న్యూయార్క్: భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. శనివారం అతను అమెరికాకు చెందిన నోవా కిడ్‌తో ఆడతాడు. అమెరికాలోని విఖ్యాత ‘మాడిసన్ స్క్వేర్ గార్డెన్’లో ఈ బౌట్ జరుగనుండటం విశేషం. ప్రొ కెరీర్‌లో అజేయంగా దూసుకెళుతున్న విజేందర్ సింగ్‌కు కూడా ఈ వేదికపై పోటీపడే అవకాశం రాలేదు. కానీ రెండో బౌట్ లోనే వికాస్‌కు చక్కటి అవకాశం దక్కింది. ఈ ఏడాదే ప్రొ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన వికాస్ జనవరిలో జరిగిన తొలిపోరులో స్టీవెన్ అండ్రడేను ఓడించాడు. వికాస్ గతేడాది జరిగిన ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment