Bektemir Melikuziev
-
సారీ! నేను గెలువలేకపోయాను!
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ లో పతకాల బోణీ కొట్టాలన్న భారత్ ఆశ ఇప్పటికీ ఆశగానే మిగిలిపోయింది. భారీ ఆశలతో రియో అడుగుపెట్టిన భారత బాక్సర్లు పెట్టెబేడా సర్దుకొని ఇంటిముఖం పట్టారు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ క్వార్టర్ ఫైనల్ లో చతికిలపడ్డాడు. 75కిలోల మిడిలి వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమెర్ మెలికుజీవ్ చేతిలో 0-3 తేడాతో క్రిషన్ యాదవ్ చిత్తుగా ఓడిపోయాడు. మెలికుజీవ్ తో గెలిస్తే స్వర్ణపతకంతో భారత్ తో అడుగుపెడతానని అభిమానులకు క్రిషన్ యాదవ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి.. ఉట్టిచేతులతో స్వదేశానికి వస్తుండటంపై క్రిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పటికే భారత బాక్సర్లు శివ థాప (56 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు) ఇంటిముఖం పట్టడంతో బాక్సింగ్ లో భారత పోరు ముగిసిపోయింది. 'ఆగస్టు 15న భారత ప్రజలకు పతకాన్ని కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ కుదరలేదు' అని 24 ఏళ్ల హర్యానా బాక్సర్ క్రిషన్ యాదవ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ ఫెడరేషన్- అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య విభేదాల నేపథ్యంలో తమకు అంతర్జాతీయంగా తగిన శిక్షణ లభించలేదని అతను వాపోయాడు. 'మన బాక్సింగ్ ఫెడరేషన్ పై నిషేధం విధించారు. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మంచి బాక్సర్ల్ నేతృత్వంలో మేం శిక్షణ పొందలేకపోయాం. అయినా నేను ఎవరినీ నిందించడం లేదు. నా కారణంగానే నేను ఓడిపోయాను. పతకాన్ని గెలువలేకపోయాను క్షమించండి' అంటూ క్రిషన్ పేర్కొన్నాడు. -
రజతంతో సరిపెట్టుకున్న వికాస్ కృష్ణ
ఇక్కడ జరుగుతున్న ఆసియన్ ఛాంపియన్ షిప్ బాక్సిగ్ 75 కిలోల విభాగంలో ఇండియన్ బాక్సర్ వికాశ్ కృష్ణ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో ఉబ్జెకిస్తాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్ తో తలపడిన వికాశ్ 0-2తో పరాజయం పాలయ్యాడు. దీంతో ఈ టోర్నీలో ఒక రజంతం, మూడు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. అంతకు ముందు సెమీస్ కు క్వాలిఫై కావడంతో ఇండియన్ బాక్సర్స్ర్ దేవేంద్రో, శివ తప, సతీశ్ కుమార్ లతో పాటు వికాశ్ కూడా వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ కి క్వాలిఫై అయ్యారు. కాగా మన బాక్సర్ల ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని నేషనల్ కోచ్ గుర్ బక్ష్ సింగ్ సంధూ తెలిపారు. ఆరుగురు బాక్సర్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడం మామూలు విషయం కాదని వివరించాడు. వికాశ్ కృష్ణ ఫైనల్ మ్యాచ్ పై మాట్లాడుతూ.. రక్షణాత్మకంగా ఆడటం ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డారు. కాగా గత ఆసియన్ ఛాంపియన్ షిప్ తో పోల్చితే.. మెరుగైన ప్రదర్శన అని అన్నారు.