Vikas Krishan
-
‘జాతీయ శిబిరానికి వెళ్లేది లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు సన్నాహకంగా పటియాలలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో తాను పాల్గొనేది లేదని భారత టాప్ బాక్సర్ వికాస్ కృషన్æ స్పష్టం చేశాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కంటే... తాను అమెరికాలో కొన్ని ప్రొ బాక్సింగ్ బౌట్లలో తలపడేందుకు ఇష్టపడతానని చెప్పాడు. ప్రస్తుతం వికాస్ బెంగళూరులోని ‘ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)’లో ఆమెరికన్ కోచ్ రొనాల్డ్ సిమ్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. దాంతో కరోనా క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో భారత బాక్సింగ్ సమాఖ్య వికాస్‌పై విచారణకు ఆదేశించింది. అనంతరం అతడు కావాలని ఇదంతా చేయలేదని తేలడంతో అతడిని వెంటనే పాటియాలలోని శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై స్పందించిన వికాస్... ప్రస్తుతం ఐఐఎస్‌లో తన శిక్షణ చక్కగా కొనసాగుతుందని, అటువంటప్పుడు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపాడు. -
మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో వికాస్ బౌట్
న్యూయార్క్: భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. శనివారం అతను అమెరికాకు చెందిన నోవా కిడ్తో ఆడతాడు. అమెరికాలోని విఖ్యాత ‘మాడిసన్ స్క్వేర్ గార్డెన్’లో ఈ బౌట్ జరుగనుండటం విశేషం. ప్రొ కెరీర్లో అజేయంగా దూసుకెళుతున్న విజేందర్ సింగ్‌కు కూడా ఈ వేదికపై పోటీపడే అవకాశం రాలేదు. కానీ రెండో బౌట్ లోనే వికాస్‌కు చక్కటి అవకాశం దక్కింది. ఈ ఏడాదే ప్రొ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన వికాస్ జనవరిలో జరిగిన తొలిపోరులో స్టీవెన్ అండ్రడేను ఓడించాడు. వికాస్ గతేడాది జరిగిన ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలిచాడు. -
ప్రొఫెషనల్ సర్క్యూట్లో బాక్సర్ వికాస్ శుభారంభం
భారత బాక్సర్ వికాస్ క్రిషన్కు ప్రొఫెషనల్ సర్క్యూట్లో శుభారంభం లభించింది. న్యూయార్క్‌లో జరిగిన తన తొలి బౌట్లో వికాస్... స్టీవెన్ అండ్రడే (అమెరికా)పై గెలుపొందాడు. విఖ్యాత బాక్సింగ్ ప్రమోటర్ బాబ్ అరుమ్కు చెందిన ‘టాప్ ర్యాంక్ ప్రమోషన్స్’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న భారత బాక్సర్ వెల్టర్‌వెయిట్ కేటగిరీతో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. ఆరు రౌండ్ల ఈ బౌట్ కేవలం రెండు రౌండ్లలోనే ముగిసింది. నిర్వాహకులు వికాస్ ప్రత్యర్థి అండ్రడే సాంకేతికంగా నాకౌట్ అయినట్లు ప్రకటించారు. -
బాక్సింగ్ సెమీస్‌లో వికాస్, అమిత్
ఏషియాడ్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) 3–2తో చైనాకు చెందిన తుహెటా ఎర్బీక్ తంగ్లథియాన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అమిత్ ఫంఘాల్ (49 కేజీలు) 5–0తో దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ జాంగ్ ర్యాంగ్‌పై గెలుపొందాడు. మరోవైపు మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో సర్జుబాలా దేవి (51 కేజీలు) 0–5 తేడాతో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. దీంతో భారత మహిళా బాక్సర్లు పతకాలేమీ సాధించకుండా వెనుదిరిగినట్లయింది. మహిళల బాక్సింగ్‌ను ఏషియాడ్‌లో ప్రవేశపెట్టిన (2010) తర్వాత భారత్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి. -
వికాస్ ముందంజ... హుసాముద్దీన్ ఓటమి
ఏషియాడ్ బాక్సింగ్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు), ధీరజ్ (64 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. అయితే, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత, నిజామాబాద్ కుర్రాడు మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. హుసాముద్దీన్ 2–3తో కిర్గిస్తాన్‌కు చెందిన ఎంక్ అమర్ ఖర్ఖు చేతిలో ఓడిపోయాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో హుసాముద్దీన్ నుదురుకు గాయమైంది. వికాస్ పదునైన పంచ్‌లతో 5–0తో తన్వీర్ అహ్మద్ (పాకిస్తాన్)పై... అమిత్ 5–0తో ఎన్ఖమన్‌దఖ్ ఖర్హు (మంగోలియా)పై... ధీరజ్ (64 కేజీలు) 3–0తో నుర్లాన్ కొబషెవ్ (మంగోలియా)పై గెలుపొందారు. -
తొలి భారత బాక్సర్‌గా...
సోఫియా(బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లోభారత బాక్సర్ వికాస్ క్రిషన్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెస్ట్ బాక్సర్ అవార్డును వికాస్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ బాక్సింగ్ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారత బాక్సర్‌గా వికాస్ నిలిచాడు. సోఫియా వేదికగా 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన తుది పోరులో వికాస్ విజయ సాధించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బాక్సర్ అవార్డును సైతం సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఫైనల్ పోరులో వరల్డ్ చాంపియన్స్ కాంస్య పతక విజేత ట్రో ఇస్లే(అమెరికా)పై గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి పతకాన్ని అందుకున్నాడు. మరొకవైపు మరో భారత బాక్సర్ అమిత్ పంగల్ కూడా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 49 కేజీల విభాగంలో అమిత్ స్వర్ణాన్ని సాధించాడు. ఇక మహిళల తుది పోరులో మేరీకోమ్ రజతంతో సరిపెట్టుకుంది. దాంతో ఇక్కడ వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించాలనుకున్న మేరీకోమ్‌కు నిరాశే ఎదురైంది. 48 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన సెవదా అసెనోవా చేతిలో మేరీకోమ్ ఓటమి పాలై రజత పతకానికే పరిమితమయ్యారు. స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జట్టు 11 పతకాలతో పోరును ముగించింది. ఇందులో ఐదు పతకాలు పురుషులు సాధించగా, ఆరు పతకాల్ని మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరడం విశేషం. -
బాక్సర్ వికాస్‌కు హెచ్చరికతో సరి
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో సెమీఫైనల్ బౌట్‌కు ముందు ‘వాకోవర్’ ఇచ్చిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్‌పై క్రమశిక్షణ కమిటీ విచారణ ముగిసింది. ఈసారికి అతడిని హెచ్చరికతో వదిలేయాలని నిర్ణయించినట్టు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పేర్కొంది. ‘జరిగిన సంఘటనపై అతడిని హెచ్చరించాం. ఇక ఈ విషయం ఇంతటితో ముగిసింది. క్రమశిక్షణ కమిటీ అతడితో మాట్లాడింది. అతడి వాదన విన్నాక హెచ్చరిక సరిపోతుందని భావించారు’ అని బీఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ సెమీస్‌లో కొరియన్ బాక్సర్తో తలపడాల్సి ఉండగా వికాస్ కారణం చెప్పకుండానే బౌట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అదే నెలలో జరిగిన వరల్డ్ సిరీస్ లో అతడికి ఆడే అవకాశం ఇవ్వకుండా, ఈ సంఘటనపై విచారణ కమిటీ నియమించారు. -
వరల్డ్ సిరీస్ బాక్సింగ్ టోర్నీలో మనోజ్ కుమార్
భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ (డబ్ల్యూఎస్బీ) టోర్నమెంట్లో అరంగేట్రం చేయనున్నాడు. జూన్ 8న లండన్‌లో అస్తానా అర్లాన్స్ (కజకిస్తాన్)తో జరిగే సెమీఫైనల్ బౌట్లో ఈ హరియాణా బాక్సర్ బ్రిటిష్ లయన్హార్ట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 69 కేజీల విభాగంలో పోటీపడనున్న మనోజ్ ఈ నెలలో ఆసియా చాంపియన్‌షిప్‌లో టాప్–6లో నిలిచి ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన వికాస్ కృషన్ (75 కేజీలు), కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) కూడా బ్రిటిష్ లయన్హార్ట్స్ జట్టు తరఫున ఆడాల్సి ఉన్నా... వేర్వేరు కారణాల వల్ల ఈ ఇద్దరు వైదొలిగారు. -
క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధూరి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతోమసక్ కుటియా (థాయ్‌లాండ్)తో జరిగిన బౌట్లో వికాస్ రెండు నిమిషాల్లోపే విజయం సాధించాడు. గౌరవ్ బిధూరి పాయింట్ల ప్రాతిపదికన యుటపాంగ్ తాంగ్డీ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా, అమిత్ ఫంగల్ సునాయాసంగా రమీష్ రహమాని (అఫ్ఘానిస్తాన్)ను చిత్తు చేశాడు. అయితే మరో భారత ఆటగాడు ఆశిష్ కుమార్ 64 కేజీల విభాగంలో ఇక్బొల్‌జొన్ ఖొల్‌దరొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
స్వర్ణమే నా టార్గెట్: భారత బాక్సర్
రియో డిజెనీరో: ఒలింపిక్స్‌లో పతకం కోసం మొహం వాచి ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానుల్లో కొద్దికొద్దిగా కాంతిరేఖలు వికసిస్తున్నాయి. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ సెమీస్‌లోకి ఎంటరైంది. వీరికి మరో విజయం దూరంలో ఒలింపిక్స్ పతకం ఊరిస్తోంది. ఈ జోడీ ఫైనల్లోకి వెళితే.. పతకం ఖాయం. ఒకవేళ ఓడినా కాంస్యం దక్కే చాన్స్ ఉంది. ఇక భారత బాక్సర్ వికాస్ కిషన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అతడు ఇంకో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో పతకం చేరుతుంది. 75 కేజీల మిడిల్ వెయిట్ బౌట్లో ప్రీక్వార్టర్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వికాస్.. టర్కీకి చెందిన ఒండర్ సిపాల్పై అలవోకగా విజయం సాధించాడు. 3-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకున్న వికాస్.. భారత్ తరఫున స్వర్ణపతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం గెలువాలనే తాను కోరుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్తో బౌట్లో విజయం సాధిస్తే తాను తప్పకుండా ఒలింపిక్స్ స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతానని ఆయన పేర్కొన్నాడు. 'మెలికుజీవ్ గ్రూప్ విభాగంలో చాలా టఫ్‌గా కనిపించాడు. క్వార్టర్ ఫైనల్లో నేను కనుక అతన్ని ఓడిస్తే స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతాను. నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రజతం కానీ, కాంస్యంతో కానీ నేను సరిపెట్టుకోను. ఒకవేళ ఉత్త చేతులతో వస్తా లేదా స్వర్ణపతకంతో దేశంలో అడుగుపెడతా. అతన్ని ఓడిస్తే స్వర్ణాన్ని గెలువడం ఖాయం' అని 24 ఏళ్ల వికాస్ ధీమా వ్యక్తం చేశాడు. మరీ వికాస్ కచ్చితంగా గెలువాలని కోరుకుంటూ మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం! -
పతకానికి అడుగు దూరంలో..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పంచ్ అదిరింది. 75 కేజీల మిడిల్‌వెయిట్ విభాగంలో బరిలోకి దిగిన వికాస్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన పోరులో వికాస్ 3-0 తేడాతో సైపల్ ఓండర్(టర్కీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ వికాస్ ఆద్యంత పైచేయి సాధించి నాకౌట్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఒకానొక దశలో వికాస్ పంచ్‌లకు ఓండర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కంటినుంచి రక్తం కారడంతో 38 సెకెండ్లపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత కూడా వికాస్ మరింత దూకుడునే కొనసాగించి ఓండర్ ను చిత్తు చేశాడు. దీంతో జడ్జిల ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని సొంతం చేసుకుని క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెక్తిమిర్ మెలికుజివ్తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. 2015 ఆసియన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో మెలికుజివ్ విజయం సాధించాడు. మరోవైపు 2014 యూత్ ఒలింపిక్ చాంపియన్ అయిన మెలికుజివ్.. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
పతకానికి అడుగు దూరంలో..
-
భారత బాక్సర్ తెలివైన పంచ్‌లు..
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ శుభారంభానిచ్చాడు. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో వికాస్ కృష్ణన్ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్ చేరుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పోరులో అమెరికాకు చెందిన చార్లెస్ కాన్వెల్ పై 3-0 తేడాతో వికాస్ గెలుపొందాడు. తొలి మూడు నిమిషాల్లో ప్రత్యర్ధి పంచ్ లను తప్పించుకుని వరుసగా పాయింట్లు సాధించాడు. వరుసగా మూడు రౌండ్లలో అమెరికన్ బాక్సర్ చార్లెస్ ను తెలివిగా మైండ్ గేమ్ ఆడి దెబ్బకొట్టాడు. అందుకే మూడు రౌండ్లలోనూ కేవలం ఒక్క పాయింట్ (29-28, 29-28, 29-28) తేడాతో వికాస్ కృష్ణన్ విజయాన్ని నమోదుచేశాడు. ప్రీక్వార్టర్స్‌లో టర్కీకీ చెందిన సిపల్ వండెర్‌తో వికాస్ తలపడనున్నాడు. గతంలో ఆసియా గేమ్స్ లో స్వర్ణం సాధించిన వికాస్ పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. -
భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా
రియో డీజనీరో:రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. భారత్ నుంచి బాక్సింగ్ విభాగంలో శివ థాపా(56కేజీలు), మనోజ్ కుమార్(64కేజీలు), వికాస్ క్రిషన్(75 కేజీలు)లు తమ తొలి పోరులో కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన డ్రాలో వికాస్ క్రిషన్ ఒక్కడికే సీడింగ్ లభించగా, మిగతా ఇద్దరూ అన్ సీడెడ్‌గా బరిలోకి దిగనున్నారు. రియో ఒలింపిక్స్‌లో వికాస్ ఏడో సీడ్‌గా పోరుకు సన్నద్ధమయ్యాడు. కాగా, ఈ మెగా ఈవెంట్లో శివ థాపా తన తొలి పోరులో గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత, క్యూబా బాక్సర్ రాబ్సీ రామ్రెజ్తో తలపడనున్నాడు. అయితే 2010 యూత్ ఒలింపిక్స్‌లో శివ థాపాతో జరిగిన ముఖాముఖి పోరులో రాబ్బీ విజేతగా నిలిచాడు. ఈ బాక్సర్లు ఇద్దరూ వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకాలు సాధించడంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. వీరి మద్య ఆగస్టు 9వ తేదీన బౌట్ జరుగనుంది. మరో భారత బాక్సర్ వికాస్ క్రిషన్.. అమెరికా యువ బాక్సర్ చార్లెస్ కోన్ వెల్‌తో ఓపెనింగ్ గేమ్ లో తలపడనుండగా, గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్తో మనోజ్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ రెండు బౌట్లు ఆగస్టు 10 వ తేదీన జరుగనున్నాయి. -
'రియోలో పతకం సాధిస్తా'
న్యూఢిల్లీ: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని భారత బాక్సర్ వికాస్ క్రిషన్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ పోటీలో వికాస్ క్రిషన్(75కేజీ) సెమీస్ కు చేరి రియో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే రియోలో కూడా పతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ' నాకు రియోలో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. కనీసం కాంస్య పతకమైనా సాధిస్తా. రెండు బౌట్లు గెలిస్తే కాంస్య పతకం గెలిచే అవకాశ ఉంది. నా వరల్డ్ ర్యాంకింగ్‌ను బట్టి రియోలో డ్రా కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రెండు బౌట్లలో కఠినమైన ప్రత్యర్థులు ఎదురుపడకపోవచ్చు. ఇదే కేటగిరిలో గతంలో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కనీసం కాంస్య పతకాన్ని సాధిస్తానని నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయా. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోను. పతకం సాధించడానికి శతవిధిలా ప్రయత్నిస్తా' వికాస్ క్రిషన్ తెలిపాడు. తాను రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని తొలుత అనుకోలేదన్నాడు. వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలకు తీవ్రమైన ఒత్తిడిలో సన్నద్దమయ్యానని, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించానన్నాడు. దీంతో ఫలితాన్ని సాధించానన్నాడు. ఈ పోరులో మూడు బౌట్లను ఏకపక్షంగా గెలిచి సత్తాచాటడంతో తనపై నమ్మకం పెరిగిందన్నాడు. -
వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు
బాకు: వికాస్ క్రిషన్ (75కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ)లకు ఒలింపిక్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఐబా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు సెమీఫైనల్స్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించగా.. మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్కట్జోన్ (తజకిస్తాన్)పై నెగ్గాడు. ప్రస్తుతం భారత్ నుంచి ఈ ఇద్దరితో పాటు శివథాపా రియోకు అర్హత సాధించాడు. 75 కేజీల విభాగంలో వికాస్ అర్హత సాధిచినందున... ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్కు ఇక రియో అవకాశం లేదు. -
రేపు వికాస్-నిక్సన్‌ల ప్రొ బాక్సింగ్ బౌట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ), ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారత్ లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ బాక్సింగ్ పోరుకు రంగం సిద్ధమైంది. 75 కేజీల విభాగంలో శనివారం ఇక్కడ జరిగే భారత బాక్సర్ వికాస్ క్రిషన్తో కెన్యా బాక్సర్ నిక్సన్ అబాకా తలపడనున్నాడు. ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన వికాస్ రేపు జరిగే ఆరు రౌండ్ల బౌట్లో నిక్సన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇది తనకు ఒక గొప్పఅవకాశమని పేర్కొన్న వికాస్.. ఇందులో విజయం సాధించడమే తన ముందున్న లక్ష్యమని స్ప ష్టం చేశాడు. మరోవైపు ఏఐబీఏ ప్రొ బాక్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మిర్కో వూల్ఫ్ వికాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్న వికాస్ ఒక తెలివైన బాక్సర్ ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ద్వారా వికాస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాడన్నారు. -
ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఈనెల 11న ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్.... నిక్సన్ అబాకా (కెన్యా)తో తలపడనున్నాడు. ప్రపంచ మిలటరీ గేమ్స్‌లో కాంస్యం సాధించిన నిక్సన్ ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఆరు రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్లో పాల్గొనడం వల్ల... వచ్చే నెలలో వెనిజులాలో జరిగే ఒలింపిక్స్ ఫైనల్ క్వాలిఫయర్స్‌కు తనకు అర్హత లభిస్తుందని వికాస్ తెలిపాడు. మరోవైపు ఈ బౌట్ పూర్తయిన వెంటనే వికాస్‌తో పాటు మరో ఎనిమిది మంది భారత బాక్సర్లు రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల కోసం అజర్‌బైజాన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. -
క్వార్టర్స్‌లో వికాస్, శివ
దోహా: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. వికాస్ కృషణ్ (75 కేజీ), శివ తాపా (56 కేజీ)లు క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వికాస్ 2-1తో నాలుగోసీడ్ తోమస్ జబ్లనోస్కి (పోలెండ్)పై నెగ్గాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో ప్రత్యర్థి అటాకింగ్‌కు దిగినా వికాస్ అప్పర్ కట్స్, రైట్ హుక్స్‌తో సమర్థంగా నిలువరించాడు. మరో బౌట్లో శివ... ఆఫ్రికా చాంపియన్ మహ్మద్ హమోట్ (మొరాకో)ను ఓడించాడు. కేవలం 26 సెకన్లలోనే ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. రెండు, మూడో రౌండ్లలో శివ కొట్టిన లెఫ్ట్ హుక్‌లు బౌట్కే హైలెట్‌గా నిలిచాయి. నుదురుపై కొట్టిన పంచ్‌లకు హమోట్ దిమ్మతిరిగి పడిపోయాడు. దీంతో ఎనిమిది అంకెలు లెక్కపెట్టాక అత్యవసరంగా వైద్య బృందాన్ని పిలిపించి చికిత్స చేయించారు. -
ఓవర్ కాన్పిడెన్సే ముంచింది: వికాశ్ కృష్ణ
ఒవర్ కాన్సిడెన్స్ వల్లే ఫైనల్ మ్యాచ్ ఓడిపోయానని భారత్ బాక్సర్ వికాస్ కృష్ణ అన్నాడు. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ యువ బాక్సర్ .. ఉబ్జెకిస్తాన్ బాక్సర్ చేతిలో ఓడిపోవడానికి కారణాలు వివరించాడు. తన కెరీర్ లో అది టఫ్ బౌట్ అని చెప్పిన ఈ యూత్ ఒలింపిక్స్ ఛాంపియన్.. మ్యాచ్ గెలిచే సత్తా తనలో ఉందని గుర్తుచేసుకున్నాడు. ప్రత్యర్థి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశానని చెప్పాడు. ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఓటమి ఇప్పటికీ జీర్ణం కావడం లేదని వాపోయాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కావడం కాస్త ఉపశమనమని అన్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు పూర్తి స్ధాయిలో సంసిద్దం కావాలని వివరించాడు. దీని కోసం అమెరికాలో కానీ, బ్రిటన్ లో కానీ శిక్షణ కు వెళ్లనున్నట్లు తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో క్యూబా, రష్యా, కజకిస్తాన్ ల నుంచి గట్టి పోటీ ఉంటుందని చెప్పాడు. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన ఈ హర్యానా బాక్సర్ ఈ ఈవెంట్ లో నే రియో ఒలింపిక్స్ కి క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. -
రజతంతో సరిపెట్టుకున్న వికాస్ కృష్ణ
ఇక్కడ జరుగుతున్న ఆసియన్ ఛాంపియన్ షిప్ బాక్సిగ్ 75 కిలోల విభాగంలో ఇండియన్ బాక్సర్ వికాశ్ కృష్ణ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఉబ్జెకిస్తాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్ తో తలపడిన వికాశ్ 0-2తో పరాజయం పాలయ్యాడు. దీంతో ఈ టోర్నీలో ఒక రజంతం, మూడు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. అంతకు ముందు సెమీస్ కు క్వాలిఫై కావడంతో ఇండియన్ బాక్సర్స్ర్ దేవేంద్రో, శివ తప, సతీశ్ కుమార్ లతో పాటు వికాశ్ కూడా వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ కి క్వాలిఫై అయ్యారు. కాగా మన బాక్సర్ల ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని నేషనల్ కోచ్ గుర్ బక్ష్ సింగ్ సంధూ తెలిపారు. ఆరుగురు బాక్సర్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడం మామూలు విషయం కాదని వివరించాడు. వికాశ్ కృష్ణ ఫైనల్ మ్యాచ్ పై మాట్లాడుతూ.. రక్షణాత్మకంగా ఆడటం ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డారు. కాగా గత ఆసియన్ ఛాంపియన్ షిప్ తో పోల్చితే.. మెరుగైన ప్రదర్శన అని అన్నారు. -
వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు
ఇంచియాన్: ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు. దీంతో ఓవరాల్‌గా 5 పతకాల (1 స్వర్ణం+4 కాంస్యాలు)తో భారత్ బాక్సింగ్ ఈవెంట్‌ను ముగించింది. గ్వాంగ్జౌ క్రీడల్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో సత్తా చాటారు. పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) సెమీస్‌లో వికాస్ 1-2తో ప్రపంచ చాంపియన్ జానిబెక్ అల్మికన్లీ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్లో భారత్ బాక్సర్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థికి 9-10తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్లో మెరుపు దాడి చేస్తూ 10-9 స్కోరు సాధించాడు. మూడో రౌండ్లో కూడా ఇదే జోరు కనబర్చడంతో బౌట్ కజక్ బాక్సర్ సొంతమైంది. సూపర్ వెయిట్ (+91 కేజీలు) సెమీస్‌లో సతీశ్ 0-3తో ఇవాన్ డిచ్కో (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. డిచ్కో దూరం నుంచి విసిరిన బలమైన పంచ్‌లకు సతీశ్ వద్ద సమాధానం లేకపోయింది.