ఇక్కడ జరుగుతున్న ఆసియన్ ఛాంపియన్ షిప్ బాక్సిగ్ 75 కిలోల విభాగంలో ఇండియన్ బాక్సర్ వికాశ్ కృష్ణ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఉబ్జెకిస్తాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్ తో తలపడిన వికాశ్ 0-2తో పరాజయం పాలయ్యాడు. దీంతో ఈ టోర్నీలో ఒక రజంతం, మూడు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. అంతకు ముందు సెమీస్ కు క్వాలిఫై కావడంతో ఇండియన్ బాక్సర్స్ర్ దేవేంద్రో, శివ తప, సతీశ్ కుమార్ లతో పాటు వికాశ్ కూడా వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ కి క్వాలిఫై అయ్యారు.
కాగా మన బాక్సర్ల ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని నేషనల్ కోచ్ గుర్ బక్ష్ సింగ్ సంధూ తెలిపారు. ఆరుగురు బాక్సర్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడం మామూలు విషయం కాదని వివరించాడు. వికాశ్ కృష్ణ ఫైనల్ మ్యాచ్ పై మాట్లాడుతూ.. రక్షణాత్మకంగా ఆడటం ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డారు. కాగా గత ఆసియన్ ఛాంపియన్ షిప్ తో పోల్చితే.. మెరుగైన ప్రదర్శన అని అన్నారు.
రజతంతో సరిపెట్టుకున్న వికాస్ కృష్ణ
Published Sat, Sep 5 2015 6:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement