దేశంలో ఎల్ఈడీ టీవీల ధరలకు ఏప్రిల్ 1 నుంచి రెక్కలు రానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ దారులు పేర్కొంటున్నారు. గత నెల రోజుల్లోనే ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు 35 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ఎల్ జీ కంపెనీ టీవీల ధరలను పెంచింది. పానసోనిక్, హయర్, థామ్సన్ వంటి సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు.
మరోవైపు హయర్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్స్ అనేవి చాలా కీలకమైనవి. మొత్తం టీవీ తయారు ఖర్చులో 60 శాతం కేవలం ఓపెన్ సెల్ ప్యానెల్స్‌కు ఖర్చుకానుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈవో అవనీత్ సింగ్ మర్వా వెల్లడించారు. కంపెనీలు అన్నీ కూడా ఓపెన్ సెల్ దశలో ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకొని తర్వాత వాటిని అసెంబుల్ చేస్తాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment