
వరల్డ్ సిరీస్ బాక్సింగ్ టోర్నీలో మనోజ్ కుమార్
భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ (డబ్ల్యూఎస్‌బీ) టోర్నమెంట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. జూన్ 8న లండన్‌లో అస్తానా అర్లాన్స్ (కజకిస్తాన్)తో జరిగే సెమీఫైనల్ బౌట్‌లో ఈ హరియాణా బాక్సర్ బ్రిటిష్ లయన్‌హార్ట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 69 కేజీల విభాగంలో పోటీపడనున్న మనోజ్ ఈ నెలలో ఆసియా చాంపియన్‌షిప్‌లో టాప్–6లో నిలిచి ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన వికాస్ కృషన్ (75 కేజీలు), కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) కూడా బ్రిటిష్ లయన్‌హార్ట్స్ జట్టు తరఫున ఆడాల్సి ఉన్నా... వేర్వేరు కారణాల వల్ల ఈ ఇద్దరు వైదొలిగారు.