
జాన్‌కిరణ్‌బాబు, కోరి ఎలిజబెత్ దంపతులను ఆశీర్వదిస్తున్న ఇరు కుటుంబాల పెద్దలు
చీరాల రూరల్(ప్రకాశం జిల్లా): అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. సంప్రదాయంగా పెళ్లి చేసుకుని చీరాలలో శనివారం ఒక్కటయ్యారు. చీరాల కొత్తపేటకు చెందిన లింగం జాన్ సుశీల్‌బాబు, రత్నకుమారి దంపతుల కుమారుడు లింగం జాన్‌కిరణ్‌బాబు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు.
చదవండి: వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇతనికి తోటి ఉద్యోగి అయిన అమెరికాలోని ఆరిజోనా స్టేట్ హుడ్ రివర్ పట్టణానికి చెందిన కోరి ఎలిజబెత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పారు. వారు ఒప్పుకోవడంతో వివాహం చేసుకున్నారు. కోరి ఎలిజబెత్ కుటుంబ సభ్యులు పట్టుచీరలు కట్టుకుని వివాహానికి హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment