వేంపల్లె: శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి అనుచరుడు వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి కేసులో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ చాంద్‌బాషా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్‌రెడ్డి, అజ్జుగట్టు రవితేజారెడ్డిలను అసభ్య పదజాలంతో తిట్టడం, సోషల్ మీడియాలో అవహేళన చేశారనే కోపంతో అజయ్‌కుమార్‌రెడ్డిని చంపాలని నిందితులు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. అజయ్‌కుమార్‌రెడ్డి సోదరుడు మౌనీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.
ఈ కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందుల శివారు శిల్పారామం వద్ద గండూరు హిదయతుల్లా, కొండాపురం మండలం డోంకుపల్లి గ్రామానికి చెందిన పందిర్ల శివకుమార్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్, వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామిరెడ్డి ధరణీశ్వరరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. పులివెందుల రోడ్డులోని స్కూల్ సమీపంలో అజయ్‌కుమార్‌రెడ్డిని హాకీ స్టిక్స్, బండరాళ్లతో కొట్టి గాయపరిచామని నిందితులు చెప్పినట్టు సీఐ తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment