ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్‌ అమ్మాయి | Andhra Boy marriage to philippines Girl | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్‌ అమ్మాయి

Published Mon, Jul 15 2024 4:57 AM | Last Updated on Mon, Jul 15 2024 3:49 PM

Andhra Boy marriage to philippines Girl

మైలవరం ఆలయంలో వివాహం

జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్‌ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్‌ జిల్లా మైల­వరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంట­ముక్కలలో రిసెప్షన్‌ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌­కుమార్‌ ఆంధ్రా యూ­ని­వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్‌డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.

అతడికి ఫిలిప్పీన్స్‌ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయ­మైంది. పరిచ­యం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీ­కా­రంతో వారి­­ద్దరు మైల­వరం­లోని కోదండ రామాల­యంలో కుటుంబ­సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదా­యం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంట­ముక్క­లలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్‌ నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement