Harivaraasanam
-
శబరిమలలో హరివరాసనం: అద్వితీయంగా చిన్నారి నృత్యాభినయం
ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7— @Bala (@neelabala) March 30, 2024ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్‌గా మారింది.కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్‌లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి. -
అయ్యప్ప పాదాల చెంత జేసుదాసు..!
ప్రఖ్యాత శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ గాయకుడు జేసుదాసు గురువారం 'హరిహరాసనం' పాటను ఆలపించారు. ఓనం పండుగ చివరిరోజు సందర్భంగా 'కన్నీ' వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుడు జేసుదాసు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు ఆ స్వామి మూర్తి ముందు 'హరిహరాసనం' పాటను పాడారు. ఆయనతోపాటు ఇతర భక్తులు జతకలిసి గానం చేశారు. ఆలయం సంప్రదాయంలో భాగంగా అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు 'హరివరాసనం' గీతాన్ని ఆలపిస్తారు. 1950లో కుంబకుడి కులథూర్ అయ్యర్ అనే రచయిత ఈ 'హరిహరసుధాష్టకాన్ని' రచించారు. ఈ గీతాన్ని ఎంతోమంది గాయకులు పాడినప్పటికీ, జేసుదాసు తన మధురగానంతో భక్తిసుధలో ఓలలాడించారు. ఆయనకు 'హరిహరాసనం' పాట అజరామరమైన కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ పాట పూర్తి పాఠం ఇలా ఉంటుంది.. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహరాసనం స్వామి విశ్వమోహనం హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శరణకీర్తనం స్వామి శక్తిమానసం భరణతోలుకం స్వామి నర్తనాలసం ఆరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || తుర్గవాహనం స్వామి సుందరానానం వరగదాయుధం స్వామి దేవవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళావాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || కలమృదుస్మీతం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||