రేపు వికాస్-నిక్సన్ల ప్రొ బాక్సింగ్ బౌట్ | Vikas Krishan Takes on Nickson Abaka in AIBA Pro Boxing on Saturday | Sakshi
Sakshi News home page

రేపు వికాస్-నిక్సన్ల ప్రొ బాక్సింగ్ బౌట్

Published Fri, Jun 10 2016 7:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Vikas Krishan Takes on Nickson Abaka in AIBA Pro Boxing on Saturday

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ), ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా  సంయుక్తంగా  భారత్ లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ బాక్సింగ్ పోరుకు రంగం సిద్ధమైంది. 75 కేజీల విభాగంలో శనివారం ఇక్కడ జరిగే  భారత బాక్సర్ వికాస్ క్రిషన్తో  కెన్యా బాక్సర్ నిక్సన్ అబాకా తలపడనున్నాడు. ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన వికాస్ రేపు జరిగే ఆరు రౌండ్ల బౌట్లో నిక్సన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

 

ఇది తనకు ఒక గొప్పఅవకాశమని పేర్కొన్న వికాస్.. ఇందులో విజయం సాధించడమే తన ముందున్న లక్ష్యమని స్ప ష్టం చేశాడు. మరోవైపు ఏఐబీఏ ప్రొ బాక్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మిర్కో వూల్ఫ్ వికాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్న వికాస్ ఒక తెలివైన బాక్సర్ ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ద్వారా వికాస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లకు అర్హత సాధిస్తాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement