సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్‌గా ఉన్నారా అని నిలదీశారు.
అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.
‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?
చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్‌గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.
జగన్ చేసిన MOUలో క్లియర్‌గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు..
కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?
ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment