* రెండు జిల్లాల్లో వెయ్యి ఇళ్ల పరిశీలన
* డీఎస్పీ ప్రసాదరావు
బొబ్బిలి, బొబ్బిలి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లులు చెల్లింపులపై క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ బి. ప్రసాదరావు చెప్పారు. బొబ్బిలి మార్కెట్ కమిటీలో పౌరసరఫరాల గోదాంను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి మండలం చింతాడ, డెంకాడ మండలంలోని ఒక గ్రామంలో 400 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం కేసరిపురం, సీతంపేట మండలంలో పెదరామ, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో 600 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు.
క్షేత్ర స్థాయిలో మంజూరైన ఇళ్లు నిర్మించారా, అవి ఏయే స్థాయిలో ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు అందిన బిల్లులు అసలు అందాయా లేదా తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలి పారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలపై ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసామన్నారు. పౌరసరఫరాల గోదాంలు, రేషను డిపోలు కూడా పరిశీలి స్తున్నామన్నారు. బొబ్బిలిలోని గోదాం పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఆహార ఉత్పత్తులకు ప్రమాదకరమని గతంలో నివేదిక ఇచ్చినా మార్పు కనిపించలేదన్నారు. వీటిపై మళ్లీ నివేదిక ఇస్తామన్నారు. పరిశీలనలో విజిలెన్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
చింతాడలో విజిలెన్సు దర్యాప్తు
ఇందిరమ్మ ఇళ్లపై శ్రీకాకుళం విజిలెన్సు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో విజిలెన్సు సీఐలు ప్రదీప్‌కుమార్, రేవతమ్మలు శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు. గ్రామంలో అప్పట్లో మంజూరైన ఇళ్లను పరిశీలించి పంచాయితీ కార్యాలయానికి చేరుకుని పలు వివరాలు నమోదు చేసుకున్నారు. వారివెంట విజిలెన్సు ఎస్‌ఐ అప్పలనాయుడు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
Published Sat, Feb 27 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM
Advertisement
Advertisement