Samsung Launches Micro LED TV With 110-Inch Screen In India: Check Price And Specifications - Sakshi
Sakshi News home page

Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్‌లోకి అత్యంత ఖరీదైన టీవీ

Published Wed, Aug 2 2023 5:37 PM | Last Updated on Wed, Aug 2 2023 5:56 PM

samsung launches micro led tv 110 inch price above rs 1 crore - Sakshi

Samsung Micro LED TV: కోటి రూపాయల కంటే ఖరీదైన టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా? రూ.1 కోటి కంటే ఎక్కువ ఖరీదు చేసే టీవీని ప్రముఖ టెలివిజన్‌ కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. 110-అంగుళాల భారీ  మైక్రో ఎల్‌ఈడీ టీవీని రూ. 1,14,99,000 ధరకు శాంసంగ్‌ తాజాగా లాంచ్‌ చేసింది. 

అల్ట్రా-ప్రీమియం వీక్షణ అనుభవాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం మైక్రో ఎల్‌ఈడీ టీవీని రూపొందించనట్లు శాంసంగ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ  శామ్‌సంగ్ మైక్రో ఎల్‌ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు. శాంసంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ టీవీ ఆగస్ట్‌ 2 నుంచి దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో, శాంసంగ్‌ అధీకృత వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంటుంది.

టీవీ ప్రత్యేకతలివే.. 

  • 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్‌ఈడీ అంటే పెద్ద సైజు ఎల్‌ఈడీలలో 1/10వ వంతు. 
  • ఆకట్టుకునే డెప్త్, వైబ్రెంట్ కలర్స్, అధిక స్థాయి స్పష్టత, కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి. 
  • మైక్రో ఎల్‌ఈడీ టెక్నాలజీలో మైక్రో ఎల్‌ఈడీతోపాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్‌డీఆర్‌, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఉన్నాయి.
  • ఓటీఎస్‌ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్‌ సిస్టమ్‌ ఇందులో ఉంటుంది. అద్భుతమైన త్రీడీ సౌండ్, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. 
  • మైక్రో ఏఐ ప్రాసెసర్ మల్టీ-ఇంటెలిజెన్స్ ఏఐ అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్+ పాత వీడియోలను కూడా మెరుగ్గా ప్రదర్శిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement