Satish Kumar
-
వైఎస్ జగన్ గురించి సతీష్ కుమార్ రెడ్డి అద్భుత మాటలు
-
బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు. -
ఉపాధికి ‘కిక్’ కామర్స్!
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ జోరుతో బ్లూకాలర్ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్ ఉంటుందని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్ కామర్స్ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో క్విక్‌కామర్స్ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ సతీష్ కుమార్ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు. బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు. డెలివరీ డ్రైవర్లు, రిటైల్ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్లో క్విక్‌కామర్స్ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్ అసోసియేట్ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్ సిబ్బంది, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది. వీరికి డిమాండ్.. : నేవిగేషన్ అండ్ డ్రైవింగ్, డిజిటల్ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్మెంట్, టెక్ సపోర్ట్ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఇండీస్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ టూల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది. క్విక్‌కామర్స్ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది. -
దంత వైద్య విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత చికిత్సలు అందించడానికి కృషి చేస్తానని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) నూతన ప్రెసిడెంట్ డాక్టర్ కె.సతీశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డీఐసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వైద్యుడైన డా.సతీశ్‌కుమార్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. స్కూల్, కాలేజీ విద్యను నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేసిన ఆయన.. హైదరాబాద్‌లోని ఉస్మానియాలో బీడీఎస్, ఎండీఎస్ విద్యనభ్యసించారు. ఉమ్మడి ఏపీ డెంటల్ కౌన్సిల్‌కు రెండు సార్లు, విభజిత ఏపీ కౌన్సిల్‌కు ఒకసారి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల డీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.సతీశ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..యూజర్ చార్జీలపై మార్గదర్శకాలు..వైద్య విద్యార్థులకు శిక్షణ సమయంలో ఎంత ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటే వారు అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ మేర సామర్థ్యాలు పెరిగి.. భవిష్యత్‌లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనకు వీలవుతుంది. డీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీకి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో రోజుకు నిర్దేశించిన స్థాయిలో ఓపీలు, ఐపీలు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలోని దంత వైద్య కళాశాలల్లో రోగుల కొరత ఉంటోంది.దీంతో విద్యార్థులు శిక్షణ సమయంలో ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత వైద్య కళాశాలల ద్వారా చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ప్రైవేట్ కళాశాలల్లో చికిత్సలకు యూజర్ చార్జీలపై మార్గదర్శకాలను రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.వేలల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా.. దంత వైద్య కళాశాలల్లోని ఆస్పత్రులకు వెళ్లాలి. అక్కడ నిపుణులైన సీనియర్ వైద్యులుంటారు. ఇబ్బడిముబ్బడిగా దంత వైద్య కళాశాలలు..దేశంలో దంత వైద్య కళాశాలలు ఎక్కువయ్యాయి. దీంతో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ బయట ఉపాధి దొరకడం లేదు. ఇబ్బడిముబ్బడిగా కళాశాలల ఏర్పాటుతో విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కళాశాలలకు ప్రతిపాదనలు పంపొద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు డీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి కొత్త కళాశాలల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త కళాశాలలు నెలకొల్పకుండా నియంత్రించే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు ఆమోదించడం, తిరస్కరించడం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. డెంటల్ ఎడ్యుకేషన్‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపైనా దృష్టి సారిస్తాం. -
వాళ్ళను చూసి సంస్కారం నేర్చుకో: షర్మిలకు కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్‌గా ఉన్నారా అని నిలదీశారు.అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్‌గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.జగన్ చేసిన MOUలో క్లియర్‌గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు.. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు. -
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
మతి భ్రమించి వెంకన్నతో రాజకీయం.. బాబుకు రోజులు దగ్గరపడ్డాయి
-
ఇద్దరు బాలికలపై వైద్యుని అసభ్య ప్రవర్తన
మధురవాడ(విశాఖ): ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవరించిన మధురవాడ మిథి లా పురి వుడా కాలనీలోని మానసిక ఆస్పత్రికి చెందిన ఓ వైద్యునిపై పీఎంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారలో ఉంటున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌కు ఇద్దరమ్మాయిలు. చిన్న కుమార్తె (15) ఇంటర్ ప్రథమ సంవత్సరం, పెద్ద కుమార్తె (16) రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె ప్రతి విషయానికి భయపడుతుండడంతో మానసిక వైద్యునికి చూపించాలని భావించారు.దీంతో మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉంటున్న మానసిక వైద్యుడు సతీష్‌కుమార్‌ను సంప్రదించారు. ఈనెల 8వ తేదీన అసభ్యకర బొమ్మలతో క్లాస్ చెబుతున్న క్రమంలో బాలికల పట్ల సతీష్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీన పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్‌గా 'సతీష్ కుమార్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇండియన్ ఆయిల్) చైర్మన్‌గా 'సతీష్ కుమార్ వడుగిరి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థకు అధిపతిగా నేడు బాధ్యతలు చేపట్టారు. శనివారం పదవికి రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ కుమార్‌ను నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న సతీష్ కుమార్.. తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఈయన 2022 అక్టోబర్ నుంచి ఒక సంవత్సరం పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.35 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభివృద్ధికి సతీష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయనకు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, బహుళజాతి చమురు కంపెనీలతో పనిచేసిన విస్తృత అనుభవం ఉంది.సతీష్ కుమార్ నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గత మూడు సంవత్సరాలలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. సంస్థ తన రిటైల్ అవుట్లెట్లను ఆధునీకరించింది, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్‌లను ప్రారంభించింది. హైవే రిటైల్ ప్రదేశాలలో సౌకర్యాలను ప్రవేశపెట్టింది.మార్కెటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సతీష్ కుమార్.. మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ నెట్‌వర్క్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా పనిచేశారు. తన కెరీర్లో LPG వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY), బీఎస్-6 ఫ్యూయల్ ఇంప్లిమెంటేషన్ మొదలైన కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
ప్రిక్వార్టర్స్‌లో సతీశ్
యోకోహామా: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి సతీశ్ కుమార్ కరుణాకరన్ ఒక్కడే మిగిలాడు. టోర్నీ రెండో రోజు బుధవారం బరిలోకి దిగిన భారత క్రీడాకారుల్లో సతీశ్ మినహా మిగతా వారందరూ ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ సతీశ్ 6–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఆంటోన్సెన్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)తో సతీశ్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 19–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మాగెలుండ్ (డెన్మార్క్)తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 1–3తో వెనుకబడిన దశలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతుపర్ణా పాండా–శ్వేతాపర్ణా (భారత్) ద్వయం 8–21, 14–21తో జూలీ ఫిన్–మాయ్ సురో (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
వేంపల్లె: శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అనుచరుడు వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి కేసులో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ చాంద్‌బాషా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్‌రెడ్డి, అజ్జుగట్టు రవితేజారెడ్డిలను అసభ్య పదజాలంతో తిట్టడం, సోషల్ మీడియాలో అవహేళన చేశారనే కోపంతో అజయ్‌కుమార్‌రెడ్డిని చంపాలని నిందితులు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. అజయ్‌కుమార్‌రెడ్డి సోదరుడు మౌనీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.ఈ కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందుల శివారు శిల్పారామం వద్ద గండూరు హిదయతుల్లా, కొండాపురం మండలం డోంకుపల్లి గ్రామానికి చెందిన పందిర్ల శివకుమార్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్, వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామిరెడ్డి ధరణీశ్వరరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. పులివెందుల రోడ్డులోని స్కూల్ సమీపంలో అజయ్‌కుమార్‌రెడ్డిని హాకీ స్టిక్స్, బండరాళ్లతో కొట్టి గాయపరిచామని నిందితులు చెప్పినట్టు సీఐ తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు పోలీసు కస్టడీకి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) వేముల సతీష్ కుమార్‌ను గురువారం నుంచి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను గురువారం ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను ప్రతి రోజూ ఉదయం 10 ఉంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారించనున్నారు. విచారణ అనంతరం రోజూ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సబ్ జైలులో అప్పగించాల్సి ఉంటుంది. సీఎం జగన్‌ను హతమార్చేందుకే దాడి మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పదునైన కాంక్రీట్ రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో బలమైన గాయమైంది. పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా బలమైన గాయమైంది. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అదే ప్రాంతానికి చెందిన వేముల సతీష్‌కుమార్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుపర్చారు. సతీష్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను హతమార్చేందుకే సతీష్ రాయితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పాత్రధారులు, సూత్రధారుల గుర్తింపునకే..కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే సీఎం జగన్‌పై తాను ముందస్తుగా సేకరించిన కాంక్రీట్ రాయితో దాడి చేశానని పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించినట్లు సమాచారం. దీని అధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరో సరిగా తేలక పోవడంతో ఈ కేసు అసంపూర్తిగానే ఉంది.కేసును మరింత సమగ్రంగా, లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది. మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇవే విషయాలను పేర్కొంటూ నిందితుడిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం నిందితుడిని మూడు రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్‌ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్‌ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్‌ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్‌పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్‌ను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
బీఆర్ఎస్ను వీడనున్న ‘పురాణం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆయన అదే బాటలో వెళ్లే యోచన చేస్తున్నారు. ఆయనతోపాటు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యేను తీసుకెళ్లాలని ప్రయత్నించినా, అందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధంగా లేనట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్న ‘పురాణం’, మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. అంతకుముందు మరో మారు ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తారని అనుకున్నా దక్కలేదు. కార్పొరేషన్ పదవి సైతం ఆశించినా రాలేదు. దీనిపై అప్పట్లోనే తన అసంతృప్తి వ్యక్తపర్చారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానికులకే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో పొసగక, గత ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా తూర్పు జిల్లాలో ఆయన ఐదు నియోజకవర్గాల్లో పని చేశా రు. పార్టీ మార్పుపై ‘పురాణం’ను ఫోనులో సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు. -
చంద్రబాబు, లోకేశ్ అవమానించారు
వేంపల్లె: మూడు దశాబ్దాలుగా టీడీపీకి ఎనలేని సేవలు చేసినా ఫలితం దక్కలేదని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేశ్ వైఎస్ కుటుంబంతో లాలూచీ పడ్డానని తనను ఘోరంగా అవమానించారన్నారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. కొంతమంది టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నానన్నారు. పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి కొన్నేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చిందిని చెప్పారు. అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలన్నారని, ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారని, ఇది ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆహా్వనం మేరకు తను వైఎస్సార్సీపీలోకీ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. -
అటు అవకాశవాదం.. ఇటు ఆత్మీయ ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, కడప : ‘అవసరం మేరకు వాడుకోవడం, ఆపై కరివేపాకులా వదిలేయడం’ టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా విశ్లేషకులు వర్ణిస్తారు. అచ్చం అలాంటి పరిస్థితే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సతీష్కుమార్రెడ్డికు ఎదురైంది. పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో రాజకీయ పోరాటం చేసినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. ఫలితంగా సతీష్‌కుమార్‌రెడ్డి సేవలందించిన చోటే ఛీత్కారాలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ నుంచి ఇటీవల గౌరవప్రదమైన ఆహ్వానం లభించడంతో సమాలోచనలో పడ్డారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాలుపంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వేంపల్లె నాగిరెడ్డి పేరు చెబితే తెలియని పాతతరం నేతలుండరు. ఆయన రాజకీయ వారసుడిగా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా నిలిచి రాజకీయ పోరాటం చేశారు. 1999 నుంచి 2019 వరకూ ఐదు టర్మ్‌లు పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడ్డారు. ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తూ టీడీపీ పరువు కోసం తాపత్రయ పడ్డారు. అయితే ఆయన టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో స్వంత పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి.. క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఆహ్వానం సతీష్‌కుమార్‌రెడ్డి సేవలు వినియోగించుకునేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అలాగే సముచిత స్థానం కూడా ఇచ్చేందుకు యోచిస్తోంది. ఆ మేరకు కడప– కర్నూల్ ఉమ్మడి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లు కె.సురేష్‌బాబు, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలు సతీష్‌తో చర్చించి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీష్‌రెడ్డి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. బీటెక్ రవి వైఖరి క్షుణ్ణంగా పరిశీలిస్తే సతీష్‌కుమార్‌రెడ్డి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఏమాత్రం లేదనే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రాంతం కోసం, ప్రజల కోసం ప్రతినబూని కృష్ణాజలాలు తీసుకవచ్చేందుకు సతీష్‌రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఏదేమైనా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
అందరూ మెచ్చే చిత్రాలు చేస్తా – నిర్మాత సతీష్ కుమార్
‘‘గతంలో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్ కృష్ణ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఉన్నారు. ఆ షో నుంచి తిరిగి రాగానే మా సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్దు, సంగీతం: జుడా శాండీ. -
'చనిపోతున్నానంటూ తల్లికి వాట్సాప్ కాల్..' విషాద ఘటన..
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తాళలేక తాను చనిపోతున్నానని తల్లికి వాట్సాప్ కాల్ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.సతీష్‌కుమార్(42) ఫిలింనగర్ రోడ్ నెం.9లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17న తన తల్లి అనసూయకు వాట్సాప్ కాల్ చేసిన అతను ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడయ్యాయని తాను చనిపోతున్నానని చెప్పాడు. తన కుమారుడు లిఖిత్తో పాటు అన్న కొడుకు వీరేంద్ర చౌదరి బాధ్యతలు తీసుకోవాలని తల్లికి కోరాడు. దీంతో ఆందోళనకు గురైన అనసూయ ఈ నెల 20న నగరానికి వచ్చి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. -
హుస్నాబాద్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఏంటీ?
హుస్నాబాద్ రాజకీయ చరిత్ర ఏంటీ? హుస్నాబాద్ నియోజకవర్గం భిన్నమైన భౌగోళిక, రాజకీయ స్వరూపం కలిగింది ఉంది. గతంలో కమలాపురం కాస్తా.. ఇప్పుడు హుస్నాబాద్ అయింది. 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఒడితెల సతీష్ కుమార్ మరోసారి గెలిచారు. ఆయన తన సమీప సిపిఐ ప్రత్యర్ది చాడ వెంకటరెడ్డి పై 70157 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితిలతో ఏర్పడిన మహా కూటమిలో భాగంగా సిపిఐ ఇక్కడ పోటీచేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు సతీష్ కుమార్‌కు 116388 ఓట్లు తెచ్చుకోగా, చాడా వెంకటరెడ్డికి 46181 ఓట్లు లభించాయి. సతీష్ కుమార్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. కాగా సతీష్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి గెలిచారు. తదుపరి రాజ్యసభ సభ్యునిగా పదవి పొందారు. హుస్నాబాద్‌లో 2014లో సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని ఒడితెల సతీష్ బాబు ఓడిరచారు. 2014లో సతీష్ బాబు హుస్నాబాద్ లో 34269 ఓట్ల ఆధిక్యతతో గెలపొందారు. గతంలో కమలాపురం నియోజకవర్గం ఉండేది. అది రద్దయింది. కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్, రద్దయిన కమలాపురంలలో కలిపి రెడ్లు పదిసార్లు గెలిస్తే, రెండుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత విజయం సాధించారు. సతీష్ తండ్రి లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఒకసారి సాధారణ ఎన్నికలలోను, మరోసారి ఉపఎన్నికలో గెలు పొందారు. కొంత కాలం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఈయన సోదరుడు ఒడితెల రాజేశ్వరరావు ఒకసారి శాసనసభ్యుడిగా, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హుజూరాబాద్‌లో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఇ. పెద్దిరెడ్డి కూడా హుస్నాబాద్‌లో 2009లో ప్రజారాజ్యంపక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1957లో ఏర్పడి 2009 వరకు వున్న ఇందుర్తి శాసనసభ నియోజకవర్గానికి మొత్తం 11సార్లు ఎన్నికలు జరిగితే పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి నాలుగుసార్లు గెలుపొందగా, సిపిఐ ఆరు సార్లు విజయం సాదించింది. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది. సిపిఐ నాయకుడు దేశిని చిన మల్లయ్య మొత్తం నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. 2001లో ఆయన పార్టీని వదలి వెళ్ళిపోయారు. మరో సిపిఐ నేత బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి బుగ్గారంలో మరోసారి గెలిచారు. కాంగ్రెస్ నేత బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇందుర్తిలో మూడుసార్లు గెలిచారు. టిడిపి ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం వహించలేదు. రద్దయిన కమలాపురం నియోజకవర్గం నుంచి టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఆయన ఎన్.టి.ఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. 2009లో హుస్నాబాద్‌లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2010లో ఉప ఎన్నికలో పోటీచేసి పరాజయం చెందారు. టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ కమలాపురంలో రెండుసార్లు, హుజూరాబాద్‌లో ఐదుసార్లు గెలిచారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కె.వి. నారాయణరెడ్డి అప్పట్లో కాసు మంత్రి వర్గంలో పనిచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం
నాతవరం (అనకాపల్లి జిల్లా): వర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పాటు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సతీష్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ పెండింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్‌తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్‌కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్ఈ జగన్మోహన్రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్‌కుమార్, వినయ్‌కుమార్, ఆర్.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు. -
సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు గడు వు పెంచినా ఈ ఏడాది ఆన్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. వరుస ఘటనలే కారణమా.. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్‌ఐటీని రహస్య క్యాంపస్‌గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన వేగవంతం బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది. – ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
టికెట్ కోసం పోటాపోటీ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం అధికార బీఆర్ఎస్ పార్టీ లో పోటాపోటీ నెలకొంది. జిల్లాలో ఏకై క జనరల్ స్థానం మంచిర్యాల కావడంతో ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పలువురు ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీలకు, ఖానాపూర్ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మంచిర్యాల మాత్రమే జనరల్ స్థానం కావడంతో అనేకమంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి అభ్యర్థులు బీ ఫారం కోసం రంగంలోకి దిగారు. ఇందులో సీని యర్ల నుంచి కింది స్థాయి నాయకుల వరకు అంద రూ ఉన్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పోటీలోనే ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. అంతేగాకుండా ని యోజకవర్గ ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేలా పర్యటనలు చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని మార్చుతారనే కోణంలోనే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ‘బీసీ కార్డు’తో అభ్యర్థిత్వం పార్టీలో ఉన్న పలువురు బీసీ నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. బీసీ కోటాలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న గాజుల ముఖేశ్‌గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. బీసీ నాయకులకు చాన్స్ ఇస్తే పోటీకి సిద్ధపడినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్లో చేరాక టికెట్ ఆశిస్తున్నారు. కార్మిక సంఘాలు, సంస్థలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఈయనతోపాటు పలువురు బీసీ నాయకులు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. రేసులో ‘పుస్కూర్’ బీఆర్ఎస్ నుంచే మరో నాయకుడు, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సినీ నిర్మాత పుస్కూర్ రామ్మోహన్రావు సైతం టికెట్ బరిలో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలోనూ టికెట్ ఆశించారు. చివరకు కార్పొరేషన్ పదవి దక్కింది. ప్రస్తుతం కాసిపేట మండలం దేవాపూర్‌లో ఉన్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనలోనూ ఆయన వెంట ఉన్నారు. తాజాగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. ఈసారి టికెట్ ఇవ్వాలని సంకేతాలు పంపుతున్నారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తను కూడా టికెట్ కోసం రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ‘మేం కూడా టికెట్ ఆశిస్తున్నాము. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామ’ని చెబుతూనే తన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ముందుంచుతున్నారు. పట్టుబిగిస్తున్న ‘పురాణం’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నుంచి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల పరిధిలోని ఐదు నియోజకవర్గాలను సమన్వయం చేసిన పేరుంది. కొత్త జిల్లాల అధ్యక్షులుగా ప్రకటించే వరకు 14ఏళ్లపాటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉద్యమంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆయనతో ఉన్నారని చెబుతారు. గతంలో మంచిర్యాల, సిర్పూర్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలనుకున్నా కుదరలేదు. చివరకు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రెండోసారి ఆయనకే అవకాశమిస్తారని అనుకున్నా ఇవ్వలేదు. ఈ క్రమంలో మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేను మారిస్తే తనకే తప్పకుండా సీటు ఇస్తారనే ఆశతో ఉన్నారు. తాను కూడా బరిలో ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. నియోజకవర్గంపై దృష్టి సారించి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా దండేపల్లి, హాజీపూర్, జిల్లా కేంద్రంతో సహా బొగ్గు గని కార్మికులతో స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. కార్యకర్తలతో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ కేడర్‌తో టచ్‌లో ఉంటున్నారు. ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు. ‘పురాణం’కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సన్నిహితులుగా పేరుంది. ‘ఉద్యమ కాలం నుంచి పార్టీలో పని చేస్తున్నాం. ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీని బలోపేతం చేశాం. మాకు కూడా టికె ట్ అడిగే హక్కు ఉంటుంద’ని ‘పురాణం’ తన అ భ్యర్థిత్వాన్ని బయటపెడుతున్నారు. అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం
టోక్యో: శరీరానికి ఒకట్రెండు కుట్లు పడితేనే విలవిల్లాడుతాం. విశ్రాంతికే పరిమితమవుతాం. ఏకంగా 13 కుట్లు పడితే ఎవరైనా బాక్సింగ్ చేస్తారా! కచ్చితంగా చేయరు. కానీ భారత బాక్సర్ సతీశ్ బాక్సింగ్ బరిలో దిగాడు. ప్రత్యర్థి పంచ్‌లకు తన ముఖానికి పడిన కుట్లు ఎంతగా బాధిస్తున్నా ఆఖరి దాకా పోరాడాడు. చివరకు ఫలితం ఓటమి అయినా... ప్రదర్శనతో గెలిచాడు. పురుషుల ప్లస్ 91 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ బఖోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన పోరులో సతీశ్ కుమార్ స్ఫూర్తిదాయక పోరాటం ముగిసింది. రింగ్‌లో ఈ ఆర్మీ బాక్సర్ తన ఆర్మీ నైజాన్ని చాటాడు. యుద్ధభూమిలో బుల్లెట్లు దిగినా ఊపిరి ఉన్నంతవరకు పోరాడే తత్వాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో చూపాడు. గత ప్రిక్వార్టర్స్ మ్యాచ్ సందర్భంగా అతని కంటిపై భాగానికి (నుదురు), గవదకు గాయాలయ్యాయి. దీంతో ఆ రెండు చోట్ల కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగే సాహసం చేసిన 32 ఏళ్ల సతీశ్ 0–5తో బఖోదిర్ చేతిలో ఓడిపోయాడు. గాయపడిన విషయం తెలియగానే సతీశ్ భార్య, తండ్రి ప్రిక్వార్టర్స్ విజయం దగ్గరే ఆగిపోమన్నారు. క్వార్టర్స్ బరిలో దిగొద్దని పదేపదే వారించారు. అయినాసరే ఇవేవి లెక్కచేయకుండా దేశం కోసం అతను ప్రాతినిధ్యం వహించిన తీరు అసమాన్యం. అందుకే టోక్యోలో ఉన్న కోచ్‌లు సహా భారత్‌లో ఉన్న బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అజయ్ సింగ్ అతని పోరాటాన్ని ఆకాశానికెత్తారు. కాగా... పతకాల ఆశలెన్నో పెట్టుకున్న బాక్సింగ్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం ఖాయమైంది. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) సెమీస్ చేరింది. మిగిలిన వారంతా సతీశ్ కంటే ముందే ఇంటిదారి పట్టేశారు. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ చౌదరి (75 కేజీలు), మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు) ఓడిపోయారు. -
పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా) : పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటున్నా సరైన ఆదరణ లభించలేదని తీవ్ర ఆవేదనన చెందారు. తన మనసును చంపుకొని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా కష్టపడి పనిచేసినా ఆదరణ లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి) -
ఆటాడుకుందామా!
మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతోందా... అయితే ఆటలు ఆడించే ఎడ్ల సతీశ్ కుమార్‌ను పిలవండి మరింత సందడి మీ ముందుంటుంది. గోళీలు, కర్రబిళ్ల, గాలిపటాలు, దాండియా కర్రలతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు.. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆటపాటలతో ముంచెత్తి, పండుగ వాతావరణం తీసుకువస్తారు. రంగస్థల నటుడు, సంప్రదాయ ఆటలలో నిష్ణాతుడు, జానపద గిరిజన నృత్యాల నిపుణుడు అయిన సతీశ్‌కుమార్ దేశవిదేశాలలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఆటలను, వస్తువులను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ ఆటలతోపాటు, జానపద నృత్యాలు, దాండియా ఆటలతో ఇంటిని ఆనంద సాగరంలో ముంచుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని దేశవిదేశాలలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సతీశ్‌కుమార్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు... నానమ్మ ప్రభావం... ‘చిన్నప్పుడు నానమ్మ చాలా కథలు చెప్పేది. రాముల వారి గుడి దగ్గర రామ్‌లీల, ఒగ్గు కథలు, నాటకాలు అన్నిటికీ నానమ్మ తనతో తీసుకువెళ్లేది. అవి చూస్తుండటం వల్ల కళల పట్ల మక్కువ పెరిగింది. 1995 ప్రాంతంలో ఉర్దు, తెలుగు నాటకాలు వేయడం ప్రారంభించాను. సాగర సంగమం సినిమా చూసిన తరవాత నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కూచిపూడి నాట్యకారిణి ఉమారామారావుగారి శిష్యుడైన అనిల్ కుమార్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఆ తరవాత లంబాడా, కోయ, గోండు వంటి జానపద, గిరిజన నృత్యాలు నేర్చుకుని, వాటిని ఒక పద్ధతిలో రూపొందించి వారి చేతే నాట్యం చేయించడం ప్రారంభించాను. దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాల జానపదాలు తెలుసుకున్నాను. శివగంగ నాట్యం సుమారు వంద ప్రదర్శనలిచ్చాను. హాంగ్‌కాంగ్‌లో 1980లో పది రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో మన దేశం నుంచి నేను ప్రతినిధిగా హాజరయ్యాను. ఇదే నా మార్గం... నేను ఈ కళలలో ఉండటం నాన్నగారికి ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనేవారు. నానమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. నాన్నకు కోపం రాకుండా ఉండటం కోసం ఉదయం నాలుగు గంటలకే టాంక్‌బండ్‌కి వెళ్లి, అక్కడ సాధన చేసి, ఆరు గంటలకల్లా డాన్స్ క్లాసుకి వెళ్లేవాడిని. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకున్నాను. అప్పట్లోనే నాటకాలు కూడా వేయడం మొదలుపెట్టాను. 1996లో హాంగ్‌కాంగ్, 1997లో అమెరికా వెళ్లాను. అక్కడ కార్యక్రమాలకు వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. వారంతా నన్ను ప్రోత్సహించి, ఆటా సభలకు పంపారు. అక్కడి వారికి మన సంప్రదాయ నృత్యాలు నేర్పించి, ఆటా ప్రారంభోత్సవ వేడుకలో చేయించాను. అలా అక్కడ సభలలో కొత్త ఒరవడి మొదలుపెట్టాను. అక్కడ ‘తెలుగు దేశం మనది’ ప్రదర్శన చూసి, కార్యక్రమానికి హాజరైన పన్నెండు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఏం కావాలి. అప్పుడు అనుకున్నాను, ‘ఇదే నా మార్గం’ అని. అక్కడ రెండేళ్లు ఉండి భారతదేశానికి వచ్చేశాను. స్వదేశంలో కొత్తగా... మన దేశంలో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయమని తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారు కోరారు. ‘ఈ తరం వారు మరచిపోతున్న మన ఆటలు నేర్పిస్తాను’ అన్నాను. ఆయన ‘సరే’ అన్నారు. 2017లో మన ఊరి ఆటలు (ఎథ్నిక్ గేమ్స్) పేరున మరుగున పడిపోతున్న ‘కర్ర – బిళ్ల, గోళీలు, బొంగరాలు, కర్ర సాము, వామన గుంటలు, గచ్చకాయలు, చింత గింజలు’ వంటి ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. అలాగే పిల్లలకి రాజస్థానీ తలపాగాలు కట్టి, వారితో దాండియా ఆడిస్తాను. వాతావరణాన్ని ఏభై ఏళ్ల క్రితం ఉన్న సంప్రదాయాల్లోకి తీసుకెళ్తాను. మన సంప్రదాయం తెలిసిన నానమ్మలను, అమ్మమ్మలను పిలిచి, వారితో తిరగలిలో బియ్యం పోసి విసిరిస్తాను. రోట్లో వడ్లు వేసి దంపిస్తాను. మనవలకి, పిల్లలకి వాళ్లు నేర్పేలా చేస్తారు. సంప్రదాయాన్ని నిత్యనూతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మన సంప్రదాయాలను ఆంగ్లంలో... విదేశాలలో ప్రదర్శనలిస్తున్నప్పుడు... బతుకమ్మ, గొబ్బెమ్మ, లంబాడీ, భాంగ్రా వీటికి సంబంధించిన పాటలను ఆంగ్లంలోకి అనువదించి, పాడుతూ చెబుతాను. గుంటూరు జేకేసీ కళాశాలలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కార్యక్రమాల సందర్భంగా ఆడించాను. సంక్రాంతి సంబరాలు జరిపించాను. ‘అహం భారతీయం’ లో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు అన్నీ కలిసి 1998లో ప్రదర్శించాం. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనను కాని, ఆనందంగా ఉంటుంది. మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వాళ్లకు శాశ్వత ఉపాధి కలిపిస్తే మరింత బాగా చేయగలుగుతాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి కిల్లింగ్ వీరప్పన్‌లో, ఆత్మసమర్పణ్ (హిందీ సినిమా)లో, కొన్ని హిందీ సీరియల్స్‌లోను నటించాను. వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. ‘ఒకసారి బిర్యానీ దొరికితే, ఒకసారి టీ కూడా దొరక్కపోవచ్చు. నేను కళాకారుడినని తెలిసి, అమెరికాలో ఒకసారి చార్టర్ విమానాన్ని గంటసేపు నా కోసం ఆపారు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమానికి మూడు లారీల సామాను తెచ్చాను. ఎడ్ల బండి, గంగిరెద్దు, భోగి మంటలు అన్నీ ఉన్నాయందులో. పెద్దలతో ఆటలు, అమ్మలక్కలాటలు సైతం ఆడించాను. – ఎడ్ల సతీశ్ కుమార్ -
క్షీరదాలలో కొత్తరకం సూక్ష్మజీవ నిరోధక మూలాలు
హైదరాబాద్: గుడ్లు పెట్టే క్షీరదాలలో ఎకిడ్నా జాతికి చెందిన జంతువుల పాలలో సరికొత్తరకం సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్ ఆనవాళ్లు ఉన్నట్లు సీఎస్ఐఆర్-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోవకు చెందిన జంతువులు, వాటి సంతానం ఎటువంటి అంటురోగాల బారిన పడకుండా తమ పాల ద్వారా సంరక్షించుకొంటున్నట్లు పరిశోధన ద్వారా తెలిసింది. సీఎస్ఐఆర్-సీసీఎంబీకి చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ నాయకత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రొటీను, కణంపై పొరలో రంధ్రాలను ఏర్పరుస్తున్నట్లు కనిపెట్టారు. ఈ కారణంగా వీటిని సూక్ష్మజీవి నాశక మందులకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చునని సతీశ్ చెబుతున్నారు. ఈకోలిని ఉపయోగిస్తూ సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌ను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ బృంద సభ్యులు మార్గాలను కనుగొన్నారు. మూగజీవుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం పశు పోషణ రంగంలో సూక్ష్మజీవి నాశకాల(యాంటి బయోటిక్)ను విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారని, ఫలితంగా సూక్ష్మజీవి నాశకాలను తట్టుకుని నిలిచే బ్యాక్టీరియా సంతతి పెరుగుతోందని సతీష్ చెప్పారు. డాక్టర్ సతీశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఎకిడ్నా నుంచి సంగ్రహించిన సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌కు మాస్టయిటిస్ కారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉన్నదని రుజువు చేయగలిగింది. ఈ పరిశోధన తాలూకు నివేదికను ఇటీవల ‘బయోచిమికా ఎట్ బయోఫిజికా యాక్టా-బయోమెంమెబ్రేన్స్’లో ప్రచురించారు.సీఎన్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. సాంక్రమిక వ్యాధులు అంతకంతకూ పెరుగుతున్నటువంటి ప్రస్తుత వాతావరణంలో ముందంజ వేసేందుకు ఈ అధ్యయనాలు ఒక ఉత్తమ మార్గంగా ఉన్నాయని అన్నారు. -
భారత బాక్సర్ల శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. పోటీల తొలి రోజు శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు బాక్సర్లు కూడా గెలుపొందడం విశేషం. పురుషుల విభాగంలో జాతీయ చాంపియన్ దీపక్ (49 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ఆశిష్ (69 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు) తొలి రౌండ్ బౌట్లలో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచిన భారత బాక్సర్లు సెప్టెంబరులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా తెలిపారు. తొలి రౌండ్ బౌట్లలో దీపక్ 5–0తో లోయ్ బుయ్ కాంగ్‌డాన్ (వియత్నాం)పై, రోహిత్ 5–0తో చు యెన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో సోపోర్స్ (కంబోడియా)పై, సతీశ్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై నెగ్గగా... సోనియా 5–0తో డో నా యువాన్ (వియత్నాం)ను ఓడించింది. మొత్తం 34 దేశాల నుంచి పురుషుల విభాగంలో 198 మంది... మహిళల విభాగంలో 100 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ బౌట్లను స్లో మోషన్లో కూడా రికార్డు చేస్తున్నారు. ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే బౌట్ ముగిసిన నిమిషంలోపు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో పరిశీలించిన తర్వాత అప్పీల్లో నిర్ణేతలు నిర్ణయం సరైనదేనని తేలితే మాత్రం అప్పీల్ చేసిన వారు వెయ్యి డాలర్లు పెనాల్టీగా చెల్లించాలి. -
న్యూయార్క్‌లో భారతీయుడికి జాక్‌పాట్
న్యూయార్క్ : స్క్రాచ్ ఆఫ్ గేమ్స్‌లో భారత దేశానికి చెందిన 37 ఏళ్ల సతీష్ కుమార్ పటేల్‌ను అదృష్టం వరించింది. న్యూయార్క్‌లోని మాన్‌హస్సెట్ హిల్స్‌లో నివాసం ఉంటున్న సతీష్ ఏకంగా 5మిలియన్ డాలర్లు( దాదాపు 35 కోట్ల రూపాయలు) నగదు బహుమతిని లాటరీలో గెలుపొందారు. 'మొదట ఎంత గెలుపొందానో సరిగా అర్థం కాలేదు. ముందు 5 లక్షల డాలర్లను గెలిచాననుకున్నా, కానీ మరుసటి రోజు అర్థమైంది, నేను గెలుచుకున్నది 5 మిలియన్ల డాలర్లు అని. నా పిల్లల కాలేజీ ఫీజుకి, నా తండ్రికి కొత్త కారు కొనడానికి ఈ డబ్బును వాడాలనుకుంటున్నాను' అని సతీష్ కుమార్ తెలిపారు. ఫ్లషింగ్‌లోని మెయిన్ స్ట్రీట్‌లోని ఎస్‌హెచ్ స్టేషనరీలో సతీష్ ఈ టికెట్ కొనుగోలు చేశారని ఎన్వై లాటరీ పేర్కొంది. -
‘టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి’
సాక్షి,సైదాపూర్: టీఆర్ఎస్తోనే తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్ జంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతి, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతు బీమా పథకాలు చేపట్టామన్నారు. నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాల్లో మిగిలిన పనులు పూర్తి చేయిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వొడితెల శ్రీనివాస్‌రావు, ప్రణవ్‌బాబు, పేరాల గోపాల్‌రావు, జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, కనుకుంట్ల విజయ్‌కుమార్, దేవేంద్ర, రాయిశెట్టి కోమల, చంద్రయ్య, కనుకుంట్ల కవిత, సులోచన, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా సభ్యుడు టీ.యుగేంధర్‌రెడ్డి, బెదరకోట రవీందర్, కొండ గణేశ్, కొత్త మధుసూదన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రమణాచారి, పైడిమల్ల తిరుపతిగౌడ్, రవీందర్‌గౌడ్, బొమ్మగాని రాజు, వెంకటయ్య, నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. పాన్ కడుతా..ఓటు కొడతా.. హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాంగంగా రాము పాన్ షాపులో పాన్ కడుతూ..ఓటు అడుగుతూ..ఆకట్టుకున్నారు. మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్ జంట గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు సోమారపు రాజయ్య, బిల్లా వెంకటరెడ్డి, మునిగంటి స్వామి, పోలు ప్రవీణ్, బొమ్మగాని రాజు, పైడిపల్లి రవీందర్, నవీన్ తదితరులు ఉన్నారు. -
వొడితల సతీష్ కుమార్‌తో లీడర్
-
పెరిగిన క్యాన్సర్ పాలసీల అమ్మకాలు
హైదరాబాద్: క్యాన్సర్ పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, తాము ఇప్పటివరకు 1.25 లక్షల పాలసీలను విక్రయించినట్లు ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ మేనేజర్ వీ సతీష్ కుమార్ వెల్లడించారు. జీవన్ ఆరోగ్య, క్యాన్సర్ పాలసీలకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఒక తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో 25 లక్షల మంది క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని ఇక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుండగా... ఎల్ఐసీ రూ.50 లక్షల వరకు పాలసీని అందిస్తున్నట్లు తెలిపారు. -
ఆ ఇద్దరు న్యాయవాదులకు పోలీసు కస్టడీ
సాక్షి, హైదరాబాద్: బెయిల్ డీల్స్ వ్యవహారంలో న్యాయాధికారి రాధాకృష్ణమూర్తికి మధ్యవర్తులుగా వ్యవహరించిన న్యాయవాదులు శ్రీనివాసరావు, సతీశ్‌కుమార్‌లను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 23 వరకు వారు పోలీసు కస్టడీలో ఉంటారు. పూర్తి వివరాలను రాబట్టేందుకు వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ డీల్స్ వ్యవహారంలో రాధాకృష్ణమూర్తిని ఏసీబీ అధికారులు ఇటీవల హైకోర్టు అనుమతితో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌కు సతీష్‌కుమార్ ఎంపిక
► రూ.12 లక్షలకు కొనుగోలు చేసిన జట్టు యాజమాన్యం ►జూలైలో జరిగే ఐదో సీజన్లో పాల్గొనే అవకాశం కొడవలూరు (కోవూరు) : ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్ జట్టుకు కోవూరుకు చెందిన పూనుగుంట సతీష్‌కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో ముంబైలో జరిగిన బహిరంగ ఆక్షన్‌లో పాట్నా పైరేట్స్ జట్టు యాజమాన్యం రూ.12 లక్షలకు సతీష్‌ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగే ఐదో సీజన్ ప్రొకబడ్డీ పోటీల్లో పాల్గొనే పాట్నా జట్టుకు డిఫెండర్‌గా సతీష్ ఎంపికయ్యారు. నాలుగో సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సతీష్ ఈసారి పాట్నా పైరేట్స్ జట్టు నుంచి బరిలో దిగుతున్నాడు. సతీష్ 20కి పైగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొని బహుమతులు సాధించాడు. జూనియర్స్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. క్రీడా కోటాలో రైల్వేలో టీటీఐ ఉద్యోగం సాధించిన సతీష్‌కుమార్ ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు ఎనిమిదిసార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్ సాక్షితో మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఈ ప్రభాకర్, వీర్ల వెంకయ్యల ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కాగా సతీష్ ఎంపిక పట్ల క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పోటీల్లో రాణించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. -
రెడ్‌లైట్ ప్రాంతాలు అవసరమనే శివప్పు ఎనక్కు పుడిక్కుం
ముంబై లాంటి నగరాల్లో వేశ్యలకంటూ రెడ్‌లైట్ ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. చెన్నైలాంటి మహా నగరాల్లోనూ అలాంటి ప్రాంతాలు అవసరం అని చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు యురేకా తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన జే.సతీష్‌కుమార్ నిర్మించిన తాజా చిత్రం శివప్పు ఎనక్కు పుడిక్కుం. దర్శకుడు యురేకా ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి శాండ్రా ఎమీ, బజార్బాబు, రోజామలర్, కామాక్షి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర వివరాలను తెలుపుతూ చెన్నై లాంటి మహా నగరాల్లో పలు రాష్ట్రాలకు చెందిన వారు, ఇతర దేశాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలా నానాటికీ జనాభా పెరుగుతున్నట్లుగానే పడుపు వృత్తి అధికం అవుతుందన్నారు. దీంతో అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అలాంటి అత్యాచారాలకు వ్యతిరేకమే తమ చిత్రం అని తెలిపారు. ఒక వేశ్య తన వద్దకు వచ్చే ఐదుగురి మనçస్తత్వాల గురించి ఒక రచయితకు వివరించే ఇతివృత్తమే ఈ చిత్రం అని తెలిపారు. అదే విధంగా వివాదాస్పద అంశం అయిన రెడ్‌లైట్ ప్రాంతాలు అవసరం అనే చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం ఉంటుందన్నారు. అయితే చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవని తెలిపారు. సెన్సార్ సభ్యులు, విమర్శకులు, పత్రికల వారు ప్రశంసించిన చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. -
వసతిగృహాల్లో విజిలెన్స్ తనిఖీలు
బత్తిలి (భామిని): బత్తిలి సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. విజిలెన్స్ సీఐలు చంద్ర, సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఉద యం ఏడున్నరకే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వసతిగృహం సంక్షేమాధికారిణి అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అధికారులు ఈ విషయమై ఆరా తీయగా గురువారం నుంచి సంక్షేమాధికారిణి విధులకు రాలేదని విద్యార్థినులు, సిబ్బంది వివరించారు. వసతి గృహంలో 103 మంది విద్యార్థినులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. స్టాక్ వివరాలు, విద్యార్థుల హాజరు, కాస్మోటిక్ చార్జీల చెల్లింపు వివరాలను పరిశీలించారు. వసతిగృహంలో విద్యార్థుల సమస్యలపై నివేదికను తయారు చేశారు. 103 మంది విద్యార్థినులకు సరిపడే టారుులెట్లు, రక్షిత మంచినీటి సదుపాయాలు లేవని, వంద మంది విద్యార్థినులు ఇరుకై న గదుల్లో నేలపైనే పడుకొంటున్నారని గుర్తించారు. కిటికీలకు నెట్లు లేక దోమలతో ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వసతిగృహ సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నమోదు చేశారు. గుళ్లసీతారాంపురంలో దాడులు.. సంతకవిటి (రాజాం): సంతకవిటి మండలంలోని గుళ్లసీతారాంపురంలో విజిలెన్స అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించా రు. గ్రామంలోని ఎస్సీ బాలుర వసతిగృహంతో పాటు రేషన్ డిపోల్లో తనిఖీలు చేశారు. విజిలెన్స డీఎస్పీ బి.ప్రసాదరా వు, సీఐ కృష్ణ, ఎస్ఐ అప్పలనాయుడుతో పాటు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తొలుత వసతిగృహంలో మెనూ వివరా లు తెలుసుకున్నారు. వసతిగృహ అధికారి లేకపోవడంతో సమాచారం తెలియజేయ గా రంగనాయకులదాస్ వచ్చి రికార్డులు, సరుకులను చూపించారు. రికార్డులు సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థుల బయోమెట్రిక్, మేన్యువల్ హాజరు పట్టీలో తేడా ఉన్నట్టు గుర్తించారు. డిపోలో అధిక నిల్వలు మరో వైపు గ్రామంలోని 31వ రేషన్ డిపోలో తనిఖీలు నిర్వహించారు. డీలర్ రావు మురళీ కృష్ణ వద్ద వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించగా ఇక్కడ రికార్డులో నమోదు కంటే అదనంగా 521 లీటర్లు కిరోసిన్, 35 కిలోల బియ్యం, అరకిలో పంచదార ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని సీజ్ చేసి తహశీల్దార్‌కు అప్పగించనున్నట్టు తెలిపారు. -
బ్యాంకు పరిధి గ్రామాలు భీమదేవరల్లిలోనే..
ప్రజల సౌలభ్యం కోసమే పునర్విభజన ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ భీమదేవరపల్లి : ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని గ్రామాలు భీమదేవరపల్లి మండలంలోనే కొనసాగుతాయని, వాటిని వేరే మండలంలో కలిపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మండల ప్రజలకు భరోసానిచ్చారు. ఎంపీపీ సంగ సంపత్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల సౌకర్యం కోసమే జరుగుతుందన్నారు. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని ఎర్రబల్లి, మల్లారం, కొత్తకొండ, ముస్తఫాపూర్, ధర్మారం గ్రామాలు నూతన ప్రతిపాదిత వేలేరు మండలంలో కలిపే ఆలోచన ఆయా గ్రామాల సర్పంచ్‌లు వేలేరు ప్రతిపాదిత మండలానికి గతంలో తీర్మాణం ఇవ్వడమే కారణమన్నారు. బ్యాంకు పరిధిలోని గ్రామాలు భీమదేవరపల్లి మండలంలో ఉంటేనే రైతులకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. దేవాదుల కాలువ నీటితో మాణిక్యాపూర్, రత్నగిరి చెరువులను నింపాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు వనపర్తి రాజయ్య, శివసారపు ఎల్లయ్య కోరారు. ఉపాధ్యాయులు పాఠశాలకు గైర్హాజరై మరుసటి రోజు హాజరువేసుకుంటున్నట్లు మాణిక్యాపూర్ ఎంపీటీసీ వెంకన్న ఆరోపించారు. ముల్కనూర్ ట్రాన్స్‌కో ఏఈ రమేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్పంచ్‌లు జిమ్మల భీంరెడ్డి, వనపర్తి రాజయ్య ఆరోపించారు. ముల్కనూర్ ఫాతిమా పాఠశాల సమీపంలో ఇళ్లపైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని సర్పంచ్ వంగ రవీందర్ కోరారు. అలాగే ఆయా గ్రామాల్లో పలు సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేవనెత్తారు. ఈజీఎస్ ఏపీవో కుమారస్వామి నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతాతయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోతు రాంచందర్‌నాయక్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండాల్‌రెడ్డి, ఎంపీడీవో వంగ నర్సింహారెడ్డి, తహసీల్దార్ కిరణ్‌కుమార్, వైస్ ఎంపీపీ సాధుల మనోహర, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎస్డీ షర్ఫొద్దీన్, గిరిమల్ల తిరుపతి, సిద్దమల్ల రమేశ్, ఎంపీటీసీలు మల్లం నర్సింహులు, తాళ్ల జయంత్ పాటు అన్ని శాఖల అధికారులున్నారు. మండల సభలో సగం వరకు మహిళ ప్రజాప్రతినిధులున్నా ఏ ఒక్కరు కూడా తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మాట్లడకపోవడం గమనార్హం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం సర్వశిక్షాభియాన్ పథకంలో భాగంగా వికలాంగ విద్యార్థులకు ఎమ్మెల్యే ఉపకరణాలు అందించారు. -
‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం
జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట లోని శ్రీజోగినాథ ఆలయ రథోత్సవాల్లో భాగంగా బుధవారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ మేనేజర్ పీఎస్.కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. సుమారు మూడువేల మంది భక్తులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌కు ఆలయ రథోత్సవ కమిటీ అభినందనలు తెలిపింది. సంస్థ టెక్నికల్ మేనేజర్ నరేష్ కుమార్, ఇంజనీర్ గణేష్, జోగిపేట షిర్టీ సాయిబాబా ట్రేడర్స్ యాజమాని సీహెచ్.నర్సింలు, సంగారెడ్డికి చెందిన శ్రీ బాలాజీ సాయిరాం ట్రేడర్స్ యాజమాని కృష్ణకాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఉపాధికల్పన శాఖ అధికారి
స్టీల్‌ప్లాంట్ భూ నిర్వాసితుడి నుంచి లంచం తీసుకుంటూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. వివరాలివీ... విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి రామయ్యకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆర్.కార్డు ఇచ్చింది. ఈ కార్డు ద్వారా ఆయన ఉక్కు కర్మాగారం నుంచి ప్రయోజనం పొందే వీలుంటుంది. ఈ కార్డులో పేరు మార్చాలని రామయ్య కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, ఆ పని చేసేందుకు జూనియర్ ఎంప్లాయ్మెంట్ అధికారి సతీష్‌కుమార్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. వారి సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం సతీష్‌కుమార్‌కు లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఇదో రకమైన ‘పరీక్ష’!
♦ ఆటో బోల్తా, 19 మంది ఇంటర్ విద్యార్థులకు గాయాలు ♦ ఒకరి పరిస్థితి విషమం ♦ గాయాలతోనే పరీక్షలు రాసిన 18 మంది మిరుదొడ్డి: ఆటో బోల్తా పడగా 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 18 మంది విద్యార్థులు గాయాలతోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలలో సోమవారం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం దౌల్తాబాద్ నుంచి పరీక్షలు రాయడానికి 19 మంది విద్యార్థులు ఆటోలో మిరుదొడ్డికి బయలుదేరారు. పెద్ద చెప్యాల రాజీవ్ గాంధీ చౌరస్తా మూల మలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చేగుంట మండలం గోవిందాపూర్‌కు చెందిన సతీశ్‌కుమార్‌కు నడుము భాగంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయాలతోనే పరీక్షలు 18 మంది విద్యార్థులు గాయాలను భరిస్తూనే ఇంటర్ సెకండియర్ పరీక్షను రాశారు. పరీక్షలు రాసిన అనంతరం స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయాలతోనే పరీక్షలు రాసిన విద్యార్థుల పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. తరలి వచ్చిన ఇంటర్ బోర్డు అధికారులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు డా. నాగమణి రత్నం, డా. నర్సింహులు హైదరాబాద్ నుంచి మిరుదొడ్డిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జరిగిన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేదని విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. వచ్చే ఏడాదికి దౌల్తాబాద్‌లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా నివేదికలు అందిస్తామని బోర్డు సభ్యులు తెలిపారు. -
విద్యార్థిని అదృశ్యం
బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వంచహ చంద్రయన్(17) అదృశ్యమైనట్లు బొల్లారం ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. బొల్లారంలోని త్రిశుల్ లెన్లో నుండి ఉదయం తల్లి ఊర్మిల పాండేను నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద వదిలి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. తదనంతరం తల్లి కూతురుకు పోన్ చేయాగా స్వీచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని తెలిసిన వారి వద్ద వాకబు చేయాగా ఎక్కడ ఆచూకి లబించలేదని తెలిపారు. దీంతో వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తల్లి ఊర్మిల పాండే ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థి తల్లి టిచర్ అని తండ్రి మిలటరిలో పనిచేస్తున్నారు. వంచహా ఈమద్యనే ఇంటర్ పరీక్షలు వ్రాసింది. -
క్వార్టర్స్‌లో మన్‌ప్రీత్, సతీశ్
ఆసియా సీనియర్ బాక్సింగ్ బ్యాంకాక్ : తమ పంచ్ పవర్‌ను చాటుకుంటూ భారత బాక్సర్లు మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన వీరిద్దరూ శనివారం నేరుగా తమ ప్రత్యర్థులతో ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో తలపడ్డారు. మన్‌ప్రీత్ సింగ్ 3-0తో నువాన్ సుగీవ సంపత్ (శ్రీలంక)పై... సతీశ్ 3-0తో జిన్ హ్యోక్ (ఉత్తర కొరియా)పై విజయం సాధించారు. అయితే భారత్‌కే చెందిన మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. -
దేవుణ్ని నమ్ము..నన్ను నమ్ము..కేసు వెనక్కి తీసుకో
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్ స్టీఫెన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి అతనికి మినహాయింపునిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17 వ తేదీ వరకు వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తనకు గైడ్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గత రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని కాలేజీకి చెందిన ఓ పీహెచ్డీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ కాలేజీ ప్రిన్పిపల్ తంపూ తనకు ఫోన్లు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను, మెసేజ్ కాపీలను పోలీసులకు అందించింది. అయితే వీటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఆడియో టేపుల సారాంశం దేవుడ్ని నమ్ము, నన్ను నమ్ము....కంప్లయింట్‌ను వెనక్కి తీసుకో...లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్.... పరిస్థితి నా చేయి దాటిపోయింది...నువ్వు వయసులో ఉన్నావ్.. మంచి అమ్మాయిలా ఉండాలి.. నువ్వు సంతోషంగా ఉండాలి..ఇది సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ రెవరండ్ తంపూ మాటలు. ఇపుడివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ప్రిన్సిపల్ ఖండించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గతంలోనూ ఖండించిన ఆయన కాలేజీ అంతర్గత కమిటీ విచారణలో పీహెచ్డీ విద్యార్థిని తమకు సహకరించలేదని తెలిపారు. కాగా సతీష్ కుమార్ వేధిస్తున్నాడంటూ 2013 అక్టోబర్‌లో విద్యార్థిని కాలేజీ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో గత నెలలో పచ్చ చీర కట్టుకురా లేదంటే.. యాసిడ్ పోస్తానని సతీష్ కుమార్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఆమె గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోరాటంలో ఢిల్లీలోని మహిళా సంఘాలు విద్యార్థినికి మద్దతుగా నిలిచాయి. -
బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీగా వి.సతీష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్‌గా రసమయి బాలకిషన్ ఈరోజు ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాజయ్యపై వేటు పడిన విషయం తెలిసిందే. అనంతరం డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరిని నియమించిన విషయం తెలిసిందే. -
వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు
ఇంచియాన్: ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు. దీంతో ఓవరాల్‌గా 5 పతకాల (1 స్వర్ణం+4 కాంస్యాలు)తో భారత్ బాక్సింగ్ ఈవెంట్‌ను ముగించింది. గ్వాంగ్జౌ క్రీడల్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో సత్తా చాటారు. పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) సెమీస్‌లో వికాస్ 1-2తో ప్రపంచ చాంపియన్ జానిబెక్ అల్మికన్లీ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్లో భారత్ బాక్సర్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థికి 9-10తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్లో మెరుపు దాడి చేస్తూ 10-9 స్కోరు సాధించాడు. మూడో రౌండ్లో కూడా ఇదే జోరు కనబర్చడంతో బౌట్ కజక్ బాక్సర్ సొంతమైంది. సూపర్ వెయిట్ (+91 కేజీలు) సెమీస్‌లో సతీశ్ 0-3తో ఇవాన్ డిచ్కో (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. డిచ్కో దూరం నుంచి విసిరిన బలమైన పంచ్‌లకు సతీశ్ వద్ద సమాధానం లేకపోయింది. -
ఎమ్మెల్యేను ప్రశ్నించిన అఖిలపక్ష నాయకులు
హుస్నాబాద్: హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏమైందని అఖిలపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ను ప్రశ్నించారు. కాలయాపన చేస్తే సమస్య మరుగున పడిపోతుందని, చేతకాకపోతే తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే హన్మకొండ నుంచి హుస్నాబాద్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రెవెన్యూ డివిజన్ సాధనసమితి కన్వీనర్ మేకల వీరన్నయాదవ్, అఖిల పక్ష నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, కొత్తపల్లి అశోక్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్, శివరాజ్నాయక్, బంక చందు, గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు అంబేద్కర్‌చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే వాహనం రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాన్ని అడ్డుకునేందుకు ముందుకు ఉరికారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయినా నాయకులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్‌తో పాటు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు డివిజ్ ఏర్పాటు చేస్తారా.. లేదా.. సమాధానం చెప్పాలన్నారు. చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పనున్నట్లు గమనించిన సీఐ సదన్‌కుమార్, ఎస్సై మహేందర్ ఆందోళనకారులను పక్కకు తప్పించారు. కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు మాడిశెట్టి శ్రీధర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు గవ్వ వంశీధర్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆరుగురి బైండోవర్ ఎమ్మెల్యే వాహనశ్రేణిని అడ్డుకున్న ఆరుగురు నాయకులను పోలీసులు బైండోవర్ చేశారు. కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, మాడిశెట్టి శ్రీధర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, గవ్వ వంశీధర్‌రెడ్డిని తహశీల్దార్ విజయసాగర్ ఎదుట బైండోవర్ చేశారు. -
క్రీడారత్నాలకు సత్కారం
సాక్షి, చెన్నై: కామన్వెల్త్లో మెరిసిన తమిళ క్రీడారత్నాలను సీఎం జయలలిత సత్కరించారు. మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా మున్ముందు మరింతగా రాణించి తీరుతామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేశారు. తమకు నగదు ప్రోత్సాహం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల పరంగా యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు జయలలిత ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతోపాటుగా క్రీడల శిక్షణ, వసతుల కల్పన మీద దృష్టి కేంద్రీకరించింది. మైదానాల ఏర్పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. విజేతలకు విద్యా పరంగా, ఆర్థిక పరంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో రాణించే తమిళ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాన్ని అందిస్తున్నారు. కామన్వెల్త్ బంగారాలు : స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తమిళ బంగారాలు సత్తాను చాటారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి తమిళ క్రీడాకారులు ముగ్గురు బంగారు పతకాల్ని, మరో నలుగురు వెండి పతకాల్ని దక్కించుకున్నారు. తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన వీరిని సత్కరించడంతో పాటుగా నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్ట్‌లో బంగారం దక్కించుకున్న సతీష్ కుమార్, స్క్వాష్ డబుల్స్‌లో పసిడి పతకాలతో మెరిసిన జ్యోత్స్న చిన్నప్ప, దీపికా పల్లికల్‌కు రూ.50 లక్షలు చొప్పున నజరానా అందజేయడానికి నిర్ణయించారు. టేబుల్ టెన్నిస్‌లో రాణించిన శరత్ కమల్, అమల్ రాజ్‌లకు తలా రూ.30 లక్షలు ప్రకటించారు. ఇక, భారత హకీ జట్టులో తమిళ క్రీడాకారులు రూపేంద్ర పాల్ సింగ్, శ్రీజేష్ పరట్ రవీంద్రలు చోటు దక్కించుకుని రాణించడంతో వారిని సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఇద్దరికి కూడా తలా రూ.30 లక్షల్ని ప్రకటించారు. ఈ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంగా మొత్తం రూ. 2.70 కోట్లను ప్రకటించారు. దీంతో వీరందరూ సోమవారం ఉదయాన్నే సచివాలయం చేరుకుని సీఎం జయలలితను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ రత్నాలను సీఎం జయలలిత ఘనంగా సత్కరించారు. వీరందరికీ చెక్కుల రూపంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహం అందజేశారు. మరింతగా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పరంగా తమిళనాడు ఖ్యాతిని మరింత పెంచినందుకు గాను ఈ రత్నాలను ప్రత్యేకంగా సీఎం జయలలిత అభినందించారు. మరిన్ని సాధిస్తాం: సత్కారం అనంతరం వెలుపలకు వచ్చిన క్రీడారత్నాలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రోత్సాహం మరింత బాధ్యతను పెంచిందనిపేర్కొన్నారు. అనేక క్రీడల్లో మరిన్ని పతకాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరం తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటామని వివరించారు. ఈ నగదు ప్రోత్సాహం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం జయలలిత తమకే కాకుండా క్రీడారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని, ఆమె ఆకాంక్ష మేరకు మరెందరో క్రీడాకారులు ఇక్కడి నుంచి అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రతి క్రీడా కారుడు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ ఆకాంక్ష మేరకు పతకాల పంట పండించాలని సూచించారు. అనంతరం ఈ ఏడుగురు క్రీడాకారులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సచివాలయం వెలుపల ఒకరినొకరు, గ్రూపు ఫొటోలు తీసుకుంటూ తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం విశేషం. -
విద్యార్ధి తీరుతో ఉలిక్కి పడ్డ నేతలు
-
మహిళా.. మేలుకో..
మార్షల్ ఆర్ట్స్‌పై యలమంచిలి యువకుడి ప్రచారం హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏదో ఓ మూల రోజుకో ఘోరం. ఆడ పిల్లలపై అఘాయిత్యం. పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి సంఘటనలు చూసి సమాజం ఏమైపోతోందని ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన. అయితే ఆ కుర్రాడు ఆవేదన పడి ఊరుకోలేదు. తనవంతుగా ఏం చేయగలనా? అని ఆలోచించాడు. మహిళలను మేల్కొలపడానికి హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ ఒకటి రెండు చోట్ల ఆత్మరక్షణపై విద్యార్థినుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నించాడు. అతడే యలమంచిలికి చెందిన సతీష్‌కుమార్ వెలగ. 10 రోజులు.. 650 కిలోమీటర్లు సతీష్ హైదరాబాద్‌లోని జీఈ కాపిటల్స్లో ప్రాసెస్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిన సంఘటనతో చలించిపోయాడు. శారీరకంగా బలహీనులైన మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే తమను తాము రక్షించుకోగలరని, ఆ దిశగా ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ‘ఆడపిల్లల ఆత్మ రక్షణ-భావి తరాలకు రక్షణ’ నినాదంతో ఈ నెల 17న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పది రోజులు ప్రయాణించి సోమవారం విశాఖ చేరుకున్నాడు. సాగరతీరంలో తన యాత్రను ముగించాడు. మధ్యలో తనకు తారసపడిన ప్రతి నగరం, పట్టణంలోని కళాశాలల వద్దకెళ్లి మహిళ ఆత్మ రక్షణపై తనకు తెలిసింది వివరించాడు. వారితో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కృషి చేశాడు. మార్షల్ ఆర్ట్స్ బీమాలాంటిది జీవితానికి బీమా ఎలాంటిదో.. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కూడా అలాంటివే. టెక్నాలజీని అమ్మాయిలు వాడుకోవాలి. GoSafe, bSafe, Fightback, Life 360 తదితర అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒంటరిగా వెళ్లేటప్పుడు ప్రయాణించే వాహనం నంబర్, ఫొటో తదితర వివరాలు వాట్స్ప్లాంటి సౌకర్యాల ద్వారా తల్లిదండ్రులు, బంధువులకు చేరే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిసేటట్టు వ్యవహరిస్తే.. వారు అనుచితంగా వ్యవహరించడానికి భయపడతారు. - సతీష్‌కుమార్ వెలగ