panasonic company
-
ఆంధ్రప్రదేశ్‌లో ప్యానాసోనిక్ ప్లాంటు ప్రారంభం.. సౌత్‌లో ఇదే ఫస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటును ప్రారంభించింది. ఎలక్ట్రికల్ ఉత్పత్తుల విభాగంలో సంస్థకు దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది. రెండు దశలకుగాను మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఇప్పటికే రూ.300 కోట్లు వ్యయం చేశారు. వైరింగ్ డివైసెస్ అయిన రోమా, పెంటా మాడ్యులర్, రోమా అర్బన్ బ్రాండ్ల ఉత్పత్తులు తొలుత ఇక్కడ తయారు చేస్తారు. రానున్న రోజుల్లో స్విచ్గేర్స్, వైర్స్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఉత్పత్తులను రూపొందిస్తారు. చదవండి: మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!
దేశంలో మరోసారి టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4 శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు
దేశంలో ఎల్ఈడీ టీవీల ధరలకు ఏప్రిల్ 1 నుంచి రెక్కలు రానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ దారులు పేర్కొంటున్నారు. గత నెల రోజుల్లోనే ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు 35 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ఎల్ జీ కంపెనీ టీవీల ధరలను పెంచింది. పానసోనిక్, హయర్, థామ్సన్ వంటి సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. మరోవైపు హయర్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్స్ అనేవి చాలా కీలకమైనవి. మొత్తం టీవీ తయారు ఖర్చులో 60 శాతం కేవలం ఓపెన్ సెల్ ప్యానెల్స్‌కు ఖర్చుకానుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈవో అవనీత్ సింగ్ మర్వా వెల్లడించారు. కంపెనీలు అన్నీ కూడా ఓపెన్ సెల్ దశలో ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకొని తర్వాత వాటిని అసెంబుల్ చేస్తాయి. చదవండి: సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్ -
టయోటా– ప్యానాసోనిక్ జట్టు
టోక్యో: ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 15% వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50%కి పెంచుకోవాలనుకుంటున్నట్లు టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందన్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్ కంపెనీకి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. -
టయోటా– ప్యానాసోనిక్ జట్టు
టోక్యో: ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 15% వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50%కి పెంచుకోవాలనుకుంటున్నట్లు టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందన్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్ కంపెనీకి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. Toyota and Panasonic Charge Together Into Electric Car Batteries -
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్ , బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలుగా సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎలుగా ఐ9’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499. శుక్రవారం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 8 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ తమ డివైస్ ప్రత్యేకతలని కంపెనీ వెల్లడించింది. ఎలుగా ఐ9 ఫీచర్లు 5 అంగుళాల 2.5డీ కర్వ్డ్ హెచ్డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోగట్ 7.0 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం 13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇదొక నిజమైన మాయా దర్పణం
టోక్యో: మాయాబజార్ సినిమాలో టీవీలాగా పనిచేసే మాయా దర్పణాన్ని చూశాం. టీవీల ఉత్పత్తుల్లో జపాన్ దిగ్గజమైన పానాసోనిక్ మాయా దర్పణంలా కనిపించే టీవీనే ఇప్పుడు తయారు చేసింది. ఆ టీవీ అచ్చం కబోర్డుకు బిగించిన పారదర్శక అద్దంలా ఉంటుంది. ఆ అద్దం వెనకాలున్న వస్తువులేవైనా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చేతి సైగల ద్వారాగానీ, రిమోట్ ద్వారాగానీ టీవీ ఆన్ చేయగానే పారదర్శక అద్దం కాస్తా టీవీ స్క్రీన్‌గా మారిపోతుంది. టీవీ కార్యక్రమాల ప్రసారాలను పసందుగా వీక్షించవచ్చు. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత పలుచగా టీవీ స్క్రీన్ ఉండడమే కాకుండా స్పష్టంగా కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. దీని మొదటి ప్రోటోటైప్ మోడల్‌ను లాస్ వెగాస్‌లో జనవరి నెలలో వినియోగదారుల ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్లో పానాసోనిక్ కంపెనీ ప్రదర్శించింది. అయితే ఆ పాత ప్రోటోటైప్ మోడల్‌ను ఎంతో అభివృద్ధి చేసి ఇప్పుడు టీవీని నిజమైన మాయా దర్పణంగా మార్చేసింది. మొదటి మోడల్ టీవీకి ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్స్) స్క్రీన్‌ను ఉపయోగించగా, ఇప్పుడు అభివృద్ధి చేసిన మోడల్‌కు ఓఎల్ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్) స్క్రీన్‌ను ఉపయోగించింది. ఎల్ఈడీలో సాంకేతికంగా తెర వెనక నుంచి లాక్కునే కాంతి ద్వారా పిక్సల్స్ వెలిగితే ఓఎల్ఈడీలో తెరమీదనే కాంతిని సృష్టించుకుంటోంది. అప్పుడు పిక్సల్స్ వెలుగుతాయి. ఈ ఓఎల్ఈడీలో ఉండే సాంకేతిక ప్రయోజనాల వల్ల స్క్రీన్‌ను అతి పలుచగాను, పారదర్శకంగాను తయారు చేయవచ్చు. క్యాథోడ్, ఆనోడ్ అని పిలిచే రెండు ఎలక్ట్రోడ్స్ ప్యానెళ్ల మధ్య ప్లాస్టిక్ పొరను ఏర్పాటు చేసి, దాన్ని అద్దం ఉపరితలంపైన అతికిస్తారు. ఈ ప్యానెళ్ల పైకి విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా లైట్ ఎమిటింగ్ టెక్నాలజీతో స్క్రీన్‌పైన పిక్సల్స్ వెలుగుతాయి. భవిష్యతంతా ఓఎల్ఈడీ టీవీలదేనని చెబుతున్న పానాసోనిక్ యాజమాన్యం ఈ టీవీ మార్కెట్లోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందని తెలిపింది. ఈ అద్దం లాంటి టీవీ వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది. -
ఇదొక నిజమైన మాయా దర్పణం
-
భారత్ కేంద్రంగా వృద్ధి ప్రణాళికలు
హైదరాబాద్: ప్యానాసానిక్ కంపెనీ వృద్ధి ప్రణాళికలకు భారత్ కీలకమని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతమున్న వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తుల కేటగిరిలోకి ప్రవేశిస్తామని ప్యానాసానిక్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ కజుహిరో సుగ పేర్కొన్నారు. . వ్యాపార వృద్ధి ప్రణాళిక నిమిత్తం ఆయన ఇటీవలనే భారత్‌లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిశారు. భారత ప్రభుత్వపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత్ తయారీ కేంద్రంగా మారుతుందని, ఎగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. పట్టణీకరణ వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్లను స్మార్ట్‌సిటీల ఏర్పాటు ద్వారా ఎదుర్కొనవచ్చని వివరించారు. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టామని, 15 వేలమందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు, మార్కెటింగ్ తదితర కార్యాల కోసం మరిన్ని పెట్టుబడులు పెడతామని తెలిపారు. భారత అభివృద్ధికి ప్యానాసానిక్ ఇతోధికంగా తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు భారత్ కేంద్రం కానున్నదని ప్యానాసానిక్ ఇండియా ప్రెసిడెంట్ డైజో ఇటో పేర్కొన్నారు. -
పానాసానిక్ ప్రాంతీయ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: పానాసానిక్ కంపెనీ భారత్‌లోని తన కార్యాలయాన్ని ప్రాంతీయ హబ్‌గా రూపొందిస్తోంది. వచ్చే నెల నుంచి సార్క్, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు రీజనల్ హబ్‌గా తమ భారత్ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తుందని పానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ భారత్‌కు దగ్గరగా ఉండడం, ఇదొక తయారీ కేంద్రంగా వ్యూహాత్మక స్థానంలో ఉండడం తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇలాంటి రీజనల్ హబ్‌లు పానాసానిక్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా జపాన్, ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 165 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించాలన్న లక్ష్యానికి చేరువగానే ఉన్నామని శర్మ పేర్కొన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అవసరమైన వారికి లక్ష సౌర శక్తి లాంతర్లందించే కార్యక్రమాన్ని చేపట్టామని, దీంట్లో భాగంగా, 2018 కల్లా 35,000 లాంతర్లను భారత్‌లో అందించనున్నామని చెప్పారు. ఈ లాంతర్ల పంపిణి కోసం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లోని ఆరు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని శర్మ వివరించారు.