ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్ | Pro boxing bout in the ring, Indian boxer Vikas | Sakshi
Sakshi News home page

ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్

Published Mon, Jun 6 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్

ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్

న్యూఢిల్లీ:  భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఈనెల 11న  ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్.... నిక్సన్ అబాకా (కెన్యా)తో తలపడనున్నాడు. ప్రపంచ మిలటరీ గేమ్స్‌లో కాంస్యం సాధించిన నిక్సన్ ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్నాడు.

ఆరు రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్‌లో పాల్గొనడం వల్ల... వచ్చే నెలలో వెనిజులాలో జరిగే ఒలింపిక్స్ ఫైనల్ క్వాలిఫయర్స్‌కు తనకు అర్హత లభిస్తుందని వికాస్ తెలిపాడు. మరోవైపు ఈ బౌట్ పూర్తయిన వెంటనే వికాస్‌తో పాటు మరో ఎనిమిది మంది భారత బాక్సర్లు రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల కోసం అజర్‌బైజాన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement