
పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఆస్తులు ఏం ఉంటాయి? ఈ ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియోను చూస్తే... ‘నిజమే సుమీ!’ అనిపిస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేసే వాటిలో రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఒకటి. అయితే బయటికి పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఆనందంలో భాగం చేయడానికి టైమ్ సరిపోవడంతో పాటు డబ్బులు కూడా సరిపోవాలి.
ఈ వైరల్ వీడియో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్‌ఈడీ టీవీతో ‘రోలర్ కోస్టర్ రైడ్’ను ఇంట్లోకి తీసుకువచ్చారు. సాఫ్ట్ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను కూర్చోబెట్టారు. చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు. టీవీలో రోలర్ కోస్టర్ వర్చువల్ వీడియోను ప్లే చేశారు. పాప ఆ రైడ్‌లో భాగం అయింది. సంతోషంతో నవ్వుతూనే ఉంది!
Comments
Please login to add a commentAdd a comment