సారీ! నేను గెలువలేకపోయాను! | Boxer Vikas laments administrative logjam after Olympic loss | Sakshi
Sakshi News home page

సారీ! నేను గెలువలేకపోయాను!

Published Tue, Aug 16 2016 9:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

సారీ! నేను గెలువలేకపోయాను!

సారీ! నేను గెలువలేకపోయాను!

రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ లో పతకాల బోణీ కొట్టాలన్న భారత్ ఆశ ఇప్పటికీ ఆశగానే మిగిలిపోయింది. భారీ ఆశలతో రియో అడుగుపెట్టిన భారత బాక్సర్లు పెట్టెబేడా సర్దుకొని ఇంటిముఖం పట్టారు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ క్వార్టర్ ఫైనల్ లో చతికిలపడ్డాడు. 75కిలోల మిడిలి వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమెర్ మెలికుజీవ్ చేతిలో 0-3 తేడాతో క్రిషన్ యాదవ్ చిత్తుగా ఓడిపోయాడు.

మెలికుజీవ్ తో గెలిస్తే స్వర్ణపతకంతో భారత్ తో అడుగుపెడతానని అభిమానులకు క్రిషన్ యాదవ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి.. ఉట్టిచేతులతో స్వదేశానికి వస్తుండటంపై క్రిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పటికే భారత బాక్సర్లు శివ థాప (56 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు) ఇంటిముఖం పట్టడంతో బాక్సింగ్ లో భారత పోరు ముగిసిపోయింది.

'ఆగస్టు 15న భారత ప్రజలకు పతకాన్ని కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ కుదరలేదు' అని 24 ఏళ్ల హర్యానా బాక్సర్ క్రిషన్ యాదవ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ ఫెడరేషన్- అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య విభేదాల నేపథ్యంలో తమకు అంతర్జాతీయంగా తగిన శిక్షణ లభించలేదని  అతను వాపోయాడు. 'మన బాక్సింగ్ ఫెడరేషన్ పై నిషేధం విధించారు. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మంచి బాక్సర్ల్ నేతృత్వంలో మేం శిక్షణ పొందలేకపోయాం. అయినా నేను ఎవరినీ నిందించడం లేదు. నా కారణంగానే నేను ఓడిపోయాను. పతకాన్ని గెలువలేకపోయాను క్షమించండి' అంటూ క్రిషన్ పేర్కొన్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement