మాయాబజార్ సినిమాలో టీవీలాగా పనిచేసే మాయా దర్పణాన్ని చూశాం. టీవీల ఉత్పత్తుల్లో జపాన్ దిగ్గజమైన పానాసోనిక్ మాయా దర్పణంలా కనిపించే టీవీనే ఇప్పుడు తయారు చేసింది. ఆ టీవీ అచ్చం కబోర్డుకు బిగించిన పారదర్శక అద్దంలా ఉంటుంది. ఆ అద్దం వెనకాలున్న వస్తువులేవైనా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చేతి సైగల ద్వారాగానీ, రిమోట్ ద్వారాగానీ టీవీ ఆన్ చేయగానే పారదర్శక అద్దం కాస్తా టీవీ స్క్రీన్‌గా మారిపోతుంది. టీవీ కార్యక్రమాల ప్రసారాలను పసందుగా వీక్షించవచ్చు. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత పలుచగా టీవీ స్క్రీన్ ఉండడమే కాకుండా స్పష్టంగా కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.
Published Wed, Oct 5 2016 7:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
Advertisement