధ్వనిని ఆప్టిమైజ్ చేసే యాంబియంట్ ఆప్టిమైజేషన్, లైట్ సెన్సార్,ఎకౌస్టిక్ ఆటో-కాలిబ్రేషన్ ఇందులో ఇమిడి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ , గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలెక్సా స్మార్ట్ పరికరాలు, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్కిట్లతో కూడా పనిచేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చా? నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడి లో ఉపయోగించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలర్, కాంట్రాస్ట్, తదితర ఫీచర్లు హుమన్ బ్రెయిన్ తరహాలో విశ్లేషిస్తుంది. ఈ ఏఐ వల్ల టీవీలో వచ్చే దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సందర్భంగా సోనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలో 77 అంగుళాల వేరియంట్‌తో సహా ఈ సిరీస్‌లో కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. చదవండి: Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?! -
ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు
దేశంలో ఎల్ఈడీ టీవీల ధరలకు ఏప్రిల్ 1 నుంచి రెక్కలు రానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ దారులు పేర్కొంటున్నారు. గత నెల రోజుల్లోనే ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు 35 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ఎల్ జీ కంపెనీ టీవీల ధరలను పెంచింది. పానసోనిక్, హయర్, థామ్సన్ వంటి సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. మరోవైపు హయర్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్స్ అనేవి చాలా కీలకమైనవి. మొత్తం టీవీ తయారు ఖర్చులో 60 శాతం కేవలం ఓపెన్ సెల్ ప్యానెల్స్‌కు ఖర్చుకానుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈవో అవనీత్ సింగ్ మర్వా వెల్లడించారు. కంపెనీలు అన్నీ కూడా ఓపెన్ సెల్ దశలో ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకొని తర్వాత వాటిని అసెంబుల్ చేస్తాయి. చదవండి: సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్ -
బీహార్: పాట్నాలో భారీ చోరీ
-
టీవీ ధరలు దిగొస్తాయ్!
న్యూఢిల్లీ : దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ తయారీ ఖర్చులు 3 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే చిప్ ఆన్ ఫిల్మ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీఏ), సెల్ (గ్లాస్‌బోర్డు/సబ్‌స్ట్రేట్)పైనా దిగుమ తి సుంకాన్ని రద్దు చేస్తు్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. డిమాండ్ తగ్గడంతో దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ కొంత కాలంగా కోరుతోంది. 15.6 అంగుళాలు అంతకుమించిన కూడిన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానళ్లలో ఓపెన్ సెల్‌లపై ప్రస్తుతం 5% దిగుమతి సుంకం అమల్లో ఉండగా, ఇకపై ఉండదని బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రముఖ జపనీస్ కంపెనీ ప్యానాసోనిక్ మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. 3–4% వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60–70% ఓపెన్‌సెల్ ప్యానళ్లకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలోని టీవీ తయారీ కంపెనీలు చాలావరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. 2017 జూన్‌లో టీవీ ప్యానెళ్లపై కేంద్రం ఈ దిగుమతి సుంకాన్ని ప్రవేశపెట్టింది. దేశీ టీవీ మార్కెట్ రూ.22,000 కోట్లుగా ఉంటుంది. సానుకూల ఫలితాలు.. కేంద్రం నిర్ణయం సానుకూలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ఎల్రక్టానిక్స్ గతేడాది భారత్‌లోని తన టీవీల తయారీ యూనిట్‌ను మూసేసి, వియత్నాంకు తరలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీయే. దేశీయంగా తగ్గిన వినియోగ డిమాండ్ టీవీ సెట్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మందగమనం, మరోవైపు పెరిగిన పోటీ, పెద్ద టీవీలపై జీఎస్టీ రేటు ప్రతికూలతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తయారీదారులకు ఉపశమనం ఇచ్చేదే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమ హర్షాతిరేకం సరిగ్గా పండుగల సీజన్‌కు ముందు టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పరిశ్రమను సంతోషానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయం టీవీల తయారీ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశీయ తయారీని పెంచేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘పరిశ్రమ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. టీవీ తయారీపై ఒత్తిళ్లను ఇది తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టయితే పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుంది. గతేడాది టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదైన తర్వాత సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచి్చంది. టీవీల తయారీ వ్యయంలో అధిక భాగం ఓపెన్ సెల్స్‌పైనే వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పరిశ్రమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయగలదు. ధరలు 3–4 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది’’ అని ప్యానాసోనిక్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం టీవీల ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 32 అంగుళాలపైన టీవీలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని మనీష్ శర్మ కోరారు. అయితే, పండుగల సమయానికి రేట్ల తగ్గింపు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. పండుగల కోసం ఇప్పటికే స్టాక్స్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నూతనంగా దిగుమతి చేసుకునే వాటిపైనే దీని ప్రభావం 3 శాతం వరకు ఉంటుందన్నారు. మేకిన్ ఇండియాకు ఊతం.. ప్రభుత్వ నిర్ణయం భారత్‌లో తయారీని పెంచుతుందని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పేర్కొంది. ‘‘ఇది ఎంతో సానుకూల పరిణామం. ఇది భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా)కి ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది’’ అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా డైరెక్టర్ యూంచల్పార్క్ అన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తొలగించడం భారత్‌లో టీవీల తయారీని పెంచాలన్న తమ ప్రయత్నాలకు సాయపడుతుందని సోనీ ఇండియా సైతం అభివరి్ణంచింది. ‘‘ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమానికి సోనీ ఇండియా చాలా కాలంగా కట్టుబడి ఉంది. టీవీ ఓపెన్‌సెల్ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించడం స్థానిక తయారీకి బలమైన ఊతమిస్తుంది. ఈ దిశగా మేం మరిన్ని చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది’’ అని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. పరిశ్రమ ఈ నిర్ణయం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్బ్రగంజ అన్నారు. వృద్ధిని ప్రోత్సహించే ఏ చర్య అయినా స్వాగతించతగినదేనన్నారు. -
‘బిగ్ స్క్రీన్’పై చిన్న బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ టీవీల మార్కెట్లో ‘అఫర్డబుల్’ విభాగం హవా నడుస్తోంది. 24–55 అంగుళాల శ్రేణిలో పెద్ద బ్రాండ్ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ క్రమంగా తన వాటాను పెంచుకుంటోంది. రూ.7 వేలతో మొదలై రూ.35 వేల శ్రేణిలో అతి తక్కువ ధరలతో టీవీల రంగంలో సంచలనానికి కారణమైన అందుబాటు ధరల (అఫర్డబుల్) విభాగం వాటా ప్రస్తుతం 32 శాతంగా ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరుతుందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుని వాటాను పెంచుకోవచ్చన్నదే ఈ రంగంలోని కంపెనీల ప్రధాన ధీమా. ఎంఐ, కొడాక్, థామ్సన్, బీపీఎల్, హోమ్, టీసీఎల్, శాన్యో, వ్యూ, రికనెక్ట్, ఒనిడా, షార్ప్, స్కైవర్త్, అకాయ్ వంటి బ్రాండ్లు దిగ్గజాలతో పోటీపడుతూ ‘స్మార్ట్’గా మార్కెట్‌ను కైవసం చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇవి పెద్ద తెరల విభాగంలో (32 అంగుళాలకన్నా ఎక్కువ) క్రమంగా తమ వాటాను పెంచుకుంటున్నాయి. ఇదీ ఎల్ఈడీల మార్కెట్.. దేశవ్యాప్తంగా ఎల్ఈడీ టీవీల రంగంలో 70కిపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఏటా 1.4 కోట్ల యూనిట్ల ఎల్ఈడీ టీవీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో అందుబాటు ధరల విభాగానిది 32 శాతం వాటా. వచ్చే అయిదేళ్లలో ఇది 65 శాతానికి చేరడం ఖాయమని భారత్‌లో కొడాక్, థామ్సన్ టీవీ బ్రాండ్ల లైసెన్స్ కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో స్మార్ట్ టీవీల వాటా 70 శాతముంది. అలాగే ఆన్లైన్ విక్రయాలు 27 శాతం, ఆఫ్‌లైన్ అమ్మకాలు ఏకంగా 73 శాతం ఉన్నాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాదిరిగా అందుబాటు ధరల్లో, మంచి ఫీచర్లతో విక్రయించే మోడళ్లే ఇటు టీవీల రంగంలోనూ నిలదొక్కుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అఫర్డబుల్ విభాగంలో హెచ్డీ, ఫుల్ హెచ్డీతోపాటు 4కే టీవీలూ వచ్చేశాయి. రూ.22,000 కోట్ల ఎల్ఈడీ టీవీల విపణిలో 43–55 అంగుళాల విభాగం వాటా 30 శాతముంది. ఈ విభాగమే వేగంగా వృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ఆసరాగా.. ఆఫ్‌లైన్ విభాగంలో లార్జ్ ఫార్మాట్ స్టోర్లయినా, చిన్న దుకాణమైనా పెద్ద బ్రాండ్ల హవానే నడుస్తోంది. ఆ స్థాయిలో దుకాణాల్లో స్థలాన్ని పెద్ద కంపెనీలు ఆక్రమించేశాయి. చిన్న బ్రాండ్లకు చోటు లేకుండా పోయింది. దీంతో చిన్న కంపెనీలు ఆన్‌లైన్‌ను ఆశ్రయించాయి. అఫర్డబుల్ సెగ్మెంట్ బ్రాండ్ల టీవీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఏకంగా 70 శాతముందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘ఉదాహరణకు టీవీ కోసం ఒక కస్టమర్ వెచ్చించే స్థాయి రూ.30 వేలు అనుకుందాం. పెద్ద కంపెనీతో పోలిస్తే అందుబాటు ధరలో లభించే బ్రాండ్‌లో ఈ వ్యయంతో పెద్ద తెరతో టీవీ వస్తుంది. అలాంటప్పుడు వినియోగదారుడు పెద్ద టీవీ వైపే మొగ్గు చూపుతాడు. పైపెచ్చు నాణ్యత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఫీచర్లు అంటారా బోలెడన్ని ఉంటున్నాయి’ అని ఓ విక్రేత వివరించారు. చిన్న బ్రాండ్లు సర్వీసింగ్‌పై మరింత ఫోకస్ చేస్తే అమ్మకాలు అధికం అవుతాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కర్ మూర్తి అభిప్రాయపడ్డారు. అఫర్డబుల్ బ్రాండ్ల టీవీల స్క్రీన్ శాంసంగ్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్లు తయారు చేసినవే ఉంటున్నాయి. -
ఖైదీలకు టీవీలు, సోఫాలా?
న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు.. తీహార్ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. -
ఎల్ఇడి టీవీలను లాంచ్ చేసిన పూజారా గ్రూప్
-
మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన షావోమి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్‌ను, ఫిట్నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్‌లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్.... గురువారం షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్‌గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్ యూఐ రిఫ్రెస్తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్‌వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్‌లోనే వాయిస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్డీఆర్ సపోర్ట్‌తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ 3.0 పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 3... షావోమి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎస్ఎంఎస్లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్‌ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్‌ను కూడా దీని స్క్రీన్‌పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్‌ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్..... షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360.... టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్‌ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. -
శాంసంగ్ నుంచి సరికొత్త టీవీ
సాక్షి : కళ్లకు కట్టినట్టు కనిపించే దృశ్యాలను చూస్తూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. అలాంటి అనుభూతిని కలిగించేందుకు శాంసంగ్ సరికొత్త టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. బ్రిక్స్‌బీ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లు, ఎత్తుగడతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నోటి మాట ద్వారా మనకు నచ్చిన సినిమాలను, పాటలను (టీవీలో అంతర్గతంగా ఉండే బ్రిక్స్‌బీ పరికరం సహాయంతో) ప్లే చేయించవచ్చు. ఈ అధునాతన టీవీలు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. శాంసంగ్ స్మార్ట్ వ్యూ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీలో వీక్షించవచ్చు. అదనంగా సరికొత్త ఫీచర్‌తో క్యూఎల్ఈడీ టీవీలు మే నెల చివరికల్లా భారతీయ వినియోగదారులను పలకరించబోతున్నాయి. త్వరలోనే వీటి ధరలను ప్రకటించనున్నట్లు సామ్సాంగ్ అధికారులు తెలిపారు. 4కె రిజల్యూషన్‌తో క్యూఎల్ఈడీ టీవీలను ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నామన్నారు. 85 ఇంచుల తెర, 8కె కృత్రిమ మేధస్సులాంటి ఫీచర్స్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా 2017లో శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీలు ఇండియాలో లాంచ్ చేసింది. ఒక్క నెలలోనే విశేషమైన స్పందన వచ్చింది. డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తాజాగా మరింత వేగంగా దూసుకొస్తోంది. -
ఎల్ఈడీ/ఓఎల్ఈడీ టీవీల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ/ఓఎల్ఈడీ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. మోడల్‌నుబట్టి ధర 2 నుంచి 7 శాతం వరకు అధికమయ్యే చాన్స్ ఉంది. పెరిగిన కస్టమ్స్ డ్యూటీకి అనుగుణంగా తయారీ కంపెనీలు సైతం ధరల సవరణకు దిగడమే ఇందుకు కారణం. 7.5 శాతం ఉన్న దిగుమతి పన్నును తాజా బడ్జెట్లో 15 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీల విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. డ్యూటీని 10 శాతానికి కుదించాల్సిందిగా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ధరల సవరణకు దిగింది. ఎల్ఈడీ, ఓఎల్ఈడీ రంగంలో రెండేళ్లుగా పెద్దగా వృద్ధి లేదని, ధరలు పెరిగితే స్వల్పకాలంలో డిమాండ్ తగ్గుతుందని సియామా చెబుతోంది. ఇదే జరిగితే తయారీ కంపెనీల విస్తరణ పరిమితమవుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ శర్మ పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతుందన్నారు. ఒకదాని వెంట ఒకటి.. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మోడళ్ల ధర 2–7 శాతం అధికం కానుందని కంపెనీ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం బిజినెస్ హెడ్ నీరజ్ బహల్ తెలిపారు. ధరల సవరణ విషయంలో సామ్సంగ్ సైతం ఇదే బాటలో నడవనుంది. ధరల పెంపు తప్పదని, ఏ మేరకు పెంచాలో అన్న అంశంపై కసరత్తు చేస్తున్నామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ కి వాన్ కిమ్ వ్యాఖ్యానించారు. విక్రయ ధర అధికమైతే మధ్య, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు సోనీ ఇండియా బ్రేవియా బిజినెస్ హెడ్ సచిన్ రాయ్ పేర్కొన్నారు. టీవీల విక్రయాలు గత కొన్నేళ్లుగా వృద్ధిబాటలో ఉన్నాయని, మొత్తం పరిశ్రమను చూస్తే పెంపు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, దేశీయంగా తయారీని పెంచడానికే దిగుమతి పన్ను పెంపు అని ప్రభుత్వం చెబుతోంది. -
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఎల్ఈడీ టీవీలు
► వాటి ద్వారా ఆరోగ్య సూత్రాలు, సలహాలు ప్రసారం ► ఈఎస్ఐసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కార్మిక రాజ్య బీమా ఆస్పత్రుల్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయను న్నారు. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొ రేషన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న డిస్పెన్సరీల్లోనూ ఎల్ఈడీ తెరలు ఏర్పా టు చేయనున్నారు. తెలంగాణ, ఏపీల్లోనే 170కి పైగా డిస్పెన్సరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా డిస్పెన్సరీలున్నట్టు అంచనా. ప్రతి డిస్పెన్సరీలోనూ స్థాయిని బట్టి ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య సలహాలు, సూచ నలు, తీసుకోవాల్సిన జాగ్ర త్తలు గంటకు రెండుసార్లు ఆరోగ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన లు ప్రసారమవుతాయి. టీవీలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు పూజారి సర్వీసెస్ అనే సంస్థ కేంద్రంతో ఒప్పందం కుదు ర్చుకుంది. మరోనెల రోజుల్లో ఈఎస్ఐ ఆస్ప త్రుల్లో టీవీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తవుతుందని ఈఎస్ఐ కార్పొరేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
పాయ్ ఇంటర్నేషనల్ నుంచి ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ తాజాగా ఎల్ఈడీ టీవీలను ప్రవేశపెట్టనుంది. ‘హెన్రీ’ పేరిట వీటిని ఈ పండుగ సీజన్లో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ఎండీ రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు. ఇందుకోసం సుమారు రూ. 40-50 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1,200 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజ్‌కుమార్ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. 2015-16లో టర్నోవరు రూ. 890 కోట్లు. ప్రస్తుతం మొత్తం 80 స్టోర్స్ ఉన్నాయని, ఏటా 10-15 షోరూమ్‌లు నెలకొల్పడంపై దృష్టి పెడుతున్నామని ఆయన వివరించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రస్తుతం అంతర్గతంగాను, బ్యాంకు రుణాల రూపంలోనూ సమకూర్చుకుంటున్నామన్నారు. విస్తరణ ప్రణాళికల అవసరాలను బట్టి వీసీల (వెంచర్ క్యాపిటలిస్టులు) నుంచి దాదాపు రూ. 500 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నేడు 6 షోరూమ్‌లు ప్రారంభం.. : కొత్తగా హైదరాబాద్‌లో మరో ఆరు షోరూమ్‌లు శనివారం ప్రారంభిస్తున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. వీటితో కలిపి తెలంగాణంలో తమకు మొత్తం 15 స్టోర్స్ ఉన్నట్లవుతుందని, దశలవారీగా వీటిని 25కి పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. ఒక్కో షోరూమ్‌కు రూ. 3-5 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు వివరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు. -
గని కార్మికులకు ఎల్ఈడీ టీవీల పంపిణీ
కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణి కార్మికులకు యాజమాన్యం భూపాలపల్లి ఏరియాలో సోమవారం సబ్సిడీపై ఎల్ఈడీ టీవీలను పంపిణీ చేసింది. స్థానిక సింగరేణి భారత్ గ్యాస్ సూపర్బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో యాక్టింగ్ జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు గని కార్మిక కుటుంబాలకు టీవీలను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యా జమాన్యం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైన ఎల్ఈడీ టీవీలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నదని చెప్పారు. త్వర లో మరి న్ని గృహోపకరణ వస్తువులను అంద జేయడానికి సంస్థ చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, గుర్తింపు సంఘం బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, కార్యదర్శి కటకం స్వామి, భారత్ గ్యాస్ డివిజన ల్ మేనేజర్ కె.ప్రకాష్‌రావు, పర్సనల్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్యాంసుందర్, వెల్పేర్ ఆఫీసర్లు మదార్ ఆహ్మద్, రాజేశం సూపర్‌బజార్ మేనేజర్ సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
బోర్డు తిప్పేశారు
► ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రూ.2 కోట్లకు కుచ్చుటోపీ ► రెండు నెలలుగా సంస్థ కార్యాలయానికి తాళం ► లబోదిబోమంటున్న బాధితులు సాక్షి, కర్నూలు: ‘‘షోరూమ్, రెస్టారెంట్, షాపు, సెలూన్.. ఏదైనా పర్వాలేదు.. అందులో మా కంపెనీకి చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకోండి.. నెలకు రూ. 5వేలు అద్దెగా పొందండి’’ ... ఈ ప్రకటన చదివిన వారెవరైనా అబ్బా ఇదేదో మంచి అవకాశం.. షాపులో ఉంటూ ఏం చక్కా ప్రతినెలా రూ. 5వేలు సంపాదించొచ్చు అని ఎగిరి గంతేస్తారు. మన జిల్లాలో వారూ ఇలాగే చేశారు. కంపెనీ షరతులను అంగీకరించి.. వారికి డిపాజిట్ చెల్లించారు. తక్షణమే ఆ కంపెనీ టీవీలు తెచ్చి వారి షాపుల్లో అమర్చింది. రెండు నెలలు అద్దె డబ్బులు వచ్చాయి. మూడో నెల నుంచి అదిగో.. ఇదిగో అంటూ చివరకు చేతులెత్తేశారు. ఇలా డిపాజిట్ రూపంలో సేకరించిన కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ అడ్వటైజింగ్ ఏజెన్సీ నిర్వాకం ఇది. ఇదీ కథ.. అడిటస్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.. హైదరాబాద్ ఏఎస్రావు నగర్ కేంద్రంగా పనిచేస్తోంది. డిజిటల్ యాడ్స్‌కు బ్రాండింగ్ చేయడమే ఈ సంస్థ పని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మన జిల్లాకు సంబంధించి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని యూ కాన్ కాంప్లెక్స్‌లో ఆరునెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘సంస్థకు చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకుని.. ప్రతి రోజూ ఉద యం నుంచి సాయంత్రం వరకు(టీవీ ఆయా వ్యాపార సంస్థల యాడ్స్ వస్తుంటాయి) 9 గంటలపాటు ఆన్‌చేసి ఉంచితే చాలు ప్రతినెలా రూ. 5 వేల అద్దె చెల్లిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో కర్నూలు నగరంతోపాటు ఆదోని, నంద్యాల పట్టణాల్లోని వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువకులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, ఆటో మొబైల్ షాపులు, హాస్పిటల్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు వీరి వలలో పడ్డారు. టీవీ ఏర్పాటు చేయాలంటే అడ్వాన్స్‌గా రూ. 40 వేలు చెల్లించాలని సంస్థ పెట్టిన షరతు మేరకు డీడీలు చెల్లించి టీవీ ఏర్పాటు చేయించుకున్నారు. వీరికి రూ. 5 వేలు చెల్లించే విధంగా కంపెనీ.. మూడు పోస్టు డేటెడ్ చెక్‌లను(పీడీసీ) ఇచ్చింది. మొదటి రెండు నెలలు అందరికీ అద్దె డబ్బులు అందాయి. తర్వాత ఫిబ్రవరి నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. బాధితులు బ్రాంచ్ మేనేజర్‌ను ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ చివరకు నెల రోజులుగా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇలా సుమారు 500 మంది నుంచి వసూలు చేసిన రూ. 2కోట్లకు కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది. కంపెనీ డెరైక్టర్లనుఅడగండి.. అడిటస్ సంస్థ మోసాలను తెలుసుకున్న ‘సాక్షి’.. సంస్థ మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అతని తండ్రి ఫోన్లో మాట్లాడాడు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. కంపెనీకి డెరైక్టర్లున్నారని, వారి నుంచి వివ రణ తీసుకోవాలన్నారు. నోటీసులు పంపారు.. మాకు నెలసరి అద్దె చెల్లించకపోగా ప్రస్తుతం కంపెనీ డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదంటూ మాకు నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు న్యాయం. ఇలాంటి వారి నుంచి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటే మంచిది -
ఎల్ఈడీ టీవీ పనిచేసేదిలా.. హౌ ఇట్ వర్క్స్?
టెలివిజన్... స్మార్ట్‌ఫోన్... ట్యాబ్లెట్... కంప్యూటర్ మానిటర్.. వీటన్నింటిలో కామన్ ఏమిటో చెప్పుకోండి? మీ అంచనా కరెక్టే. ఎల్సీడీ లేదా ఎల్ఈడీ డిస్ప్లే. ఈ గాడ్జెట్లతో మనం రోజంతా గడిపేస్తూంటాం. అటు వినోదం... ఇటు విజ్ఞానమూ పొందుతూంటాం. బాగానే ఉంది. కానీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే చిత్రాలు ఆ తెరపై ఎలా ప్రత్యక్షమవుతాయో మీకు తెలుసా? ఆ అద్భుతమెలా సాధ్యమవుతోందో చూసేయండి మరి.. ప్రతి ఎల్ఈడీ డిస్ప్లేలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి బ్యాక్‌లైట్. రెండోది డిస్ప్లే మ్యాట్రిక్స్. బ్యాక్‌లైట్ కోసం ఎల్ఈడీలు ఉపయోగిస్తే అది ఎల్ఈడీ టీవీ, కోల్డ్ కాథోడ్ ఫ్లోరసెంట్ ల్యాంప్‌ను వాడితే అది ఎల్సీడీ. లైట్ పోలరైజేషన్ అన్న భౌతిక సిద్ధాంతం ఆధారంగా డిస్ప్లే మ్యాట్రిక్స్ పనిచేస్తుంది. వీడియో చిత్రాల తాలూకూ సమాచారం రేడియో తరంగాల రూపంలో తీగల గుండా ప్రయాణిస్తాయి. ధ్వని సంకేతాలన్నీ ఆడియో సర్క్యూట్ ద్వారా లౌడ్స్పీకర్లోకి ప్రయాణించి శబ్దాలు వినిపించేలా చేస్తే... వీడియో సంకేతాలు మన టీవీ తెరపై ఉండే పిక్చర్ ఎలిమెంట్స్ లేదా పిక్సెళ్ల గుండా ప్రయాణిస్తాయి. ఈ పిక్సెళ్ల మధ్యభాగంలో ఉండే లిక్విడ్ క్రిస్టల్స్ ప్రవహించే విద్యుత్తును బట్టి ఏ రకమైన కాంతి ప్రసారం కావాలో నిర్ణయిస్తాయి. స్క్రీన్‌పై ఉండే వేలాది పిక్సెళ్లలో ఈ ప్రకియ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వీడియో సంకేతాలు దృశ్యంగా మారి మనకు తెరపై కనిపిస్తాయి. -
వీడియోకాన్ విండోస్ 10 తొలి ఎల్ఈడీ టీవీ
* పీసీగానూ వినియోగానికి వీలు.. * 32 అంగుళాల టీవీ @ రూ.39,990 * 40 అంగుళాల టీవీ @ రూ.52,990 హైదరాబాద్: వీడియోకాన్ కంపెనీ- విండోస్ 10 ఓఎస్ ఆధారిత తొలి ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ టీవీని తెస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌గా కూడా పనిచేసే ఈ తొలి హైబ్రిడ్ టీవీ విక్రయాలు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని వీడియోకాన్ హెడ్(టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. విండోస్ 10 పై పనిచేసే తొలి టీవీ ఇదేనని తెలిపారు. బాగా అమ్ముడయ్యే 32, 40 అంగుళాల టీవీలనే మార్కెట్లోకి తెచ్చామని, 32 అంగుళాల టీవీ ధర రూ.39,990, 40 అంగుళాల టీవీ ధర రూ.52,990 అని వివరించారు. వినియోగదారుల స్పందనను బట్టి 24, 55, 65 అంగుళాల టీవీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మారుతున్న కాలంలో, వినియోగదారుల అవసరాలకనుగుణంగా ప్రపంచంలోనే ఈ తొలి హైబ్రిడ్ టీవీని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ టీవీలో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2జీబీ ర్యామ్, ఇన్‌బిల్ట్ వై-ఫై, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్టర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. విండోస్ 10కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని వినీత్ దురాని చెప్పారు. ఈ వినూత్నమైన టీవీతో విండోస్ 10ను మరింత మందికి చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు.