Samsung Unvelis Next Gen Wall Micro LED Tv More Tinner - Sakshi
Sakshi News home page

Samsung The Wall: ఈ మైక్రో ఎల్ఈడి టీవీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published Sun, Jul 25 2021 2:52 PM | Last Updated on Sun, Jul 25 2021 4:41 PM

Samsung Next Gen The Wall micro LED TV is More Thinner - Sakshi

శామ్‌సంగ్‌ తన మైక్రో ఎల్ఈడీ టీవీని 'ది వాల్' పేరుతో రెండవ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన దానికంటే ప్రకాశవంతంగా ఉంది. ది వాల్ కొత్త వెర్షన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే దీని ధర ఎంత అనేది తెలిస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతారు. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన మొదటి-జెన్ వెర్షన్ 110 అంగుళాల వెర్షన్ ధరనే $156000 (సుమారు ₹1,16,10,612)గా ఉంది. 2021 మైక్రో ఎల్ఈడీ టీవీ 'ది వాల్' ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి దీని ధర మొదటి-జెన్ వెర్షన్ కంటే (రూ.కోటి కంటే) ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.    

ది వాల్ మైక్రో ఎల్ఈడీ టీవీ అనేది 1,000 అంగుళాల డిస్ ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 16కె రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ కొత్త వెర్షన్‌లో అందించిన ఎల్‌ఈడీ ప్యాన్సల్స్ హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శామ్‌సంగ్‌ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీని డిస్ ప్లే వెడల్పు చిన్నదిగా ఉంటుంది. శామ్‌సంగ్‌ పేర్కొన్న ప్రకారం.. ఇది వాల్, రిటైల్ స్థలాలు, ఐటీ కార్యాలయ భవనాలలో, షాపింగ్ మాల్స్ లో వినియోగించడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. ఇందులో హై-ఎండ్ హోమ్ థియేటర్ సెటప్ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement