వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు
ఇంచియాన్: ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు. దీంతో ఓవరాల్‌గా 5 పతకాల (1 స్వర్ణం+4 కాంస్యాలు)తో భారత్ బాక్సింగ్ ఈవెంట్‌ను ముగించింది. గ్వాంగ్‌జౌ క్రీడల్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో సత్తా చాటారు.
పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) సెమీస్‌లో వికాస్ 1-2తో ప్రపంచ చాంపియన్ జానిబెక్ అల్మికన్లీ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్‌లో భారత్ బాక్సర్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థికి 9-10తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్‌లో మెరుపు దాడి చేస్తూ 10-9 స్కోరు సాధించాడు. మూడో రౌండ్‌లో కూడా ఇదే జోరు కనబర్చడంతో బౌట్ కజక్ బాక్సర్ సొంతమైంది.
సూపర్ వెయిట్ (+91 కేజీలు) సెమీస్‌లో సతీశ్ 0-3తో ఇవాన్ డిచ్కో (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. డిచ్కో దూరం నుంచి విసిరిన బలమైన పంచ్‌లకు సతీశ్ వద్ద సమాధానం లేకపోయింది.