
న్యూయార్క్ : స్క్రాచ్ ఆఫ్ గేమ్స్‌లో భారత దేశానికి చెందిన 37 ఏళ్ల సతీష్ కుమార్ పటేల్‌ను అదృష్టం వరించింది. న్యూయార్క్‌లోని మాన్‌హస్సెట్ హిల్స్‌లో నివాసం ఉంటున్న సతీష్ ఏకంగా 5మిలియన్ డాలర్లు( దాదాపు 35 కోట్ల రూపాయలు) నగదు బహుమతిని లాటరీలో గెలుపొందారు.
'మొదట ఎంత గెలుపొందానో సరిగా అర్థం కాలేదు. ముందు 5 లక్షల డాలర్లను గెలిచాననుకున్నా, కానీ మరుసటి రోజు అర్థమైంది, నేను గెలుచుకున్నది 5 మిలియన్ల డాలర్లు అని. నా పిల్లల కాలేజీ ఫీజుకి, నా తండ్రికి కొత్త కారు కొనడానికి ఈ డబ్బును వాడాలనుకుంటున్నాను' అని సతీష్ కుమార్ తెలిపారు. ఫ్లషింగ్‌లోని మెయిన్ స్ట్రీట్‌లోని ఎస్‌హెచ్ స్టేషనరీలో సతీష్ ఈ టికెట్ కొనుగోలు చేశారని ఎన్‌వై లాటరీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment