ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.
శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.
Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7
— @Bala (@neelabala) March 30, 2024
ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్‌గా మారింది.
కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్‌లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి.
Comments
Please login to add a commentAdd a comment