అయ్యప్ప పాదాల చెంత జేసుదాసు..!
ప్రఖ్యాత శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ గాయకుడు జేసుదాసు గురువారం 'హరిహరాసనం' పాటను ఆలపించారు. ఓనం పండుగ చివరిరోజు సందర్భంగా 'కన్నీ' వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుడు జేసుదాసు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు ఆ స్వామి మూర్తి ముందు 'హరిహరాసనం' పాటను పాడారు. ఆయనతోపాటు ఇతర భక్తులు జతకలిసి గానం చేశారు. ఆలయం సంప్రదాయంలో భాగంగా అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు 'హరివరాసనం' గీతాన్ని ఆలపిస్తారు.
1950లో కుంబకుడి కులథూర్ అయ్యర్ అనే రచయిత ఈ 'హరిహరసుధాష్టకాన్ని' రచించారు. ఈ గీతాన్ని ఎంతోమంది గాయకులు పాడినప్పటికీ, జేసుదాసు తన మధురగానంతో భక్తిసుధలో ఓలలాడించారు. ఆయనకు 'హరిహరాసనం' పాట అజరామరమైన కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది.
ఈ పాట పూర్తి పాఠం ఇలా ఉంటుంది..
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శరణకీర్తనం స్వామి శక్తిమానసం
భరణతోలుకం స్వామి నర్తనాలసం
ఆరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
తుర్గవాహనం స్వామి సుందరానానం
వరగదాయుధం స్వామి దేవవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళావాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
కలమృదుస్మీతం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||