
ప్రకాశం జిల్లా : పట్టణంలోని ప్రధాన వీధిలో ‘అయ్యా ఒక్క రూపాయి ఇవ్వండి.. సార్ ఆకలేస్తోంది.. అమ్మా మీరైనా ఇవ్వండమ్మా’ అంటూ దీనంగా అరుస్తున్న ఓ చిన్నారి అయ్యప్ప మాలధారుని వేషధారణలో కనిపించింది. నిండా పదేళ్లు కూడా లేని ఆ బాలిక బడిలో కాకుండా అలా ఎండలో చెప్పులు కూడా లేకుండా అర్థిస్తుంటే చూపరులకు జాలేసింది. బాలిక కన్నవారిపై కోపం వచ్చింది. అక్కడున్నవారు ప్రభుత్వాన్ని నిలదీశారు.
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుతాం.. చిన్నారులంతా బడిలోనే ఉండాలనే అధికారులు ఈ బాలికను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చైల్డ్ లైన్ (1098)కి ఎవరైనా ఫోన్ చేస్తేనే కానీ స్పందించే అవకాశం ఉండదు. ఈనేపథ్యంలో జిల్లాలో బాలలు నిత్యం ఇలా భిక్షగాళ్లగానే కనిపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి మార్కాపురం వరకు తరచూ రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో బాలకార్మికులు కనిపిస్తూనే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment