వసతిగృహాల్లో విజిలెన్స్ తనిఖీలు
బత్తిలి (భామిని): బత్తిలి సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. విజిలెన్స్ సీఐలు చంద్ర, సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఉద యం ఏడున్నరకే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వసతిగృహం సంక్షేమాధికారిణి అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అధికారులు ఈ విషయమై ఆరా తీయగా గురువారం నుంచి సంక్షేమాధికారిణి విధులకు రాలేదని విద్యార్థినులు, సిబ్బంది వివరించారు. వసతి గృహంలో 103 మంది విద్యార్థినులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
స్టాక్ వివరాలు, విద్యార్థుల హాజరు, కాస్మోటిక్ చార్జీల చెల్లింపు వివరాలను పరిశీలించారు. వసతిగృహంలో విద్యార్థుల సమస్యలపై నివేదికను తయారు చేశారు. 103 మంది విద్యార్థినులకు సరిపడే టారుులెట్లు, రక్షిత మంచినీటి సదుపాయాలు లేవని, వంద మంది విద్యార్థినులు ఇరుకై న గదుల్లో నేలపైనే పడుకొంటున్నారని గుర్తించారు. కిటికీలకు నెట్లు లేక దోమలతో ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వసతిగృహ సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నమోదు చేశారు.
గుళ్లసీతారాంపురంలో దాడులు..
సంతకవిటి (రాజాం): సంతకవిటి మండలంలోని గుళ్లసీతారాంపురంలో విజిలెన్‌స అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించా రు. గ్రామంలోని ఎస్సీ బాలుర వసతిగృహంతో పాటు రేషన్ డిపోల్లో తనిఖీలు చేశారు. విజిలెన్‌స డీఎస్పీ బి.ప్రసాదరా వు, సీఐ కృష్ణ, ఎస్‌ఐ అప్పలనాయుడుతో పాటు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తొలుత వసతిగృహంలో మెనూ వివరా లు తెలుసుకున్నారు. వసతిగృహ అధికారి లేకపోవడంతో సమాచారం తెలియజేయ గా రంగనాయకులదాస్ వచ్చి రికార్డులు, సరుకులను చూపించారు. రికార్డులు సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థుల బయోమెట్రిక్, మేన్యువల్ హాజరు పట్టీలో తేడా ఉన్నట్టు గుర్తించారు.
డిపోలో అధిక నిల్వలు
మరో వైపు గ్రామంలోని 31వ రేషన్ డిపోలో తనిఖీలు నిర్వహించారు. డీలర్ రావు మురళీ కృష్ణ వద్ద వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించగా ఇక్కడ రికార్డులో నమోదు కంటే అదనంగా 521 లీటర్లు కిరోసిన్, 35 కిలోల బియ్యం, అరకిలో పంచదార ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని సీజ్ చేసి తహశీల్దార్‌కు అప్పగించనున్నట్టు తెలిపారు.