ఒవర్ కాన్సిడెన్స్ వల్లే ఫైనల్ మ్యాచ్ ఓడిపోయానని భారత్ బాక్సర్ వికాస్ కృష్ణ అన్నాడు. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ యువ బాక్సర్ .. ఉబ్జెకిస్తాన్ బాక్సర్ చేతిలో ఓడిపోవడానికి కారణాలు వివరించాడు. తన కెరీర్ లో అది టఫ్ బౌట్ అని చెప్పిన ఈ యూత్ ఒలింపిక్స్ ఛాంపియన్.. మ్యాచ్ గెలిచే సత్తా తనలో ఉందని గుర్తుచేసుకున్నాడు. ప్రత్యర్థి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశానని చెప్పాడు. ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఓటమి ఇప్పటికీ జీర్ణం కావడం లేదని వాపోయాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కావడం కాస్త ఉపశమనమని అన్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు పూర్తి స్ధాయిలో సంసిద్దం కావాలని వివరించాడు. దీని కోసం అమెరికాలో కానీ, బ్రిటన్ లో కానీ శిక్షణ కు వెళ్లనున్నట్లు తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో క్యూబా, రష్యా, కజకిస్తాన్ ల నుంచి గట్టి పోటీ ఉంటుందని చెప్పాడు. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన ఈ హర్యానా బాక్సర్ ఈ ఈవెంట్ లో నే రియో ఒలింపిక్స్ కి క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.
ఓవర్ కాన్పిడెన్సే ముంచింది: వికాశ్ కృష్ణ
Published Mon, Sep 7 2015 6:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement