Vigilance checks
-
వసతిగృహాల్లో విజిలెన్స్ తనిఖీలు
బత్తిలి (భామిని): బత్తిలి సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. విజిలెన్స్ సీఐలు చంద్ర, సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఉద యం ఏడున్నరకే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వసతిగృహం సంక్షేమాధికారిణి అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అధికారులు ఈ విషయమై ఆరా తీయగా గురువారం నుంచి సంక్షేమాధికారిణి విధులకు రాలేదని విద్యార్థినులు, సిబ్బంది వివరించారు. వసతి గృహంలో 103 మంది విద్యార్థినులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. స్టాక్ వివరాలు, విద్యార్థుల హాజరు, కాస్మోటిక్ చార్జీల చెల్లింపు వివరాలను పరిశీలించారు. వసతిగృహంలో విద్యార్థుల సమస్యలపై నివేదికను తయారు చేశారు. 103 మంది విద్యార్థినులకు సరిపడే టారుులెట్లు, రక్షిత మంచినీటి సదుపాయాలు లేవని, వంద మంది విద్యార్థినులు ఇరుకై న గదుల్లో నేలపైనే పడుకొంటున్నారని గుర్తించారు. కిటికీలకు నెట్లు లేక దోమలతో ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వసతిగృహ సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నమోదు చేశారు. గుళ్లసీతారాంపురంలో దాడులు.. సంతకవిటి (రాజాం): సంతకవిటి మండలంలోని గుళ్లసీతారాంపురంలో విజిలెన్స అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించా రు. గ్రామంలోని ఎస్సీ బాలుర వసతిగృహంతో పాటు రేషన్ డిపోల్లో తనిఖీలు చేశారు. విజిలెన్స డీఎస్పీ బి.ప్రసాదరా వు, సీఐ కృష్ణ, ఎస్ఐ అప్పలనాయుడుతో పాటు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తొలుత వసతిగృహంలో మెనూ వివరా లు తెలుసుకున్నారు. వసతిగృహ అధికారి లేకపోవడంతో సమాచారం తెలియజేయ గా రంగనాయకులదాస్ వచ్చి రికార్డులు, సరుకులను చూపించారు. రికార్డులు సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థుల బయోమెట్రిక్, మేన్యువల్ హాజరు పట్టీలో తేడా ఉన్నట్టు గుర్తించారు. డిపోలో అధిక నిల్వలు మరో వైపు గ్రామంలోని 31వ రేషన్ డిపోలో తనిఖీలు నిర్వహించారు. డీలర్ రావు మురళీ కృష్ణ వద్ద వివరాలు సేకరించారు. రికార్డులు పరిశీలించగా ఇక్కడ రికార్డులో నమోదు కంటే అదనంగా 521 లీటర్లు కిరోసిన్, 35 కిలోల బియ్యం, అరకిలో పంచదార ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని సీజ్ చేసి తహశీల్దార్‌కు అప్పగించనున్నట్టు తెలిపారు. -
ప్రైౖ వేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలోని నలంద జూనియర్ కళాశాలలో గురువారం విజిలెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ శాఖ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో అధికారుల బృందం కళాశాల రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు, బాత్రూంలు, ఆటస్థలాలు, అధ్యాపకుల అర్హతలు, విద్యా సంస్థల ధ్రువపత్రాలు, అనుమతులను తనిఖీ చేస్తున్నామని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందాయా లేదా.. అన్న విషయాన్ని కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించామని, ఇంకా 50 కళాశాలల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు కళాశాలల్లో అగ్నిమాపక, సానిటరీ ధ్రువపత్రాలు లేకపోవడం తమ పరిశీలనలో గుర్తించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ శాఖ ఏఈఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ సతీశ్‌రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
నెల్లికుదురు : మండల కేంద్రంలోని ప్రయివేటు జూని యర్ కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ఏఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్రూంలు, అధ్యాపకులు, ఫీజ్ రీయింబర్స్‌మెంటు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి రహస్య నివేదికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మార్గదర్శి కళాశాల మూసివేసి ఉండడంతో 2014 నుంచి 2016 వరకు కళాశాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐడీ ఎస్సై రమేష్, ఏఈ సుగుణాకర్‌రావు, అధ్యాపకుడు అంజయ్య, జూనియర్ అసిస్టెంటు వేణుకుమార్, సిబ్బంది రమేష్, అఫ్జల్ పాల్గొన్నారు. కొడకండ్లలో.. కొడకండ్ల : మండల కేంద్రంలోని ప్రైవేటు కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. సాయి డిగ్రీ కళాశాల, శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల రికార్డులు, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల అర్హతలు తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలల స్థితిగతులపై నివేదిక రూపొందించి జిల్లా అధికారులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు ధనుం జయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మూడు ప్రైవేటు కళాశాలలను రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలిసారిగా శుక్రవారం తనిఖీ చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ఏఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేష్, సీఐడీ సీఐ సదానిరంజన్, ఏసీబీ సీఐ రమణమూర్తి, విజిలెన్స్ ఇంజనీరింగ్ అధికారి భానుప్రకాష్, ఎఫ్ఆర్ఓ అహ్మద్ మియా, మాధవరావు తదితరులు రెండు బృందాలుగా తనిఖీలు సాగించారు. చర్ల రోడ్డులోగల కళాశాలలో విద్యార్థులకు తగిన వసతులు లేకపోవడాన్ని, వెలుతురు లేని గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండడాన్ని గుర్తించారు. అర్హతగల అధ్యాపకులు లేకుండానే కళాశాల నిర్వహిస్తున్నారని, రికార్డుల్లో నమోదు చేసిన మేరకు విద్యార్థులు లేరని తనిఖీ బృందం గుర్తించినట్టు సమాచారం. ఐటీడీఏ రోడ్లోగల కళాశాలను తనిఖీ చేసిన ఈ బృందం.. అక్కడ అనేక లోపాలను గుర్తించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్‌లో వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాలను నిర్వహిస్తుండడాన్ని, బాలిబాలికలకు అదే క్యాంపస్‌లోనే హాస్టల్ ఏర్పాటు చేయడాన్ని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక్కడ కూడా అర్హత గల అధ్యాపకులు లేరని, విద్యార్థులకు తగిన వసతులు లేవని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ రెండు బృందాలు తమ తనిఖీలలో గమనించిన అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ అధికారులు శనివారం కూడా భద్రాచలంలోని మరికొన్ని కళాశాలలను పరిశీలిస్తారు. తనిఖీ వివరాలను వెల్లడించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అంగీకరించలేదు. తమ పరిశీలనలో తేలిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. -
డిగ్రీ ‘ఆన్లైన్’ ఆగమాగం!
ఇటు భారీగా సీట్లు.. అటు అందని అఫిలియేషన్లు * మరోవైపు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు * కాలేజీ, సీటు ఎంచుకున్నాక అఫిలియేషన్ రాకపోతే పరిస్థితేమిటి? * ఆందోళనలో విద్యార్థులు.. స్పష్టత ఇవ్వని ఉన్నత విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల పరిస్థితి గందరగోళంగా తయారైంది. అటు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.. ఇటు డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోవైపు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలు పూర్తయ్యాక ఆ నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఎన్ని కాలేజీల్లో ఎన్ని కోర్సులు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని రద్దవుతాయన్నది తేలనుంది. అయితే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్ల ద్వారా కాలేజీలను, కోర్సులను ఎంచుకుంటున్నారు. త్వరలోనే సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. మరి విద్యార్థులు ఎంచుకున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోతే పరిస్థితి ఏమిటి, విజిలెన్స్ తనిఖీల్లో లోపాలు బయటపడి ఆయా కాలేజీలు లేదా విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు రద్దయితే ఎలాగన్న దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. యూనివర్సిటీ తప్పిదాలు మరిన్ని.. మరోవైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీ సీట్ల విషయంలో తప్పిదానికి పాల్పడ్డాయి. కాలేజీల్లో పరిమితికి మించిన సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెబ్సైట్లో (వెబ్ ఆప్షన్ల కోసం) అప్లోడ్ చేశాయి. నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీలో ఒక్కో సెక్షన్‌కు ఆర్ట్స్, కామర్స్ గ్రూపులైతే 60 సీట్లు, సైన్స్ గ్రూపులైతే 50 సీట్లకు అనుమతివ్వాలి. అవసరమైతే మరో అదనపు సెక్షన్‌కు అనుమతించాలి. అంటే రెండు సెక్షన్లు కలిపి ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో 120 సీట్లకు, సైన్స్ గ్రూపుల్లో 100 సీట్లకు మించి ఉండరాదు. కానీ అనేక కాలేజీల్లో ఒక్కో గ్రూపులో 150 సీట్ల నుంచి 450 సీట్ల వరకు ఉన్నట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. కాలేజీలు ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా యూనివర్సిటీలు అప్లోడ్ చేశాయే తప్ప.. నిబంధనలను పట్టించుకోలేదు. ఇలా ఇష్టారాజ్యంగా సీట్ల సంఖ్యను వెబ్సైట్లో ఎలా పెట్టారంటూ యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు కూడా రాసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లున్నాయనే ఆలోచనతో టాప్ కాలేజీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. మరి ఆ సీట్లు లేవని తేలితే ఎలాగన్న ది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీట్ల కేటాయింపును వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. కాలేజీల గుర్తింపు, సీట్ల సంఖ్య తేలాక.. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించి సీట్లు కేటాయించాలని చెబుతున్నా యి. లేకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ముందుకెళుతున్న విద్యాశాఖ ఉన్నత విద్యా శాఖ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. కాలేజీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే, వాటిల్లో సీట్ల లెక్క తేలకుండానే... గతేడాది లెక్కలను తీసుకుని కాలేజీలు, సీట్ల వివరాలను ఆన్లై న్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,103 డిగ్రీ కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆయా కాలేజీలు, సీట్లలో చేరేందుకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే సీట్లను కూడా కేటాయించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తికాకపోవడం, విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతుండడంతో... ఏవైనా కాలేజీలు, సీట్లు రద్దయితే వాటిని ఎంచుకున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కాక అధికారులే తల పట్టుకుంటున్నారు. లోపాలు వెల్లడైనా కాలేజీలపై చర్యలు చేపట్టకుండా వదిలేస్తారా, విద్యార్థులను వేరే కాలేజీల్లోకి మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
* రెండు జిల్లాల్లో వెయ్యి ఇళ్ల పరిశీలన * డీఎస్పీ ప్రసాదరావు బొబ్బిలి, బొబ్బిలి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లులు చెల్లింపులపై క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి. ప్రసాదరావు చెప్పారు. బొబ్బిలి మార్కెట్ కమిటీలో పౌరసరఫరాల గోదాంను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి మండలం చింతాడ, డెంకాడ మండలంలోని ఒక గ్రామంలో 400 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం కేసరిపురం, సీతంపేట మండలంలో పెదరామ, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో 600 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో మంజూరైన ఇళ్లు నిర్మించారా, అవి ఏయే స్థాయిలో ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు అందిన బిల్లులు అసలు అందాయా లేదా తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలి పారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలపై ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసామన్నారు. పౌరసరఫరాల గోదాంలు, రేషను డిపోలు కూడా పరిశీలి స్తున్నామన్నారు. బొబ్బిలిలోని గోదాం పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఆహార ఉత్పత్తులకు ప్రమాదకరమని గతంలో నివేదిక ఇచ్చినా మార్పు కనిపించలేదన్నారు. వీటిపై మళ్లీ నివేదిక ఇస్తామన్నారు. పరిశీలనలో విజిలెన్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. చింతాడలో విజిలెన్సు దర్యాప్తు ఇందిరమ్మ ఇళ్లపై శ్రీకాకుళం విజిలెన్సు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో విజిలెన్సు సీఐలు ప్రదీప్‌కుమార్, రేవతమ్మలు శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు. గ్రామంలో అప్పట్లో మంజూరైన ఇళ్లను పరిశీలించి పంచాయితీ కార్యాలయానికి చేరుకుని పలు వివరాలు నమోదు చేసుకున్నారు. వారివెంట విజిలెన్సు ఎస్ఐ అప్పలనాయుడు ఉన్నారు. -
మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, గుంటూరు: గుంటూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. గతంలో మార్కెట్‌యార్డులో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు హమాలీలకు ప్రభుత్వం చెల్లించిన పరిహారంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు విడతలుగా పంపిణీ చేసిన పరిహారం మొత్తం విలువ రూ.41లక్షల వరకు ఉంది. బాధితుల వివరాలు, పరిహారం అందజేత సంతకాలకు సంబంధించిన ఫైలు యార్డులో మాయమైందని అధికారులు తేల్చారు. వాస్తవాలపై విచారించి నివేదిక పంపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు తాజాగా విజిలెన్స్ సీఐ షేక్ ఖాశింసైదా, కె.వెంకట్రావు యార్డుకు వెళ్లారు. యార్డు కార్యదర్శి ఐ.నరహరిని కలిసి సదరు ఫైలు మాయంపై లిఖితపూర్వకంగా వివరాలను సేకరించారు. అనంతరం అప్పట్లో పరిహారం అందజేసిన యార్డు ఉద్యోగులు వి.ఆంజనేయులు, ఐ. వెంకటేశ్వరరెడ్డి, రమేష్, సుబ్రమణ్యం లను పిలిపించారు. వారి సమక్షంలోనే రికార్డు గదిని తెరి పించి ఫైళ్లు తనిఖీచేశారు. పరిహారం తీసుకున్న హమాలీల జాబితా, వారి సంతకాలు, ఏఏ బ్యాంకుల ఖాతాల్లో పరిహారం జమచేసిందనే అంశాలపై యార్డు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ హమాలీల పరిహారం అందజేతపై విచారణను సగానికి పైగా పూర్తిచేశామని.. వీలైనంత త్వరలోనే వాస్తవాల్ని వెలుగులోకి తెస్తామని తెలిపారు.