ayyappa
-
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
శబరిమల భక్తులకు ‘స్వామి చాట్‌బాట్’
శబరిమల దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తులకు సమగ్ర సమాచారం అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందులో భాగంగా శబరిమల దర్శనార్థం వెళ్లేవారికి ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళలోని పథనంథిట్ట జిల్లా అధికారులు తెలిపారు.ముత్తూట్ గ్రూప్‌తో కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఏఐ డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించారు. శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు దీన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?రోజులవారీగా ఆలయ దర్శన సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ను ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సిద్ధం చేశారు. శబరిమల దగ్గర్లోని చూడదగిన దేవాలయాల వివరాలు కూడా అందులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. -
స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
నిజామాబాద్‌నాగారం: స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే మహిళల ఫొటోలు, వీడియోలు తీసి.. వారికి ఫోన్లు చేసి సోషల్ మీడియాలో పెడతానని వేధించడం సంచలనంగా మారింది. సెంటర్లోని ఓ ఆపరేటర్ ఈ అకృత్యాలకు పాల్పడడం కలవరం సృష్టిస్తోంది. దీంతో స్కానింగ్ సెంటర్లలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నా యి. నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతుండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందులో పనిచేసే ఆపరేటర్ ఒక్కరే చేశారా..? వెనుక ఉండి ఎవరైనా చేయించారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. తాజాగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి నోటీసులివ్వ డంతో పాటు.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల తనిఖీస్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రీకరణ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి స్కా నింగ్ సెంటర్‌కు నోటీసులు జారీచేసి నలుగురి తో కూడిన విచారణ కమిటీ వేశారు. కమిటీలో జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి రేడియోలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్యలున్నారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. జరిగిందిలా.. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ప్రారంభమైన కొన్ని రోజులకే అశ్లీల ఫొటోలు, వీడియోల చిత్రకరణకు తెరలేపారు. ఇందులో పనిచేసే ఓ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రాలను, వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా తీసేవాడు. అనంతరం మహిళలకు ఫోన్లు చేసి వీడియోలు సోషల్ మీడి యాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. పదుల సంఖ్యలో మహిళలతో ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ తతంగం కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ విషయం స్కానింగ్ సెంటర్లో నిర్వాహకులకు, వైద్యులకు తెలిసే జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ ఆపరేటర్ ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నాడంటే నిర్వాహకులు పసిగట్టలేదంటే నమ్మేటట్లు కనిపించడంలేదు. గతంలోనూ ఇలా చేసినా నిర్వాహకులు తొలగించకపోవడంతోనే మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. సీపీని కలిసిన ఐఎంఏ నాయకులుసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు స్కానింగ్సెంటర్లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. సద రు ఆపరేటర్‌ను సైతం అరెస్ట్ చేశారు. అయితే ఐఎంఏ నాయకులు ఎంటరై నిర్వాహకులకు మద్ద తుగా వెళ్లి సీపీని కలిశారు. ఆపరేటర్ తప్పు చేస్తే నిర్వాహకులకు సంబంధం లేదని చెప్పినట్లు సమా చారం. అయితే సీపీ స్పందిస్తూ ఐఎంఏ నాయకులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి అండగా నిలబడడంపై ఆగ్రహించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన వారి్నంగ్ ఇచ్చారు. వివరాలు ఇవ్వాలని సీపీ కార్యాలయానికి వైద్యశాఖ లేఖ సీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో విచారణ చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల మొదటి వారంలో విన్నవించారు. కానీ వివరాలు రావడంలో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ కారణంగా సీపీ, అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో వివరాలు ఇంకా శాఖకు రాలేదని వైద్యాధికారి తెలిపారు.ఫిర్యాదుతో వెలుగులోకి.. అయప్ప స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇందులో తమ ఇంటి మహిళల వీడియో కనిపించడంతో ఓ వ్యక్తి నేరుగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్లో ఈనెల 7న రాతపూర్వగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
-
కేరళ ప్రభుత్వంపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం
-
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
హీరో విశ్వక్సేన్ ఇంట్లో అయ్యప్ప పడి పూజ (ఫోటోలు)
-
అయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం
-
చెలరేగిన అయ్యప్ప, పృథ్వీరాజ్.. కుప్పకూలిన ఉత్తరాఖండ్
తుంబా: ఆంధ్ర పేసర్లు బండారు అయ్యప్ప (4/37), పృథ్వీరాజ్ (3/27) ధాటికి రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఇ’లో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. కునాల్ చండీలా (52; 6 ఫోర్లు, 1 సిక్స్), కమల్ సింగ్ (42; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఆంధ్ర 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (25), షేక్ రషీద్ (10) క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL 1st Test: శ్రీలంకతో టీమిండియా తొలిపోరు.. కోహ్లి మెరిసేనా..? -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు. చదవండి: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత -
రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ..
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు నడిపే ప్రత్యేక రైళ్లలో భక్తులు పూజలు చేసుకోవచ్చని.. కానీ హారతి కర్పూరం, దీపాలు, అగరొత్తులు వెలిగించరాదని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. నిప్పు వల్ల రైళ్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, భక్తులు రైళ్లలో అగ్గి పుల్లలు కూడా వెలిగించొద్దని ఆ ప్రకటనలో సూచించింది. మండే స్వభావం ఉన్న వాటిని వినియోగించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి రైల్వే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయంలో జరిగిన పెన్షన్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ సెల్‌ను ప్రారంభించారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు! -
శబరిమల ఆలయం : పది మంది మహిళలకు నో ఎంట్రీ..
తిరువనంతపురం : శబరిమల ఆలయం తలుపులు శనివారం సాయంత్రం తెరుచుకోనున్న క్రమంలో ఆలయం లోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు. వీరిని ఏపీకి చెందిన మహిళా భక్తులుగా భావిస్తున్నారు. శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆలయ పరిసరాల్లో పదివేల మంది పోలీసులను నియమించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు. కాగా శతాబ్ధాల తరబడి రుతుక్రమం పాటించే మహిళలను శబరిమల ఆలయానికి అనుమతించని నిబంధనలను బేఖాతరు చేస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో గత ఏడాది పూణేకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు నవంబర్ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా శబరిమల సందర్శిస్తానని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. తమకు భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరతానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దర్శనం కోసం తాను శబరిమల వెళ్లితీరతానని ఆమె చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి యువతుల ప్రవేశం గురించి తాము న్యాయ సలహాను తీసుకుంటామని ట్రావన్‌కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. -
శబరిమల ఆలయం మూసివేత
శబరిమల: అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రెండునెలల పాటు కొనసాగిన శబరిమల వార్షిక పూజలు ఆదివారంతో ముగిశాయి. రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అధికార వామపక్ష, ప్రతిపక్ష బీజేపీ శ్రేణుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే. 67 రోజుల అనంతరం ఆదివారం ఉదయం 6.15 గంటలకు పండాలం రాజకుటుంబానికి చెందిన పి.రాఘవ వర్మ రాజా దర్శనం అనంతరం భస్మాభిషేకం పూజతో ఆలయ మహద్వారాన్ని మూసివేశారు. తిరిగి ఫిబ్రవరి 13వ తేదీన మళయాళం నెల కుంభం సందర్భంగా పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు. -
శాస్తారం ప్రణమామ్యహం
అయ్యప్ప అనగానే అందరికీ యోగాసనంలో, మోకాలికి యోగపట్టం ధరించి కుడి చేత్తో అభయాన్నిస్తూ, ఎడమచేతిని మోకాలిపై ఉంచే రూపం గుర్తుకు వస్తుంది. శబరిమలైపై కొలువు తీరిన రూపం ఇదే. ఇక్కడ ఆయన బ్రహ్మచారిగా కనిపిస్తాడు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పూర్ణ, పుష్కలా వారి పేర్లు. శక్తి సమేతుడైన స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు. అచ్చన్ కోసం ఆలయంలో స్వామివారు ఇరువైపుల దేవేరులతో పాటు ఆసీనుడై కుడి కాలిని కిందకు చాచి ఎడమకాలిని మడిచి పీఠంపై ఉంచి నడుముకూ ఎడమమోకాలికీ కలిపి వేసిన పట్టంతో కుడిచేతిలో పుష్పాన్ని, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. పూర్ణాపుష్కలా దేవేరులు చేతిలో సౌగంధికా పుష్పాలను పట్టుకుని వరదముద్రనూ చూపుతూ వరాలిస్తుంటారు. ఇదే స్వరూపంలో తమిళనాడులోని కాంచీపురం,కడలూర్ మొదలైన కొన్ని దేవాలయాలలో మాత్రం అరుదుగా దర్శనమిస్తాడు. పూర్ణాపుష్కలాసమేత ధర్మశాస్త విగ్రహ స్వరూపాన్ని మయమత శిల్పశాస్త్రం విశేషంగా వివరించింది. ఇతడి చేతిలో చండ్రాకోలును ఉంచాలని చెప్పింది. ఈ స్వామి వాహనం, ధ్వజచిహ్నం రెండూ గజమే. చతుర్భుజుడైన స్వామికి కుక్కుటధ్వజం ఉంటుంది.శాస్త అంటే శాసించువాడని అర్థం. ఆగమ, శిల్ప శాస్త్రాలలో అనేక శాస్తా స్వరూపాలున్నా వాటిలో ఎనిమిది శాస్తారూపాలు ప్రసిద్ధమైనవి. ఆదిశాస్త, ధర్మశాస్త, జ్ఞానశాస్త, కల్యాణవరదశాస్త, గజారూఢ శాస్త, సమ్మోహన శాస్త, సంతానప్రాప్తి శాస్త, వేదశాస్త, వీరశాస్తలలో ఒక్కో దేవుడూ ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు.ధర్మశాస్తా దర్శనంతో సకలాభీష్టాలూ నెరవేరుతాయి. మహాపాతకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, పుత్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాగమం చెప్పింది. -
శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి
సాక్షి, శబరిమల : శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం 6.45 నుండి 7 గంటల మధ్యలో మకర జ్యోతిని దర్శించుకున్న భక్తజనం పులకించిపోయారు. జ్యోతి దర్శనం సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమల క్షేత్రం మారుమోగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పులిమేఢు, నీలికాల్, పరియణా వట్టం, పంబా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఆలయానికి మరికొద్దిసేపట్లో ఆభరణాలు చేరుకోనున్నాయి. -
ఇదీ ఇరుముడిలోని రహస్యం
‘స్వామియే శరణం అయ్యప్పా!’ అని శరణుఘోష మిన్నంటుతుండగా, కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు వెంటరాగా... 40 రోజుల దీక్షని పూర్తి చేసిన సంతృప్తి కనులలో కదలాడుతుండగా, భక్తిభావం నిలువెల్లా ముంచెత్తుతుండగా... వేలాది భక్తులు గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకుంటూ... కనిపిస్తుంటారు ఈ వారమంతా ఇంచుమించు అన్ని ఆలయాలలోనూ కనిపించే దృశ్యాలివే! ఇంతకూ ఇరుముడిలో ఏముంటుందో తెలుసా... ఇరు అంటే రెండు అని అర్థం. ఇరుముడి అంటే రెండు భాగాలు కలది అని చెప్పుకోవచ్చు. ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి. కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్కరోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి, మనశ్శరీరాలను భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రార్దబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. -
తెలంగాణ అయ్యప్పలపై కేరళ పిడుగు
సాక్షి, తిరువనంతపురం : తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో అడుగుపెట్టే వాహనాలపై కేరళ ప్రభుత్వం భారీగా రోడ్ ట్యాక్స్ విధించింది. కేరళ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడంతో.. తామూ ఆ పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్‌పై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పదాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందాలను నీరుగార్చిందని కేరళ పేర్కొంది. అంతర్రాష్ట్ర రోడ్డు ట్యాక్స్‌లపై కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒప్పందాలున్నాయి. ఈ ఒప్పందాలను కొనసాగించాలని కేరళ ప్రభుత్వం చేసిన సూచనన తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చే స్టేజ్ కారియర్లపై కేరళ రోడ్డు పన్నును విధించింది. అయ్యప్పలపై పన్నుపోటు ప్రస్తుతం కేరళలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ స్థాయిలో భక్తులు కేరళ వెళ్తున్నారు. వేల కొద్దీ తెలంగాణ వాహనాలు కేరళలో ప్రయాణిస్తున్నాయి. కొత్త ట్యాక్స్ ప్రకారం.. 49 సీట్లున్న స్టేజ్ కారియర్.. కేరళకు రూ. 15 వేలు పన్ను కట్టాలి. కేరళ ప్రభుత్వం ఒక్క సీటుకు రూ.300 నుంచి రూ. 400 వరకూ ఛార్జ్ చేస్తోంది. -
అయ్యప్ప దర్శనానికి మహిళల ప్రయత్నం
సాక్షి, శబరిమల : ఈ ఏడు అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ నెల 26న మండల పూజలు పూర్తయిన నేపథ్యంలో.. అయ్యప్ప ఆలయ ఆదాయాన్ని దేవస్థానం బోర్డు గురువారం ప్రకటించింది. మండల పూజల నాటికి 168.84 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు, కేరళ దేవాదాయ శాఖామంత్రి సురేంద్రన్ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకూ ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 20 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. మండల - మకర విళక్కును పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ తెరచి ఉంచారు. మకరవిళక్కును పురస్కరించుకుని డిసెంబర్ 30 నుంచి జనవరి 14 వరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ అయ్యప్ప ఆలయానికి వచ్చిన సొమ్మును.. శబరిమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికే వినియోగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శబరిమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని..ఆయన దేవస్థానం బోర్డుకు సూచించారు. మహిళల ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు ఈ ఏడాది కూడా అయ్యప్పను 10 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించే ప్రయత్నం చేసినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్ ప్రకటించారు. మండల పూజల సందర్భంగా 260 మంది స్త్రీలు.. అయ్యప్ప దర్శనం కోసం సన్నిధానంకు వచ్చారని ఆయన చెప్పారు. శబరిమల పవిత్రతను అందరు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే వీరిని గుర్తించి వెంటనే వెనక్కు తిప్పి పంపినట్లు ఆయన తెలిపారు. శబరిమలలో ఆచార ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రికార్డు స్థాయిలో అయ్యప్ప ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది. మొత్తం రెవెన్యూ వివరాలు శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925 అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745 హుండీ ఆదాయం : 35,89,26,885 భారీగా భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. నెయ్యాభిషేకం కోసం అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
శబరిమల దర్శన వేళలు పెంపు
శబరిమల : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శన వేళల్లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మార్పులు చేసింది. ప్రధానంగా మండల పూజల సమయంలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు రావచ్చన్న సంకేతాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని పొడిగించింది. భక్తులు ఇకపై తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేవారు. అలాగే అర్ధరాత్రి ఒంటి గంటవరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇదే గతంలో 11 గంటలకు అయ్యప్ప స్వామి హరివరాసనం చేసిన తరువాత ఆలయాన్ని మూసివేసేవారు. ఇప్పుడు హరివరాసనం పూజను అర్ధరాత్రి 1 గంటకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సవరణ కేవలం మండల పూజల వరకే ఉంటుందని ట్రావెన్ కోర్దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. భారీగా పోలీసు భద్రత ఈ ఏడాది శబరిమలకు భారీగా భక్తులు వస్తారన్న అంచనాలు, అలాగే ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ దఫా ఎన్నడూ లేనంత భద్రతను ఆలయానికి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా శబరిమల ఆలయం, స్వామి సన్నిధానం, మాలికాపురం, శరంగుత్తి, పంబా గణపతి ప్రాంతాల్లో భారీ భద్రతను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 1500 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటారని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. -
టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి జోలపాటగా ప్రఖ్యాతిగాంచిన ‘హరివరాసనం’ అనే అష్టకంలో కొన్ని తప్పులను సరిదిద్దినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మళయాళంలో అష్టకంగా పిలుచుకునే ఈ హరివరసానంలో శ్లోకాల్లో సంస్కృత పదాలు కొన్ని రూపాంతరం చెందడం, అసలుకే లేకపోవడం జరిగిందని.. టీడీబీ పేర్కొంది. వీటిని సరిదిద్ది మళ్లీ కొత్తగా రికార్డ్ చేసిన హరివరాసనం శ్లోకాలనే ఈ ఏడాది స్వామి వారికి జోలపాటగా వినిపిస్తామని బోర్డు తెలిపింది. దేశంలో పలువురు గాయకులు హరివరాసనం శ్లోకాలను ఆలపించినా.. కేజే ఏసుదాస్.. హరివరాసనంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన టీడీపీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్లోకాల్లో అరివిమర్ధనం నిత్యనర్తనం అనే పాదంలో.. అరి విమర్ధనం అంటూ విడిగా ఉచ్ఛరించాలని ఆయన తెలిపారు. అరి అంటే శత్రువని, మర్ధనం అంటే నాశనం చేయడమనే అర్థం వస్తుందని చెప్పారు. ఏసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన రాగానే వీటిని సరిదిద్ది హరివరసానం శ్లోకాలను మళ్లీ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. -
కర్నాటకలోకి ప్రవేశించనున్న అయ్యప్పల పాదయాత్ర
-
స్వామీ.. చూస్తున్నావా!
ప్రకాశం జిల్లా : పట్టణంలోని ప్రధాన వీధిలో ‘అయ్యా ఒక్క రూపాయి ఇవ్వండి.. సార్ ఆకలేస్తోంది.. అమ్మా మీరైనా ఇవ్వండమ్మా’ అంటూ దీనంగా అరుస్తున్న ఓ చిన్నారి అయ్యప్ప మాలధారుని వేషధారణలో కనిపించింది. నిండా పదేళ్లు కూడా లేని ఆ బాలిక బడిలో కాకుండా అలా ఎండలో చెప్పులు కూడా లేకుండా అర్థిస్తుంటే చూపరులకు జాలేసింది. బాలిక కన్నవారిపై కోపం వచ్చింది. అక్కడున్నవారు ప్రభుత్వాన్ని నిలదీశారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుతాం.. చిన్నారులంతా బడిలోనే ఉండాలనే అధికారులు ఈ బాలికను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చైల్డ్ లైన్ (1098)కి ఎవరైనా ఫోన్ చేస్తేనే కానీ స్పందించే అవకాశం ఉండదు. ఈనేపథ్యంలో జిల్లాలో బాలలు నిత్యం ఇలా భిక్షగాళ్లగానే కనిపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి మార్కాపురం వరకు తరచూ రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో బాలకార్మికులు కనిపిస్తూనే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. -
అనుమానం పెనుభూతమై
-
అనుమానం పెనుభూతమై
⇒ భార్యను నరికి చంపిన భర్త ⇒ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటానని పెళ్లి రోజు చేసిన బాసలను అతను మరిచి పోయాడు. అనుమానంతో విచక్షణ కోల్పోయాడు. కత్తితో భార్యను నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేశానంటూ వీధిలోకి వచ్చి కేకలు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీకాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏర్పేడు : భార్యను కత్తితో నరికి చంపిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలం మల్లిమడుగు ఎస్టీ కాలనీకి చెందిన పంజాపి గోవిందయ్య కుమారుడు అయ్యప్ప(32)కి శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు ఎస్టీ కాలనీకి చెందిన పాముల మహాలక్ష్మి కుమార్తె ప్రభావతి(28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చీరాలమ్మ(07), జయచంద్ర(05), హేమ(03) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి అయ్యప్ప భార్య ప్రవర్తనపై అనుమానించేవాడు. వేరేవారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను చితకబాదేవాడు. పిల్లలను చూసి ఆమె అన్ని బాధలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏడాది క్రితం కుటుంబాన్ని ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి మార్చాడు. కొన్ని నెలల వరకు భార్యతో మంచిగా నడచుకున్నాడు. తర్వాత మళ్లీ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కత్తితో భార్యపై దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అను వీధిలోకి వచ్చి భార్యను నరికేశానంటూ కేకలు వేశాడు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ అర్ధరాత్రి వేళ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరామర్శ స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, ఎంపీటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మండలంలోని కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి వెళ్లి పిల్లలను పరామర్శించారు. సాయం చేస్తానని చెప్పారు. -
బాడీ బిల్డర్ అయ్యప్పకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బాడీ బిల్డర్ అయ్యప్పకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు శనివారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన లక్ష రూపాయల చెక్‌ను ఆయన చాంబర్లో అయ్యప్పకు అందజేశారు. పేద కుటుంబానికి చెందిన అయ్యప్ప భవిష్యత్తులో ప్రపంచస్థాయి బాడీ బిల్డర్‌గా ఎదిగి రాష్ట్రానికి పతకాలు సాధించి పెట్టాలని ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ కోరారు. అయ్యప్ప 2016 కర్ణాటకలో జరిగిన జాతీయ సీనియర్ మిస్టర్ ఇండియా పోటీల్లో 75 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలోని మియామిలో జరుగనున్న మిస్టర్ వరల్డ్ పోటీల కోసం అతను సాధన చేస్తున్నాడు. తనను ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డికి ఈ సందర్భంగా అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపాడు. -
అయ్యప్పకు క్షీరాభిషేకాలు
అనంతపురం కల్చరల్ : సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకుని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో కొలువైన అయ్యప్ప దేవాలయంలో క్షీరాభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా చెరువుకట్టపై వెలసిన సుబ్రమణ్యస్వామి ఆలయంలోనూ షష్టి వేడుకలు జరిగాయి. -
ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం
పుట్టపర్తి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో శ్రీమణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి వేలాదిమంది అయ్యప్ప మాలధారులు నారాయణ సేవలో పాల్గొన్నారు. అయ్యప్ప కన్నెస్వాములు అయ్యప్ప విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 2,000 మంది అయ్యప్పలు, గ్రామస్తులు హాజరయ్యారు. సాయంత్రం పట్టణ వీధుల్లో అయ్యప్ప, సత్యసాయి చిత్రపటాలను ప్రత్యేక అలంకరణతో పలకీని తయారు చేసి ఊరేగించారు. మాలధారులు అయ్యప్ప భక్తి పాటలు పాడుతూ ముందుకు సాగారు. నారాయణసేవను నగర పంచాయతీ అద్యక్షుడు పీసీ గంగన్న ప్రారంభించారు. కార్యక్రమాన్ని యర్రంశెట్టి సూర్యనారాయణ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప గ్రామోత్సవం సందర్భంగా పట్టణం సందడిగా మారింది. -
ఘనంగా అయ్యప్ప పడిపూజ
కడియం : కడియం హైస్కూలు ఆవరణలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ అయ్యప్ప స్వామి పడిపూజ కనుల పండువగా నిర్వహించారు. బుర్?రలంకకు చెందిన తాడాల వీరవెంకట్రావు గురుస్వామి 36వ శబరిమల దీక్ష సందర్భంగా ఆయన శిష్య, ప్రశిష్య బృందం కోటిబిల్వార్చన, పడిపూజ, తాంత్రిక పూజ, గురుపూజోత్సవం జరిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది అయ్యప్ప స్వాములు, పీఠం గురువులు హాజరయ్యారు. -
అయ్యప్ప పాదాల చెంత జేసుదాసు..!
ప్రఖ్యాత శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ గాయకుడు జేసుదాసు గురువారం 'హరిహరాసనం' పాటను ఆలపించారు. ఓనం పండుగ చివరిరోజు సందర్భంగా 'కన్నీ' వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయకుడు జేసుదాసు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు ఆ స్వామి మూర్తి ముందు 'హరిహరాసనం' పాటను పాడారు. ఆయనతోపాటు ఇతర భక్తులు జతకలిసి గానం చేశారు. ఆలయం సంప్రదాయంలో భాగంగా అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చేందుకు 'హరివరాసనం' గీతాన్ని ఆలపిస్తారు. 1950లో కుంబకుడి కులథూర్ అయ్యర్ అనే రచయిత ఈ 'హరిహరసుధాష్టకాన్ని' రచించారు. ఈ గీతాన్ని ఎంతోమంది గాయకులు పాడినప్పటికీ, జేసుదాసు తన మధురగానంతో భక్తిసుధలో ఓలలాడించారు. ఆయనకు 'హరిహరాసనం' పాట అజరామరమైన కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ పాట పూర్తి పాఠం ఇలా ఉంటుంది.. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహరాసనం స్వామి విశ్వమోహనం హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శరణకీర్తనం స్వామి శక్తిమానసం భరణతోలుకం స్వామి నర్తనాలసం ఆరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || తుర్గవాహనం స్వామి సుందరానానం వరగదాయుధం స్వామి దేవవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళావాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || కలమృదుస్మీతం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ || -
11 ఎకరాల్లో అయ్యప్ప ఆలయం
-
శబరిగిరిలో మకరజ్యోతి దర్శనం
-
మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
శబరిమల యాత్ర చివరి రోజైన శుక్రవారం పొన్నాంబళంమేడు కొండల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనమీయనుంది. జ్యోతి రూపంలో దర్శనమీయనున్న అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమల చేరుకున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శబరిమల దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దేవస్ధాన పరిసరాలు, పంపా తీరం వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. భక్తులకు కావల్సిన ఆహారం, మంచినీటిని ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు మరకజ్యోతి దర్శనానికి వస్తారని అంచనా. అయితే ప్రతి ఏడాదీ జనవరి 14న దర్శనమిచ్చే అయ్యప్ప మకరజ్యోతి ఈ సారి జనవరి 15వ తేదీ సాయంత్రం దర్శనమివ్వనుంది. కేరళ ప్రభుత్వం నిర్వహించే అయ్యప్ప ఆలయ అధికారిక వెబ్ సైట్ ఈ విషయాన్ని ప్రకటించింది. మలయాళ పంచాంగం ప్రకారం మకర సంక్రమణ పూజ ఈసారి జనవరి 14 అర్ధరాత్రి 12.58 గంటలకు జరుగుతుంది. అందువల్ల మకర జ్యోతి మరుసటి రోజున వుంటుందని తెలిపారు. జనవరి 15 న జరిగే మకర జ్యోతి దర్శనం చాలా అరుదుగా వస్తుందని. మండల దీక్ష తీసుకొని అయ్యప్ప మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కంఠరాయ మహేశ్వరాయ తెలిపారు. -
ఇరుముడి యాత్ర
శబరిమల శబరిమల లేదా శబరిమలై అని పిలిచే ఈ ప్రాంతం కేరళలో ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రం. పతనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల కిందకు వస్తుంది. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. మణికంఠుడుగానూ భక్తులు కొలిచే ఈ స్వామి దర్శనానికి చేసే యాత్ర న వంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. శబరిమల యాత్రకు ప్రతి యేడాది దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండలపూజ నవంబర్ 17, మకరవిళక్కు(మకరజ్యోతి) జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. ప్రాచుర్యం వచ్చిందిలా... 1977 వరకు శబరిమల అయ్యప్పస్వామి గురించి తెలుగు వారికి అంతగా తెలియదు. విజయవాడలోని గొల్లపూడి, హైదరాబాద్ బొల్లారంలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడం, కొందరు తెలుగువారు తమిళులు, కేరళీయులతో యాత్ర చేసి రావడంతో తెలుగురాష్ట్రాలలో అయ్యప్పస్వామి ప్రాచుర్యం పెరిగింది. ఈ యాత్రకు దాదాపుగా స్త్రీలకు అనుమతి లేదని చెప్పాలి. అడవులు, కొండల గుండా నడవాల్సిన దారి, మరుగు సదుపాయాలు లేకపోవడం, నెలసరి సమస్య, మగవారి బ్రహ్మచర్యదీక్ష మొదలైన కారణాల వల్లనే స్త్రీలకు ప్రవేశం కల్పించలేదనిపిస్తోంది. అయితే పదేళ్ల లోపు బాలికలను, యాభై ఏళ్లు దాటిన వారిని మాత్రం అనుమతిస్తారు. శబరిమల యాత్రకు ఇరుముడి జీవం వంటిది. పరశురామ నిర్మితమైన పదునెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడానికి దీక్ష, ఇరుముడి ఏర్పాటుచేశారు. కొండాకోనల్లో... జానపదాలతో... నలభై ఒక్క రోజులపాటు దీక్షలో పాటించిన కఠోర నియమాల పరమార్థమేమిటో పెద్దపాదంలో ఒక్కొక్కటిగా బోధపడుతుంటుంది. ఒంటికి రంగులు పులుముకొని... గిరిజనుల్లా వేషాలు ధరించి... జానపదాలు పాడుతూ... మేళతాళాలకు నర్తిస్తూ ‘ఎరుమేలి’లో ‘పేటతుళ్లి’ (మహిషితో యుద్ధం చేసినప్పుడు అయ్యప్ప చేసిన తాండవం) ఆడతారు భక్తులు. అటు తరువాత ధర్మశాస్తాగా ఉన్న అయ్యప్పను, వావర్ స్వామిని దర్శించుకొని వనయాత్ర ప్రారంభిస్తారు. పులులు, సింహాల వంటి క్రూరమృగాలు... ఏనుగుల వంటి భారీ జంతువులు... విషసర్పాలు సంచరించే కీకారణ్యంలో... చెప్పులు లేకుండా... రాళ్లూరప్పలు ముళ్ల బాటలో వడివడిగా అడుగులు వేస్తూ సాగిపోతుందీ యాత్ర. శిరస్సున ఇరుముడి... నోట శరణఘోష... దట్టమైన అడవుల్లో ఇవే స్వాములను నడిపించే దివ్యశక్తులు. దారిలో పెరూర్‌తోడు, కాళైకట్టి చేరుకుంటారు. కొద్ది దూరంలోనే అళుదా నదిలో స్నానమాచరించి ఆపై ఎత్తయిన అళుదా మేడు, కరిమల (ఏనుగుల ఆవాసం)ను ఎక్కిదిగుతారు భక్తులు. ఇది ఎంతో ప్రయాసతో కూడింది. అక్కడి నుంచి పెరియానవట్టమ్, చెరియానవట్టమ్ మీదుగా యాత్ర పంబా నది చేరుకుంటుంది. ఈ మార్గం గుండా పయనిస్తుంటే మాటలకందని మధురానుభూతి పొందక మానం. పక్షుల రెక్కల సవ్వడులు... ఏనుగుల ఘీంకరింపులు... స్వచ్ఛమైన గాలి తలపరింతలు... పిల్ల యేరుల పరవళ్లు... కాంక్రీట్ జంగిల్లో రణగొణ ధ్వనుల మధ్య కాలుష్యపు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న ప్రాణం కేరింతలు కొడుతుంది. పంబా స్నానం... సన్నిధానం... పంబా నదిలో పుణ్య స్నానాల అనంతరం శబరి పీఠం, నీలిమల, అప్పాచీ మేడు, శరంగుత్తి మీదుగా స్వామి సన్నిధానం చేరుతుంది. అక్కడ ఏకశిలపై పరశురాముడు రూపొందించిన పద్దెనిమిది మెట్లు దాటి అయ్యప్ప దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పిస్తారు స్వాములు. గుడి తెరిచి ఉంచే రోజులు... ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు (మధ్యలో రెండు రోజులు మినహా) మండలం, మకరవిళక్కుల కోసం ఆలయం నిత్యం తెరిచి ఉంటుంది. అలాగే ప్రతి మళయాళ మాసంలో తొలి ఐదు రోజులూ ఆలయాన్ని తెరుస్తారు. మిగతా రోజుల్లో మూసి ఉంచుతారు. ఈసారి మకర విళక్కు కోసం డిసెంబరు 30 నుంచి జనవరి 21 (ఉదయం 7 గంటల) వరకు మకర విళక్కు నిర్వహిస్తున్నారు. జనవరి 15న మకర విళక్కు, జ్యోతి దర్శనం. ఆన్లైన్లో శబరిమలలో వసతి సదుపాయం పొందాలంటే జ్ట్టిఞ://ఠీఠీఠీ.ట్చఛ్చటజీఝ్చ్చ్చఛిఛిౌఝౌఛ్చ్టీజీౌ. ఛిౌఝ లాగిన్ అవ్వచ్చు. పేమెంట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారానే చేయాలి. రిజర్వేషన్ చార్జ్ రూ.100 ఉంటుంది. - ఎన్.ఆర్. ఇన్పుట్స్: హనుమా చేరుకొనే మార్గాలు... రైలు: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ బయలుదేరుతుంది. నాంపల్లిలో బయలుదేరే ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా త్రివేండ్రం వరకు వెళుతుంది. శబరి వెళ్లేవారు కేరళలోని కొట్టాయం లేదా చెంగనూరు రైల్వే స్టేషన్లలో దిగాలి. ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు. అక్కడి నుంచి ఎరుమేలి లేదా పంబా చేరుకోవాలంటే కేరళ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా శబరిమల 1192 కి.మీ. శబరిమలకు సమీప విమానాశ్రయాలు: కొచ్చిన్, త్రివేండ్రం. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంబ/ ఎరుమేలి చేరుకోవాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల నుంచి రోజూ విమాన సర్వీసులున్నాయి. కొచ్చి నుంచి పంబా: 160 కి.మీ. (రోడ్డు మార్గం) తిరువనంతపురం నుంచి పంబా: 170 కి.మీ. దర్శనీయ స్థలాలు... కోడంగళ్లూర్ భగవతి ఆలయం: త్రిసూర్ నుంచి 38 కిలోమీటర్లు. దారిక రాక్షసుడిపై యుద్ధంలో కాళీ మాత విజయానికి గుర్తుగా ఇక్కడ ఏటా నిర్వహించే ‘కోడంగళ్ భరణి’ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది త్రివేండ్రంలో ఉంది. అనంత పద్మనాభస్వామి మూడు ద్వారాల్లో దర్శనమిస్తారు. నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించిన చిత్రాన్ని ఇక్కడ దర్శించవచ్చు. కొట్టాయం నుంచి తిరువనంతపురం 147 కి.మీ. పంబా నుంచైతే 180 కి.మీ. అనంత పద్మనాభస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న పజావంగడి గణపతి దేవాలయం పురాణ ప్రాశస్త్యమున్నది. చెంగనూర్ భగవతి ఆలయం: పంబా నుంచి చెంగనూరుకు 93 కి.మీ. ఇక్కడ విశాలమైన ప్రాంగణంలో తూర్పు, పడమర ముఖాల్లో పార్వతి, పరమేశ్వరులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని వెనక వైపునకు వెళితే స్వామి దర్శనమిస్తారు. నేరుగా బస్సులుంటాయి. గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయం: దక్షిణభారత దేశంలో ప్రముఖమైన శ్రీకృష్ణుడి ఆలయం ఇది. ప్రాతఃకాలంలో గజరాజు స్వామివారికి ప్రదక్షిణలు చేసి మేలతాళాలతో మేల్కొల్పడం ఇక్కడి ఆనవాయితీ. త్రిసూర్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది.ఛోటానిక్కర్ అమ్మవారు: కొచ్చి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దేవి కొలువైన మరో అద్భుత క్షేత్రం ఛోటానిక్కర్. ఇవే కాకుండా శబరిమలకు వెళ్లే దారిలో, సమీపంలో మరెన్నో అతి పురాతన దేవాలయాలున్నాయి. కొచ్చికి 20 కి.మీ. దూరంలో వైకోమ్ మహాదేవర ఆలయం, 15 కి.మీ. సమీపంలో కడుత్తురుతి మహాదేవ ఆలయం, ఎట్టుమానూరు మహాదేవర ఆలయం, అక్కడి నుంచి 12 కి.మీ. దూరంలో తిరునక్కర మహాదేవర క్షేత్రం (కొట్టాయం) అలరారుతున్నాయి. కొట్టరక్కర గణపతి క్షేత్రం: కొల్లమ్ జిల్లాలో కొలువైన ఈ ఆలయం శబరిమల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరన్ముల శ్రీపార్థసారథి ఆలయం: పంబానదీ తీరంలో, చంగనూర్ నుంచి శబరికి వెళ్లే దారిలో, తిరువనంతపురానికి 125 కిలోమీటర్ల దూరంలో నెలవైన అరన్ముల శ్రీపార్థసారథి ఆలయం చారిత్రక నేపథ్యం గలది. పురాణాల్లో పేర్కొన్న 108 వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. మలయలప్పుజ భద్రకాళి: పతనంతిట్టకు సమీపంలో, తిరువనంతపురానికి 110 కి.మీ. దూరంలో దుర్గా అమ్మవారు వేంచేసి ఉన్నారు. -
అయ్యప్ప పాట పాడిన మంత్రి తలసాని
-
శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను మరోసారి ఆకాశానికెత్తేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ను పొగడ్తల్లో ముంచెత్తే గణేష్ ఈ సారి ఏకంగా దేవుడితో పోల్చాడు. శబరిమలో అయ్యప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప అంటూ గణేష్ సోషల్ మీడియాతో పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటించిన గోపాల గోపాల సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గణేశ్ స్పందించాడు. 'శబరిలో అయ్యప్ప.. శ్రీశైలంలో మల్లప్ప.. హైదరాబాద్‌లో పవనప్ప. గోపాల గోపాల బ్లాక్ బస్టరప్ప. పూలాభిషేకం నీకే. ప్రణాభిషేకం మీకే. కనకాభిషేకం మీకే. జై భోలో గోపాల గోపాల' అంటూ బండ్ల గణేశ్ పోస్ట్ చేశాడు. -
తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం
బాన్సువాడ: వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన మాతృమూర్తి పాపమ్మ పాదాలను క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పాదసేవా మహోత్సవం నిర్వహించారు. మంత్రి 102 ఏళ్ల వయసున్న తన తల్లి పాదాలను అభిషేకించి, ఆశీర్వాదం పొందారు. అన్ని దీక్షల కంటే తల్లిదండ్రుల పాదసేవే అతి పెద్ద దీక్ష అని త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి పేర్కొన్నారు. -
అయ్యప్ప భక్తులకిచ్చిన ఆహారంలో ఎలుక!!
-
ఈ-సెట్ ఫలితాల విడుదల
89.24 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణులకు ప్రభుత్వ కళాశాలల్లోనూ సెకండియర్‌లో చేరే అవకాశం కాకినాడ : ఈ-సెట్ -2014 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ వై.వేణుగోపాలరెడ్డి జేఎన్టీయూకేలో సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈనెల 10న 12 రీజనల్ సెంటర్లలో 99 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ-సెట్‌కు 48,705 మంది విద్యార్థులు హాజరుకాగా 43,466 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వేణుగోపాలరెడ్డి చెప్పారు. ఈ-సెట్ ను మూడుసార్లు విజయవంతంగా నిర్వహించి, అనుకున్న తేదీకల్లా ఫలితాలను విడుదల చేసిన జేఎన్టీయూకే అధికారులను అభినందించారు. ఈ ఏడాది నుంచి ఈ-సెట్ ఉత్తీర్ణులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సైతం రెండో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించామని చెప్పారు. వీసీ డాక్టర్ జి.తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ.. ఈ-సెట్ విద్యార్థు బార్కోడ్ షీట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఈ-సెట్ కన్వీనర్ డాక్టర్ సి.హెచ్.సాయిబాబు, వర్సిటీ రెక్టార్ డాక్టర్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు పాల్గొన్నారు. ర్యాంకర్లువీరే: వివిధ బ్రాంచ్‌లలో మొదటి, రెండో ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. (సీటీ బ్రాంచ్‌లో హాజరైన ఒకే ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించగా, సీఆర్టీ బ్రాంచ్‌లో ముగ్గురు హాజరైతే ఇద్దరు ఉత్తీర్ణుల య్యారు) సివిల్ : వలుపదాసు నీలిమ (హన్మకొండ, వరంగల్ జిల్లా), గుండాల ధనుంజయ్ (నల్గొండ). ఈఈఈ : కాండ్రేగుల సాయి (విశాఖపట్నం), బుర్రా కరుణప్రియ (అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా). ఎంఈసీ : రామ్‌బా అశోక్ (విజయనగరం), చిన్నకొట్ల గణేష్ (అనంతపురం). ఈసీఈ : మంచే హరీష్ (నిజామాబాద్), నేమాని నవీన్ (వరంగల్). సీఎస్ఈ : వి.నరేంద్ర (హైదరాబాద్), చింతా వెంకటరమణ (అనంతపురం). సీహెచ్ఈ : పసుమర్తి సత్యసాయి (వద్దిపర్రు, తూర్పుగోదావరిజిల్లా), రామిరెడ్డి హరికృష్ణ (మక్కువ, విజయనగరం జిల్లా). ఈఐఈ : బి.సంతోషి (మహబూబ్‌నగర్), ఎల్.స్నేహలత (కరీంనగర్). ఎంఈటీ : కిల్లన హేమంతకుమార్ (విజయనగరం), వాకాడ నాగస్వామి కొండలరావు (యు.కొత్తపల్లి, తూర్పుగోదావరి జిల్లా). ఎంఐఎన్ : బొడ్డు తిరుపతి (మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా), కొండర కృష్ణకాంత్ (ఆదిలాబాద్). ఫార్మా : జువేరియా తస్లీమ్ (నల్గొండ), షేక్ దాదా ఖలందార్ (కడప). బీఎస్సీ : యాలంటి అయ్యప్ప (ఒంగోలు), మహంతి జయలక్ష్మి (నెల్లిమర్ల, విజయనగరం జిల్లా). ఒంగోలు విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ ఒంగోలు : ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) లో ఒంగోలుకు చెందిన వెలనాటి అయ్యప్ప (హాల్‌టికెట్ నెం. 7380011) బీఎస్పీ (మ్యాథ్స్) విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్-2014లో అతడికి 112 మార్కులు వచ్చాయి. ఒంగోలుకు చెందిన అయ్యప్ప నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామయ్య స్థానిక ఉడ్ కాంప్లెక్సులో రోజువారీ రిక్షా కూలీగా పనిచేస్తుంటాడు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలన్న రామయ్య కలను అయ్యప్ప నెరవేర్చాడు. అయ్యప్ప విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో చేరి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడమే తన జీవిత లక్ష్యమని అయ్యప్ప చెప్పారు. -
అయ్యప్ప భక్తుల సీట్లలో కూర్చున్న పోలీసులు
-
కూర‘గాయాలు’ ధరల కాక
కొనలేం.. తినలేం.. =భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు = కార్తీకమాసం ఎఫెక్ట్ =కొండెక్కిన ధరలతో సామాన్యుల బెంబేలు పెడన, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, కార్తీక మాసం ప్రభావంతో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆకు కూరలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. కార్తీక మాసంలో హిందువులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటంతో శాకాహారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయ్యప్ప, భవానీ దీక్షలకు కూడా ఇది సీజన్ కావడంతో కూరగాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏ రకం కూరగాయలు కొనాలనుకున్నా ధరలు చుక్కల్లో ఉండటంతో అన్ని వర్గాల ప్రజలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో వంకాయ కేజీ రూ.60 నుంచి 70, టమోటా 40, దోస 25, క్యారెట్ 60, బంగాళాదుంపలు, బీరకాయలు, బెండకాయలు 40 వరకు పలుకుతున్నాయి. దొండకాయలు ఎన్నడూ లేనిది రూ.70 వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి రూ.25, చిక్కుళ్లు రూ.30, కొత్తిమీర కట్ట చిన్నది రూ.30, చామదుంపలు 40, కంద 30 చొప్పున అమ్ముతున్నారు. పువ్వులు, పండ్ల ధరలూ పైపైకి... మార్కెట్లో పువ్వులు, పండ్ల ధరలు సైతం పైపైకి ఎగబాకుతున్నాయి. ఒక మోస్తరు సైజున్న బత్తాయిలు డజను రూ.100కు పైబడి అమ్ముతున్నారు. యాపిల్స్ అయితే సామాన్యుడు కొనే పరిస్థితే కనిపించటం లేదు. ఒక్కోటి రూ.40 వరకు పలుకుతోంది. సీతాఫలాలు డజను రూ.200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఇక పూజలకు తప్పనిసరిగా వాడే అరటిపండ్లు సైజును బట్టి డజను రూ.40 నుంచి 50 వరకు పలుకుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయని, దీంతో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ధర తగ్గిన చికెన్... కార్తీకమాసానికి ముందునుంచే ధర తగ్గిన కోడిమాంసం ఇప్పుడు మరీ చౌకగా మారింది. కార్తీక మాసం ప్రభావంతో చికెన్ వినియోగం తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర కేజీ రూ.80కి చేరుకుంది. ఒక్కసారిగా హోల్‌సేల్ రేటు పడిపోవటంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కోళ్లఫారాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శబరిమలై యాత్రకు రైళ్లు ఫుల్
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలై వెళ్లే స్వాములకు సంబంధించి విజయనగరం మీదుగా వెళ్లే వందకు పైగా రైళ్లన్నీ రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్టుల్లోనే దర్శనమిస్తున్నాయి. విజయనగరం నుంచి ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్ల రిజర్వేషన్లన్నీ జనవరి 8 వరకూ ఖాళీలు లేకపోవ డంతో దర్శనానికి వెళ్లేందుకు అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టకపోవడంతో భక్తులు బస్సులకే పరిమితమవుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తమకు అందుబాటులో ఉన్న బంధువుల సహాయంతో రిజర్వేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు కేవలం పది రైళ్లు ఉన్నాయి. 15906 వివేక్ ఎక్స్‌ప్రెస్, 06335 డిబ్రూఘర్-కొచ్చావలి స్పెషల్,02851 సంత్రాగచ్చి-కొచ్చావలి స్పెషల్, 18189 టాటా -అలెప్పీ ఎక్స్‌ప్రెస్, 13351 ధన్‌బాద్- అలెప్పీ ఎక్స్‌ప్రెస్, 16310 పాట్నా -ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, 16324 షాలిమార్ -త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, 12660 గురుదేవ్ ఎక్స్‌ప్రెస్, 12516 గౌహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, 12508 గౌహతి-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లు వెళ్తాయి. వీటిలో ఏ ఒక్క రైలుకూ జనవరి నెల వరకూ రిజర్వేషన్లు ఖాళీల్లేవు. డిసెంబరు 25న ఒక్కరోజుమాత్రమే 6 వరకూ ఆర్ఏసీ ఉంది. ప్రస్తుతానికి అన్ని రైళ్లూ వందకు పైగా వెయిటింగ్ లిస్ట్, మరికొన్ని రిగ్రీట్, ఇంకొన్ని నో రూమ్‌తో దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా ఏటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోందని, విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసే విధంగా రైల్వే అధికారులు శ్రద్ధ చూపాలని అయ్యప్ప యాత్రకు వెళ్లే భక్తులు కోరుతున్నారు. -
అయ్యప్పలకు దారేది
సాక్షి, గుంటూరు : జిల్లా నుంచి ఏటా కార్తీక మాసంలో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల యాత్రకు వెళుతుంటారు. కార్తీక మాసం ప్రవేశించక ముందు నుంచే మండల దీక్ష చేపట్టే భక్తులు నవంబరు రెండో వారం నుంచి ప్రయాణమవుతుంటారు. జనవరి 16 వరకు అయ్య ప్పల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. జిల్లా నుంచి శబరిమల వెళ్లే భక్తులు కేరళలోని కొట్టాయం, చెంగనూరు, ఎర్నాకుళం రైల్వేస్టేషన్లలో దిగుతారు. జిల్లా భక్తులంతా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కుగా మారింది. మాచర్ల, నడికుడి, పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది భక్తులు ఈ రైల్లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ (17230) కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ రైల్లోని ఏ తరగతిలోనూ టికెట్లు లేవు. రిజర్వేషన్లు పూర్తయ్యాయి. జనవరి ఐదో తేదీ వరకు నో రూమ్ అనే సమాధానమే ఎదురవుతోంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల నుంచి టికెట్ రిజర్వ్ చేసుకునే భక్తులకు వెయిటింగ్ లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలోనూ ప్రయత్నాలు ప్రారంభించారు. అక్క డి నుంచి కొచ్చిన్, త్రివేండ్రం వెళ్లే రైళ్లకు టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, శబరిమల వెళ్లే భక్తుల కోసం సరైన సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. శబరి, కొచ్చిన్ ఎక్స్ప్రెస్ల్లో టికెట్లు పూర్తయి న నేపథ్యంలో ఎంతో మంది భక్తులు ఆర్టీసీ, ఫోర్‌వీలర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బస్సుల్లో వెళ్లలేం... ఇంతకు ముందు ఎక్కువ మందితో కలిసి బృం దంగా బస్సులో శబరి మల వెళ్లాం. ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు. రైలు ప్రయాణమే మంచిదని నిర్ణయించుకున్నాం. అయితే శబరి ఎక్స్‌ప్రెస్‌కు టికెట్లు లేవు. తత్కాల్ టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అవి కూడా దొరుకుతాయో,లేదో. - అయ్యప్ప, గుంటూరు. ఏటా ఇదే పరిస్థితి... రిజర్వేషన్ ఓపెన్ అయిన అరగంటలోనే టికెట్లన్నీ అయిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే శబరిమలలోని అన్ని తరగతు ల్లోని టికెట్లు నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. విజయవాడ వెళ్లి అక్కడి నుంచి వెళ్లే రైళ్లకు టికెట్లు తీసుకోవాలనుకుంటున్నాం. రైల్వే అధికారులు త్వరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి. - మైలా సాయి కిరణ్, గుంటూరు.