
మానసిక వైద్యుడు సతీష్‌కుమార్‌పై పోక్సో కేసు
మధురవాడ(విశాఖ): ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవరించిన మధురవాడ మిథి లా పురి వుడా కాలనీలోని మానసిక ఆస్పత్రికి చెందిన ఓ వైద్యునిపై పీఎంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారలో ఉంటున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌కు ఇద్దరమ్మాయిలు. చిన్న కుమార్తె (15) ఇంటర్ ప్రథమ సంవత్సరం, పెద్ద కుమార్తె (16) రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె ప్రతి విషయానికి భయపడుతుండడంతో మానసిక వైద్యునికి చూపించాలని భావించారు.
దీంతో మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉంటున్న మానసిక వైద్యుడు సతీష్‌కుమార్‌ను సంప్రదించారు. ఈనెల 8వ తేదీన అసభ్యకర బొమ్మలతో క్లాస్ చెబుతున్న క్రమంలో బాలికల పట్ల సతీష్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీన పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment