ajay kumar
-
Nizamabad: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్?
ఖలీల్‌వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్‌పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక పోలీసు బృందం హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
వేంపల్లె: శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అనుచరుడు వేంపల్లె అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి కేసులో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ చాంద్‌బాషా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్‌రెడ్డి, అజ్జుగట్టు రవితేజారెడ్డిలను అసభ్య పదజాలంతో తిట్టడం, సోషల్ మీడియాలో అవహేళన చేశారనే కోపంతో అజయ్‌కుమార్‌రెడ్డిని చంపాలని నిందితులు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. అజయ్‌కుమార్‌రెడ్డి సోదరుడు మౌనీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.ఈ కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందుల శివారు శిల్పారామం వద్ద గండూరు హిదయతుల్లా, కొండాపురం మండలం డోంకుపల్లి గ్రామానికి చెందిన పందిర్ల శివకుమార్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్, వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామిరెడ్డి ధరణీశ్వరరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. పులివెందుల రోడ్డులోని స్కూల్ సమీపంలో అజయ్‌కుమార్‌రెడ్డిని హాకీ స్టిక్స్, బండరాళ్లతో కొట్టి గాయపరిచామని నిందితులు చెప్పినట్టు సీఐ తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
YSRCP నేత తల పగలగొట్టిన టీడీపీ గూండాలు
-
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్‌స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్‌లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
మళ్లీ సారు రారు.. కారు రాదు
సాక్షి, హైదరాబాద్: సారు(కేసీఆర్).. కారు(బీఆర్ఎస్).. మళ్లీ రారు.. రావని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కారును పోలీ సోళ్లు కూడా ఉండనివ్వడం లేదని, కాంగ్రెస్ ప్రచా రం కోసం గాం«దీభవన్‌లో అద్దె కార్లు తెచ్చి పెట్టుకుంటే పోలీసులు తీసుకెళ్లిపోయారని ఆయన ఎద్దే వా చేశారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ పరిశీలకుడు అంశు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కౌశిక్ చరణ్యాదవ్తో కలిసి అజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైద్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీ లకు అవసరమైన రక్తం కూడా దొరకడం లేదని, మెజార్టీ ప్రజలకు పౌష్టికాహారం దూరమైందని, 70 శాతం మంది పిల్లలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదని చెప్పారు. కేసీఆర్ పాలనపై విసిగిపోయిన ప్రజలు ఈసారి బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలని నిర్ణయించారనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ గత తొమ్మిదిన్నరేళ్లుగా వైద్య, ఆరోగ్య రంగాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మీడియా సమావేశంలో భాగంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై వీడియోను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. -
చట్టాల్లో మార్పులు అవసరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఖైదీలను దండించడానికే రూపొందించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. విశాఖలో సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు జరిగే అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సుకు సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలో జైళ్ల సామర్థ్యం కంటే 25 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్టు చెప్పారు. అందులో 80 శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలేనని వెల్లడించారు. పూర్వకాలం నాటి చట్టాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందన్నారు. జైళ్లు దండించడానికి కాదని, ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిషర్ల ఆలోచనా ధోరణితో రూపుదిద్దుకున్న చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు నుంచి విచారణ వరకు అన్నీ వేగవంతంగా జరిగేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. కొత్త బిల్లుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో చేపట్టిన జైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,100 జైళ్లలో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు. కేంద్ర కారాగారాల్లో నైపుణ్య కేంద్రాలు సదస్సుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జైలు అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాలు జైలు అభివృద్ధి నిధి ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. ఆ నిధి ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కేంద్ర కారాగారాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గర్భిణి ఖైదీలకు, వారి పిల్లలకు, వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. సదస్సులో బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ్, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. -
పర్యావరణ హితం, సౌకర్యవంతం.. ఈ–గరుడ ఎలక్ట్రిక్ వాహనాల ముఖ్య ఉద్దేశం ఇదే
మియాపూర్: కాలుష్య నివారణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే ఈ– గరుడ ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ– గరుడ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ.. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని బస్టాప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం కోసం ఎలక్ట్రికల్ వాహనాలను టీఎస్ఆర్టీసీ విస్తరిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 1300 బస్సులు హైదరాబాద్ సీటీలో, 550 సదూర ప్రాంతాలలో నడుపుతామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలకు సంబంధించిన యూనిట్లకు అమర్‌రాజా సంస్థతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో శంఖుస్థాపన చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించామని, అందులో ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించామని, విడతల వారీగా మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు వాహనాలను తట్టుకోవడం ఆర్టీసీకి కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ వాహనాలను తట్టుకోవడం ప్రైవేటుకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆర్టీసీ నడుస్తోందని తెలిపారు. కొత్త కారులలో ఉండే ఆధునిక సదుపాయాలు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగిందని, నియంత్రించేదుకు బస్సు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్రం చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా నిధుల విడుదలకు సంబంధించి ఇది స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రానికి మంజూరు అయిన బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు నిధుల విడుదలలో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సమాచార హక్కు చట్టం కింద ఇనగంటి రవికుమార్ అనే యాక్టివిస్టు సమాచారం కోరగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి అజయ్‌కుమార్ లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. 2024లో బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి కావాల్సి ఉన్నా.. దీనికి ఇప్పటి వరకు కేవలం 8.75 శాతం మాత్రమే నిధులు విడుదల చేశారు. కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ సంవత్సరాల్లో మొత్తం 16 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ 16 ఎయిమ్స్‌లలో బిహార్‌లోని దర్బంగా, హరియాణాలోని మనేథిలలో ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదు. అలాగే తమిళనాడులోని మదురైలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తిగా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)నిధులతో చేపట్టాలని నిర్ణయించడం వల్ల ఆ నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో విడుదల కాని పరిస్థితి నెలకొంది. నిమ్స్ భవనాలను ఇచ్చినా.. బీబీనగర్‌లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విస్తరణ కోసం నిర్మాణం చేసిన భవనాలను ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. అయితే ఇక్కడ మరిన్ని భవనాల నిర్మాణంతోపాటు, జాతీయ స్థాయిలో పేరున్న విజ్ఞాన సంస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేస్తుండడం గమనార్హం. 2018 సంవత్సరంలో నాలుగు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నాలుగు ఎయిమ్స్‌లలో బీబీనగర్ (తెలంగాణ), మధురై (తమిళనాడు), బిలాస్పూర్ (హిమాచల్‌ప్రదేశ్), దేవఘర్ (జార్ఖండ్) ఉన్నాయి. అయితే బిలాస్పూర్ ఎయిమ్స్‌కు రూ.1,471 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1407.93 కోట్లు విడుదల చేయడంతో నిర్మాణం దాదాపు 98 శాతం పూర్తయింది. అలాగే దేవఘర్ ఎయిమ్స్‌కు రూ.1,103 కోట్లు కేటాయించగా.. రూ.713 కోట్లు విడుదల చేసింది. అదే బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్లు కేటాయించగా రూ. 156.01 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 16 ఎయిమ్స్‌లలో ఏడు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో వైద్య కళాశాల, ఆస్పత్రి, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరికరాలు అన్నీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. బీబీనగర్ ఎయిమ్స్ మొదట రూ.1,028 కోట్లు మంజూరు చేసి, 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని భావించారు. కానీ నిధులు కేటాయింపులో జాప్యంతో దీనిని 2024 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అంచనా వ్యయం కూడా రూ.1,365 కోట్లకు చేరింది. కాగా, ఇప్పటికే నిమ్స్‌కోసం నిర్మించిన భవనాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఔట్‌పేషంట్ సేవలు మాత్రం అక్కడ కొనసాగుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్లో వంద ఎకరాల స్థలంతోపాటు, నిమ్స్ భవనాలను కేంద్రానికి అప్పగించింది. అయినా ఇక్కడ ఎయిమ్స్ అభివృద్ధిలో పురోగతి లేదని విమర్శలు వస్తున్నాయి. -
ప్రసూతి మరణాలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అసలేం జరిగిందంటే ... నాగర్ కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమ పల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని (24) మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం కిందట సిజేరియన్ చేయించుకున్నారు. అనంతరం వారి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13వ తేదీన మరణించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమన్న వాదనలు వినిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఇన్ఫెక్షనే కారణమని తేలినట్లు సమాచారం. ఇందుకు ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. కాగా, ఈ ఘటనలకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో వారికి డయాలసిస్ చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరిని డిశ్చార్జి కూడా చేశామని చెబుతున్నారు. అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడారా? బాలింతలకు అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడటం వల్లే ఇన్ఫెక్షన్కు దారితీసిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్ చేయడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించిన తర్వాత కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇబ్రహీంపట్నం మరణాల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందనడానికి మలక్‌పేట సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని స్పెషలిస్ట్ డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారికి జోనల్ కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కేటాయింపు పూర్తయ్యాక కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది డాక్టర్లు ఒకేచోట పనిచేస్తున్నారు. వారిలో అనేకమందిని అవసరం ఉన్నచోటకు బదిలీ చేసేందుకుగాను డాక్టర్ల రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత నర్సులు, పారామెడికల్, క్లర్క్‌లకు కూడా జోనల్ కేటాయింపు చేసి బదిలీలు చేస్తారు. 600 మంది డాక్టర్లు... 2 వేలకుపైగా నర్సులు రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ఇప్పటికే బదిలీలు జరిగిన విషయం విదితమే. ఏడు జోన్ల పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి పెద్దఎత్తున జోనల్ కేటాయింపులు, బదిలీలు జరిగాయి. అప్పుడు జోనల్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అనేకమంది ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో వారంతా ఎక్కడికక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో జోనల్ కేటాయింపులు, అనంతరం బదిలీలు జరగనున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 600కుపైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతరులు స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు 2 వేలకుపైగా నర్సులు, 500కుపైగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ముందుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్‌లోని డాక్టర్లు, ఆ తర్వాత నర్సులు, ఇతర ఉద్యోగులకు జోనల్ కేటాయింపులు జరిపి బదిలీలు చేస్తారు. జోనల్ కేటాయింపులు కఠినంగా కాకుండా, ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే చేపడతారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా జోనల్ మార్పులు జరిగాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. చేనేతపై జీఎస్టీ రద్దుచేయాలి కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: చేనేతపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో భాగంగా ఎర్రబెల్లి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేనేతను ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీతో వారి నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. -
హకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవం (ఫోటోలు)
-
6న ఎస్కేఎం తదుపరి భేటీ
లఖీంపూర్‌ఖేరి: కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్‌ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళన అధికారుల హామీతో శనివారం ముగిసింది. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఢిల్లీలో భేటీ అవుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం లఖీంపూర్‌ఖేరిలో రాజాపూర్ మండి సమితి వద్ద రైతు ధర్నా ప్రాంతానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్‌కు రైతులు డిమాండ్లను వివరించారు. ఈ డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని మేజిస్ట్రేట్ వారికి హామీ ఇచ్చారు. దీంతో, 75 గంటలుగా కొనసాగుతున్నఅంతకుముందు రైతులు తలపెట్టిన ర్యాలీని కూడా అధికారుల హామీతో విరమించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లఖీంపూర్‌ఖేరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మృతికి మంత్రి కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
దశలవారీగా డిజిటల్ కరెన్సీ అమలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) హోల్‌సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సీబీడీసీని ప్రవేశపెడుతున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక బిల్లు 2022 ఆమోదంతో ఆర్బీఐ చట్టం-1934లోని సంబంధిత సెక్షన్‌కు అవసరమైన సవరణలు చేసినట్టు ఆర్బీఐ ఫిన్‌టెక్ ఈడీ అజయ్ కుమార్ చౌదరి ఫిక్కీ సదస్సులో బుధవారం తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించి, డిజిటల్ కరెన్సీని జారీ చేసేందుకు ఆర్బీఐకి వీలు కల్పించిందని ఆయన చెప్పారు. డిజిటల్/వర్చువల్ కరెన్సీ అయిన సీబీడీసీ 2023 ప్రారంభంలో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీలతో ఇది పోల్చదగినది కాదు. ఈ ఏడాది 323 బ్యాంక్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అజయ్ వెల్లడించారు. నెలవారీ లావాదేవీలు 590 కోట్లకు చేరుకున్నాయని, వీటి విలువ రూ.10,40,000 కోట్లు అని వివరించారు. -
విద్యార్థుల చెంతకే సర్టిఫికెట్లు
ఖమ్మం అర్బన్: విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా గురువారం జిల్లాలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, రఘునాథపాలెంలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడకు వెళ్లకుండా సర్టిఫికెట్లను వారి చేతికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థుల జాబితాను హెచ్ఎంలు తహసీల్దార్లకు అందిస్తే సర్టిఫికెట్లు జారీ చేస్తారని చెప్పారు. ఒకేరోజు 6 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్డీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాల ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతులపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడిచేయడంతో డ్రైవర్ గాయపడ్డాడని తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చదవండి: రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు ఆదివారం బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తగిన కృషి చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులతో విభజన అంశాలకు సంబంధించిన సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న వివిధ విభజన అంశాలను అజయ్ భల్లా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు(సివిల్), ఎస్పీలు(నాన్ కేడర్), షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చించారు. అలాగే విభజన చట్టంలోని సెక్షన్లు 50, 51, 56 ప్రకారం ట్యాక్సేషన్ ప్రావిజన్స్ కల్పించడం, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఏపీ జెన్కోకు బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో అజయ్ భల్లా సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం తన వంతు తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. షీలా బిడే కమిటీ సిఫార్సులను గౌరవించాలి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ సిఫార్సుల ప్రకారం విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజన జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్కో ద్వారా తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.7 వేల కోట్ల వరకు తెలంగాణ ఇవ్వాల్సి ఉందని హోం శాఖ కార్యదర్శి దృష్టికి సీఎస్ తీసుకెళ్లారు. అజయ్ భల్లా స్పందిస్తూ ఏపీ, తెలంగాణ అధికారులు చర్చించుకొని.. ఒక పరిష్కారానికి రావాలని సూచించారు. ఇందుకు సీఎస్ అంగీకరించి.. ఈ సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్ట సమయం పెట్టాలని కోరారు. సమావేశంలో ఏపీ ఉన్నతాధికారులు రజత్ భార్గవ, అనంతరాము, ఎస్ఎస్ రావత్, ప్రేమచంద్రారెడ్డి, అనురాధ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఔదార్యం
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్‌రెడ్డి దంపతులకు అజయ్‌కుమార్‌రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్‌రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్‌రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..) ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్‌కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు..
సాక్షి, విజయవాడ : దేశంలో ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రైతుల బాధలను చూసే వైఎస్సార్ ఉచిత విద్యుత్, జలయజ్ఞం చేపట్టారన్నారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి చేపట్టిన సంస్కరణలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. విద్యుత్ సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచారని, ఫీడర్ల సమస్యకు వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద రూ.7,171 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం వదిలేసిన విద్యుత్ బకాయిల్లో రూ. 14,023 కోట్లు చెల్లించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12శాతం అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉందని ఆయన పేర్కొన్నారు. (పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి డాక్టర్' వైఎస్సార్') కేంద్రం డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్టును రాష్ట్రాలకు అందజేసిందని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే రాష్ట్రాలు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం చట్టం చేయబోతోందని అజేయ కల్లం వెల్లడించారు. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకోవాలంటే కొన్ని సంస్కరణలు చేపట్టాలని కేంద్రం నిబంధన పెట్టిందన్నారు. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి దమ్ముండాలని, తమ లాంటి వారందరం ఇది అమలు కష్టమని చెప్పినట్లు తెలిపారు. కానీ సీఎం జగన్ దీనిని ఓ ఛాలెంజీగా తీసుకున్నారన్నారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కరెంట్ సబ్సిడీ నిమిత్తం రూ. 17,904 కోట్లు ఖర్చు పెట్టామని, గత ప్రభుత్వం వీటిల్లో సగం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రూ. 7130 కోట్లు ఫీడర్ల ఆధునికీకరణ కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించిన అజయ్ కల్లం గత ప్రభుత్వ బాకీలను తీరుస్తూ.. విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తూ వస్తున్నామన్నారు. (‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’) ‘1994-2004 మధ్య తీవ్ర వర్షాభావ పరిస్థితిలు ఉండేవి. 1997-98 ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉచితంగానే చేస్తాం. ఉచిత విద్యుత్ అనేది యధావిధిగా అమలు అవుతుంది. సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం. రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు. ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలో రైతులకు అందచేస్తున్న తొలి సీఎం జగనే కావడం గర్వకారణం. ఇది రైతుల మంచి కోసం చేసిన నిర్ణయమే. ఇప్పుడు మీటర్లు పెట్టి భవిష్యత్తులో ఏదో చేస్తామనే ఆందోళన అనవసరం. చెప్పిందొక్కటి.. చేసేదొకటి ఎవరో.. రైతులపై కాల్పులు జరిపేది ఎవరో అందరికీ తెలుసు. వ్యవసాయ కనెక్షన్ల పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తే అది బయటపడుతోంది.రైతు ఖాతాల నుంచి ఆటో డెబిట్ పద్దతిన డిస్కంలకు చెల్లింపులు జరుగుతాయి. రైతు ఎక్కడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఇది ఎవర్నీ మోసం చేయడానికి కాదు. రైతులకు ఒక్క రూపాయి అదనపు భారం కాదు.’ అని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. (చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం) -
అమ్మా డాడీని లెమ్మను..
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ‘అమ్మా.. డాడీని లెమ్మను.. నేనేమి తప్పుచేశానని నన్ను వదిలిపెట్టి పోయాడంటూ తహసీల్దార్ సుజాత కుమారుడు భరత్ రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎంత ఓదార్చినా భరత్ ఊరుకోకుండా డాడీ లే.. అంటూ రోదిస్తూనే ఉన్నాడు. మా డాడీకి ఫోన్ చేసింది ఎవరు..? బెదిరించింది ఎవరు...? అతనికి కూడా శిక్ష పడాలంటూ భరత్ అన్న మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. వివరాల్లోకి వెళితే.... అవినీతి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్ అంత్యక్రియలు గురువారం అంబర్‌పేట స్మశానవాటికలో ముగిశాయి. అజయ్‌కుమార్ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని లలిత మ్యాన్షన్ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహానికి అదే రోజు సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మార్చురీలో భద్రపరిచారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని చిక్కడపల్లిలోని ఆయన సోదరి గోక మంగళ నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చూసిన తహసీల్దార్ సుజాత, కుమారుడు భరత్‌ల రోధన పలువురికి కంటతడి పెట్టించింది. నాయకులు, అధికారుల నివాళి.. అజయ్ కుమార్ భౌతికకాయాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి నివాళులు అర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే,కె. లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు ‡ విజయలక్ష్మీ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లక్ష్మీనారాయణ, థామస్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళతో పాటు పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సుజాత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
రక్షణశాఖలో కరోనా కలకలం
ఢిల్లీ : భారత రక్షణ శాఖలో కరోనా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. ఆయన పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్.. రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారనన్న దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో మొత్తం కార్యాలయాలను శుభ్రం చేయించి ఉద్యోగులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. (గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..) ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 8వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. లాక్డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పక్షం రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచంలోనే కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో ప్రస్తుతం మన దేశం 7వ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అతి త్వరలోనే భారత్ అమెరికా సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ) -
హైదరాబాద్ డాక్టర్ ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వేధింపులు భరించలేక ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు నలుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆస్పత్రిలోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అజయ్ రాసిన లేఖలో తుర్కయాంజల్‌కు చెందిన కాంగ్రెస్ నేత శివకుమార్, ఆస్పత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, ఓనర్ బావమరిది కొండల్ రెడ్డి, సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరంతా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అజయ్ లేఖలో పేర్కొన్నారు. -
అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చాలినన్ని బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై దృష్టి పెడుతున్నామని ఆయన వెల్లడించారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో కలిసి ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజినల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నామని, కొన్ని చోట్ల టికెట్ ధర కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అధిక వసూళ్లు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి బస్సులో ఆయా రూట్లలో ఉండే చార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమిస్తున్నట్లు తెలిపారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామని, ఆర్టీసీ బస్సుల్లో బస్‌పాస్‌లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్ పాసులన్నీ అనుమతించాలని, దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రావద్దని మంత్రి స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్నీ పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 5,049 బస్సులు తిప్పామని మంత్రి అజయ్ వెల్లడించారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 3,116, ఆర్టీసీ అద్దె బస్సులు 1,933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయని చెప్పారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టి మరిన్ని వాహనాలను నడుపుతామని తెలిపారు. వీటితోపాటు మరో 6 వేల ప్రైవేటు వాహనాలను నడుపుతున్నట్లు చెప్పారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచామని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం కార్మికుల సంఖ్య: 50,000 విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిన వారి సంఖ్య: 10,000 సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన వారి సంఖ్య: 48,500 ఆర్టీసీ ద్వారా నడపాలని నిర్ణయించిన బస్సులు:10,000 ఇందులో పూర్తిగా ప్రభుత్వమే నడిపేవి: 5,000 వీటి కోసం కావాల్సిన పూర్తి సిబ్బంది సంఖ్య(అంచనా): 28,000 -
రూ.వేయి కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా కాలం గడిచిపోయినందున, సత్వరం బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని కోరింది. బస్‌పాస్‌ల రాయితీకి సంబంధించి రీయింబర్స్‌మెంటు కోసం రూ.600 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించి రూ.200 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.150 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.525 కోట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లు మించి అదనంగా విడుదల చేయలేదని సమాచారం. గడచిన రెండు నెలలుగా వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ప్రభుత్వం బకాయిపడ్డ బస్‌పాస్ రాయితీ రీయింబర్స్‌మెంటు నిధుల నుంచి రూ.200 కోట్లు విడుదల చేసింది. గతేడాది సాధారణ బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయించినా, మొత్తం నిధులు మాత్రం ఆర్టీసీకి అందలేదు. ఈసారి ప్రకటించిన నిధులతోపాటు పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరింది. కొత్త మంత్రికి కొత్త ఛాంబర్.. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేయటంతో మంత్రులకు వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా శాఖను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎ న్సీ కార్యాలయంలో ఛాంబర్ ఇచ్చారు. తాజా విస్తరణలో రవాణా శాఖను అజయ్‌కుమార్‌కు కేటాయించటంతో రవాణా శాఖ కార్యాలయంతోపాటు బస్‌భవన్‌లో కొత్త ఛాంబర్ ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. -
మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగర మేయర్ పాపాలాల్‌కు సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే తిరుగుబాటు ఎదురైంది. పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌తో కార్పొరేటర్ల అంతా భేటీ అయ్యారు. మొత్తం 42 మందికి గాను 37 మంది సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఎమ్మెల్యేకి అందించారు. ఈ సందర్భంగా అజయ్ వద్ద కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాపాలాల్ తమ డివిజన్ పర్యటనకు వచ్చిన తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని వాపోయారు. దీనికి స్పందించిన అజయ్‌కుమార్.. తాజా పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పార్టీకి నష్టం చేసే ఎలాంటి చర్యలను కూడా సమర్థించమని స్పష్టం చేశారు. నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్ వ్యవహారాలపై, మేయర్ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వెసులుబాటు కలిగిందని, అవిశ్వాస తీర్మానం చేయాల్సిన పరిస్థితిని డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు వివరించారు. -
‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని, వైఎస్సార్సీపీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి అజయ్ కుమార్ అన్నారు. ప్రజారాంజకమైన 12 బిల్లులను ప్రవేశపెట్టే క్రమంలో కొందరు రాజకీయంగా, సామాజికంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్ జగన్ చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. మాదిగలను విమర్శించడం గాని, వ్యతిరేకించడం గాని సీఎం చేయలేదని అజయ్ గుర్తుచేశారు. తన వ్యక్తిగత ఎజెండా కోసమే మందకృష్ణ మాదిగ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మందకృష్ణ మాటలను వినే మాదిగలు రాష్ట్రంలో ఎవరు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎస్సీలకు మంత్రి పదవులు, ఒకరికి ఎంపీ పదవి ఇచ్చి గౌరవించిన ఘనత వైఎస్ జగన్‌కే చెందుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, రాష్ట్రంలో చిచ్చుపెట్టడానికే మందకృష్ణ అసెంబ్లీ ముట్టడి అంటున్నారని విమర్శించారు. నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు, వర్గీకరణ కోసం ఎందుకు ప్రయత్నించలేదని ఆయన ప్రశ్నించారు. -
ముగిసిన ఎన్నికల కోడ్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుకు తెరపడటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకి తొలగింది. మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు 79 రోజుల పాటు కోడ్ అమల్లోకి ఉండటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడింది. -
చెవి కత్తిరించిన రౌడీ షీటర్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ప్రేమను నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్షతో ఎయిర్‌హోస్టెస్ చెవి కత్తిరించిన రౌడీషీటర్‌ను యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న అజయ్ కుమార్ అలియాస్ జాకీని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (ప్రేమించలేదని ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు) మొదట చైన్ దోపిడీ గత నెలలో ఎయిర్‌హోస్టెస్, కుటుంబసభ్యులు యశవంతపుర పరిధిలో కారులో వెళుతుండగా రౌడీషీటర్ అజయ్‌కుమార్ అలియాస్ జాకీ అడ్డుకుని బెదిరించి దాడి చేశాడు. బంగారు చైన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనపై భాదితులు యశవంతపుర పోలీస్‌స్టేషన్‌లో అజయ్‌కుమార్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఈ నెల 12 తేదీ సాయంత్రం 4.30 సమయంలో ఎయిర్‌హోస్టెస్ విధులు ముగించుకుని ఇంటికి క్యాబ్‌లో బయలుదేరింది. హెబ్బాల లైప్ ఓవర్ సిగ్నల్ వద్ద క్యాబ్ నిలపడంతో పొంచి ఉన్న అజయ్‌కుమార్ లోనికి చొరబడి తనను ప్రేమించాలంటూ ఆమెతో గొడవకు దిగాడు. కత్తితో ఆమె చెవిని కట్ చేసి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కొడిగేహల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టి దుండగున్ని పట్టుకున్నారు. ప్రస్తుతం యశవంతపుర పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు బాధిత ఎయిర్‌హోస్టెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఆ ప్రమాదం మా కుటుంబానికి ఓ పీడకల: ఎమ్మెల్యే
‘గుబాళిస్తున్న నా రాజకీయ జీవితం వెనుక గుబులెత్తించే వెతలెన్నో. కుటుంబ విషయాలపై సమష్టిగా చర్చించడం.. అంతిమ నిర్ణయాన్ని నాన్న అభీష్టానానికి వదిలేయడం. ఇది మా కుటుంబంలో కొనసాగుతున్న సంప్రదాయం. కుటుంబ ఆలనా.. పాలనా, భారం, బాధ్యత నా శ్రీమతి పువ్వాడ వసంతలక్ష్మి చూసుకుంటుంది. ఇందువల్లే నేను రాజకీయాలు, ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నా. నా జీవితాన్ని అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, విషాదాలు వెంటాడాయి. కుటుంబపరంగా ఇద్దరిని కోల్పోయిన నష్టం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం. వాటి తాలూకు విషాద ఛాయలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి’ అంటున్న ఖమ్మం శాసనసభ్యుడు, టీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఈవారం పర్సనల్ టైమ్. సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదేళ్ల వయసున్న నా కూతురు హన్స అనారోగ్యంతో మృతి చెందడం మా కుటుంబాన్ని కోలుకోలేని మానసిక వ్యధకు గురిచేసింది. హన్స అకాల మరణంతో నా సతీమణి వసంతలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ప్రజల మధ్య.. ప్రజల కోసం పని చేస్తున్నామనే సంతృప్తి నా గత విషాద జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తోంది. 1994లో హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నాకు జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్రంగా కుంగదీసింది. మానసికంగా నేను సైతం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. డివైడర్‌కు కారు ఢీకొనడంతో కారు అద్దం పగిలి ముక్కలు కళ్లల్లో గుచ్చుకోవడంతో కంటికి తీవ్రంగా దెబ్బ తగిలింది. ఏడు నెలలపాటు ఏం చూడకుండానే గడపాల్సిన పరిస్థితి. శస్త్ర చికిత్సలు చేయించుకున్నాక మళ్లీ మామూలు స్థితికి రాగలిగాను. ఆ రోడ్డు ప్రమాదం మా కుటుంబానికి ఒక పీడకల లాంటిది. ఇక నా కూతురు హన్స మా ఇంటి మహాలక్ష్మిలా వెలుగొందుతూ.. సందడి చేస్తున్న సమయంలో అనారోగ్య సమస్యలతో చనిపోవడం కుటుంబ సభ్యులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి పనిని ఛాలెంజ్‌గా తీసుకోవడం నాకిష్టం. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కొన్ని సందర్భాల్లో ఏటికి ఎదురీదడం తప్పదేమో.. అది నా జీవితంలో అనేకసార్లు జరిగింది. రాజకీయాల్లోనూ పెనుసవాళ్లు ఎదర్కొని తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐలో సీనియర్ నేతగా రెండుసార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా.. మరో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా ఆయన ఏనాడూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. రాజకీయంగా పరిస్థితులకు అనుగుణంగా నేనే నిర్ణయం తీసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందే స్థాయిలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా ఆలోచనా విధానం మా ఇంట్లో ప్రత్యేకంగా ఉండేది. అత్యంత పట్టుదలగా.. అనుకున్నది సాధించే వ్యక్తిగా పేరుండేది. లక్ష్య సాధన కోసం ఎన్ని గంటలైనా పనిచేసే వ్యక్తిత్వం నాది. కష్టాలకు కుంగిపోవడం, విజయాలకు ఉప్పొంగిపోవడం మా కుటుంబంలో లేదు. ఇప్పటికీ అమ్మ, నాన్న, అన్నయ్య ఉదయ్ భార్య జయశ్రీ, కుమారుడు నరేన్, నేను, మా అబ్బాయి నయన్‌రాజ్, నా సతీమణి వసంతలక్ష్మి అందరం కలిసి కుటుంబపరమైన అంశాలపై చర్చించుకునే సంప్రదాయం ఉంది. ఇక నయన్రాజ్కు లెక్కలంటే చిన్నప్పుడు చాలా భయం. పదో తరగతిలో మ్యాథ్స్ పరీక్ష అయిపోగానే ఇక లెక్కలతో నా కష్టాలు తీరాయని పడిన ఆనందం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. అతడి కోరిక మేరకే బైపీసీ చదివి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే ఎంఎస్ ఆర్థోలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. అమ్మమ్మకు, నానమ్మకు, తాతయ్యకు ఐదేళ్ల వయసులోనే ఉత్తుత్తి ఇంజక్షన్, స్టెతస్కోప్‌లతో పరీక్షలు చేస్తూ భావి డాక్టర్‌గా ఫోజ్ ఇచ్చేవాడని అజయ్ సతీమణి వసంతలక్ష్మి చమత్కరించారు. చదువుకోమని చెప్పే పరిస్థితి ఏరోజు నయన్ కల్పించలేదు. ఇష్టమైన విద్య కావడంతో స్వతహాగానే చదువుకున్నాడు. ఇక బాస్కెట్‌బాల్ అంటే ఎడతెగని మక్కువ. కుటుంబపరంగా అందరం కలిసి షిరిడీ వంటి తీర్థయాత్రలకు వెళ్లిన సందర్భంలో మమ్మల్ని కాదనలేక వచ్చినా.. మళ్లీ గేమ్‌కు అటెండ్ అయ్యే విధంగా తన జర్నీని ప్లాన్ చేసుకునేవాడు. బాస్కెట్‌బాల్‌లో అనేక అవార్డులు సాధించాడు. అజయ్కుమార్ది కష్టించే మనస్తత్వం ఏదన్నా పట్టుపడితే ఆ పని పూర్తయ్యేంత వరకు రాత్రి పగలూ తేడా ఉండదు. ఆయన అగ్రికల్చర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కాలంలో పొలం గట్లపై కిలోమీటర్ల కొద్దీ నడిచినా ఆ అలసటను మాత్రం ఇంటి వద్ద కనపడనిచ్చే వారు కాదు. మా మధ్య మాట పట్టింపులు ఉండవు. ఇంటి విషయాలు నేను, రాజకీయ విషయాలు ఆయన చూసుకుంటాం. ఇక గత ఎన్నికల్లోనూ.. 2014 ఎన్నికల్లోనూ ఆయన తరఫున పనిచేసిన అనేకానేక అంశాలు ప్రజల సమస్యలు నాకంట పడ్డాయి. వాటిని ఆయనతో చర్చించి పరిష్కారం చేయమని కోరేదాన్ని. బతుకు పోరాటం చేశా.. నా సతీమణి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా.. నేను రాజకీయ కుటుంబంలోనే జన్మించినా సాధారణ నిరుద్యోగి మాదిరిగానే బతుకు పోరాటం చేయక తప్పలేదు. సొంతంగా ఖార్ఖానా ఉన్నా.. కార్మికుడి పాత్రను పోషించి బతుకు పోరాటం చేసి విజేతగా నిలిచాను. నేను రాజకీయాల్లోకి రాకముందు.. ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకముందు అనేకమంది మాదిరిగా ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టా. తొలుత నగరంలోని ద్రాక్ష తోటలకు ఉద్యాన కన్సల్టెంట్‌గా పనిచేసి అనేక మంది ప్రముఖుల మన్ననలు పొందా. రాజకీయ దిగ్గజాలు, సినిమా యాక్టర్ల ద్రాక్ష తోటలను పర్యవేక్షించి సాంకేతిక సలహాలు ఇవ్వడం నా ఉద్యోగం. అందులో అనుభవాన్ని సంపాదించుకున్నా. అందువల్లే రైతుల, కూలీల కష్టాలను దగ్గరగా చూసే అద్భుత అవకాశం నేను చదువుకున్న ఎమ్మెస్సీ వ్యవసాయ విద్య ద్వారా లభించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి.. ఇష్టపడి ఎంచుకున్న వ్యవసాయ రంగంలోనూ.. వ్యాపారపరంగా అడుగిడిన వైద్య విద్యారంగంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నాకే విజేతనయ్యా. . చిన్నప్పట్నుంచే ప్రజల సమస్యలపై ఇంట్లోనే చర్చ జరుగుతుండడంతో సమాజంపై అవగాహన ఉండేది. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండే లక్షణం నాన్న నుంచే అబ్బింది. రాజకీయాల్లోకి రావాలి అనుకోలేదు. వయోభారం రీత్యా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల నుంచి దూరం కావాలని అనుకుంటున్న తరుణమిది. ఇంట్లో రాజకీయాలపై మక్కువ, పట్టు ఉన్న అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ ఆకస్మికంగా మరణించడంతో ప్రజలతో మా కుటుంబానికి గల సత్సంబంధాలను కొనసాగించే బాధ్యత తీసుకోవాలని అనిపించింది. ఉదయ్ ఉంటే నేను వచ్చే వాణ్ణి కాదేమో. ఆయనకు రాజకీయ పరిపక్వత ఎక్కువ. రష్యాలో చదువుకోవడం వల్ల ఆయనకు సామాన్యుల జీవన విధానంపై, కమ్యూనిస్టు సిద్ధాంతంపై తిరుగులేని పట్టు ఉండేది. ప్రజా సమస్యలపై ముందు నుంచే అవగాహన ఉన్న నన్ను ప్రజలకు పరిచయం చేసింది మాత్రం ‘సాక్షి’ జనసభలు. ఖమ్మంలోని ప్రజా సమస్యలపై అవగాహన రావడానికి ఈ సభలు ఎంతో ఉపకరించాయి. మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో నేను ప్రింటింగ్ ప్రెస్‌ను చాలాకాలం నడిపి పని ఒత్తిడి ఉన్న రోజుల్లో అర్థరాత్రి వరకు ప్రింటింగ్ పని సొంతంగా చేసి డెలివరీ ఇచ్చేవాణ్ణి. అర్థరాత్రి న్యూస్ పేపర్ రీళ్లు వస్తే కార్మికులతో సమానంగా నేను వాటిని భుజాలపై మోసేవాడిని. ఆది నుంచి కష్టపడటం తప్పు కాదనేది నా భావన. అయితే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల మాత్రం నాకు మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ. ఏటికి ఎదురీదడానికి ఇష్టపడే తత్వం నాది. ఇక కుటుంబ విషయాలకు వస్తే ప్రజా జీవితాన్ని ఇంత సాఫీగా నెట్టుకొస్తున్నానంటే రాజకీయంగా పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను అంటే అందుకు నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి తోడ్పాటు, సహకారం మరువలేనిది. ఇక నా కూతురు హన్స, మా అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ కొద్దికాలం తేడాతో మరణించడంతో మా కుటుంబం యావత్తు కొద్ది సంవత్సరాలపాటు దుఃఖ సాగరంలో మునిగింది. అన్నయ్య మరణాన్ని అమ్మ, నాన్న జీర్ణించుకోవడానికి, సాధారణ జీవితంలోకి రావడానికి చాలాకాలం పట్టింది. నాకు ఉదయ్‌తో విపరీతమైన అనుబంధం.. ఆత్మీయత ఉండేది. ఒకవైపు అన్న.. మరోవైపు కన్న కూతురు కొద్ది తేడాతో మరణించడం మా కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
వైఎస్సార్ సీపీలోకి రైల్వే యూనియన్ లీడర్ అజయ్‌కుమార్
సాక్షి,విశాఖపట్నం: విశాఖకు చెందిన రైల్వే యూని యన్ లీడర్, రిటైర్డ్ ఉద్యోగి వేలుపుల అజయ్‌కుమార్, అతని భార్య మాజీ కార్పొరేటర్ ప్రేమకుమారి వైఎస్సార్ సీపీలో సోమవారం చేరారు. లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అజయ్‌కుమార్ దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, జగనన్న నాయకత్వంతోనే అది సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి అహర్నిశలు కష్టపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, ఉత్తరాంధ్ర బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు పక్కి దివాకర్ పాల్గొన్నారు. -
అజయ్ హంతకుడు చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరమండలం పరిధిలోని బోయిన్పల్లి ప్రాంతంలో ఈ నెల 14న చోటు చేసుకున్న మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సంజీవయ్యనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆటోడ్రైవర్ అజయ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసింది అతడి స్నేహితుడు తివారీగా తేల్చారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బోయిన్పల్లి ఠాణా పరిధిలోని చిన్నతోకట్ట సంజీవయ్యనగర్‌కు చెందిన దశరథ మూడో కుమారుడు అజయ్‌కుమార్ కిరాయికి ఆటో నడుపుకునేవాడు. మద్యానికి బానిసైన ఇతను తరచూ స్నేహితులతో కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో మద్యం సేవించేవాడు. అనేక సందర్భాల్లో రాత్రి అక్కడే పడుకుని ఉదయం ఇంటికి వచ్చేవాడు. ఇందులో భాగంగానే ఈ నెల 14 మధ్యాహ్నం వరకు ఆటో నడిపిన అజయ్ ఆపై ఇంటికి వచ్చాడు. ఆటోను ఇంటి వద్దే పార్క్ చేసి స్నేహితులు పిలుస్తున్నారంటూ బయటికి వెళ్లాడు. రాత్రి సమయంలో స్నేహితులతో కమ్యూనిటీహాల్ వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన దశరథ్ ఇంటికి రమ్మని పిలిచాడు. తర్వాత వస్తానంటూ చెప్పిన అజయ్‌కుమార్ తండ్రిని పంపేశాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో యధావిధిగా కమ్యూనిటీ హాల్ వద్దే నిద్రించి ఉంటాడని దశరథ దంపతులు భావించారు. మరుసటి రోజు ఉదయానికీ అజయ్ జాడ లేకపోవడంతో కమ్యూనిటీ హాల్ వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. హత్యాస్థలానికి కొద్దిదూరంలో మద్యం సీసా, వాటర్ ప్యాకెట్లతో పాటు రక్తపు మరకలతో ఉన్న బండరాయి కనిపించడంతో ఆ రోజు రాత్రి అజయ్‌కుమార్‌తో కలిసి మద్యం సేవించిన స్నేహితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఒకరికి నేరచరిత్ర ఉండటంతో అతడిని అనుమానించినా కాదని తేలింది. మరోపక్క తివారీ అనే మరో స్నేహితుడి ఆచూకీ లేకపోవడంతో అతడినే తొలి అనుమానితుడిగా చేర్చిన పోలీసులు ఇతగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గురువారం అర్ధరాత్రి అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నగరానికి తరలించి హత్యకు గల కారణాలను విచారించాలని నిర్ణయించారు.ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఒకటిరెండు రోజుల్లో తివారీ అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. -
పని చేయని గులాబీ ప్రభంజనం
సాక్షి, ఖమ్మం : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అంతిమ తీర్పునిచ్చారు. గెలుస్తామని ధీమాగా ఉన్న దిగ్గజాలను ఓటమిబాట పట్టించారు.. కొత్త నేతలను అక్కున చేర్చుకుని అసెంబ్లీ బాట చూపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగిన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను ప్రజాకూటమి కైవసం చేసుకోగా.. ఖమ్మంలో టీఆర్ఎస్.. వైరాలో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎదురుచూసిన ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ.. రంగులు చల్లుకుంటూ.. బాణసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు విశిష్ట.. విలక్షణ తీర్పునిచ్చారు. టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభంజనాల పర్వంలో టీఆర్ఎస్ సత్తా చాటుకుంటుందని భావించినా.. జిల్లా ఓటర్లు మాత్రం ఆ పార్టీని అనూహ్యంగా ఒక్క సీటుకే పరిమితం చేశారు. పార్టీలో నెలకొన్న ఇంటిపోరే కొంపముంచిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే స్వల్ప తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు అని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక రాజకీయ పక్షాలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం లభించగా.. ఈసారి మూడే మూడు పక్షాలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి టీఆర్ఎస్ తరఫున జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక హోరాహోరీ పోరు సాగిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆయన 3,567 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగాల కమల్‌రాజ్ ప్రతిరౌండ్‌లో గట్టి పోటీ ఇవ్వడం.. ఏ రౌండ్లో ఎవరు వెనుకబడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో క్షణ క్షణం ఉత్కంఠ రేపింది. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య 19,002 ఓట్ల ఆధిక్యంతో వరుసగా మూడోసారి గెలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి 81,210 ఓట్లు లభించాయి. ఒకటి, రెండు రౌండ్లలో పిడమర్తి రవి కొంత ఆధిక్యత చూపినా.. మిగతా అన్ని రౌండ్లలో సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లకావత్ రాములునాయక్.. 2,013 ఓట్ల మోజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గత శాసనసభలోనూ సభ్యులుగా ఉండగా.. వారు మరోసారి అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశం ప్రజలు కల్పించారు. ఇక పువ్వాడ అజయ్‌కుమార్ రెండోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తొలిసారిగా.. పాలేరు నుంచి గెలుపొందిన కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా నుంచి గెలుపొందిన లావుడ్యా రాములునాయక్ శాసనసభలో తొలిసారి ప్రవేశించనున్నారు. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు విశిష్టతను చాటిచెప్పింది. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వడం.. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంతో.. ఆ జిల్లాలో అధికార పక్షమైన టీఆర్ఎస్కు ఒక్కసీటు లభించని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కొత్తగూడెంలో ఈసారి కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా 20 రోజుల క్రితమే అడుగిడిన పార్టీ సీనియర్ నేత పొదెం వీరయ్య అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఇక ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా బాణోతు హరిప్రియ, పినపాకలో రేగా కాంతారావు విజయం సాధించడంతో ఆ జిల్లాలో టీఆర్ఎస్కు శాసనసభ స్థానమే లేని పరిస్థితి నెలకొనడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఈ పరిస్థితి రావడంపై గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ‘పువ్వాడ’పైనే.. జిల్లాలో గత ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితి ఉందో.. ఈసారి సైతం అదే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్న రాజకీయ వర్గాలు ఈసారి జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మంత్రి తుమ్మల ఓటమి భారంతో ఉన్న క్షణంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి హైదరాబాద్‌కు పిలిపించుకోవడం రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారినా.. పువ్వాడ అజయ్‌కుమార్‌కు పార్టీలోని యువ నేతతో ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయ అందలానికి అవకాశం కల్పిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపు పది రౌండ్ల వరకు ఎన్నికల ఫలితాలపై ఊపిరి బిగబట్టాల్సిన పరిస్థితే నెలకొంది. గెలుపు తీర్పు జిల్లా ఓటర్లు ఏకపక్షంగానే ఇచ్చినా.. మెజార్టీ విషయాన్ని మాత్రం ప్రతి రౌండ్లో పలువురు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. మెజార్టీ విషయంలో ఆయా పార్టీల అభిమానుల అంచనాలు దాదాపు తలకిందులయ్యాయి. తమ పార్టీ నేతలకు భారీ మెజార్టీ వస్తుందని ఊహించినా.. ఫలితాల సరళి మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో నేతలందరూ ఖిన్నులయ్యారు. ఇక చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలేవీ ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కనీసం డిపాజిట్లను సైతం సాధించలేకపోయాయి. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, సీపీఎం బలపరిచిన బీఎల్పీ అభ్యర్థి పాల్వంచ రామారావు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా.. జిల్లాలో మాత్రం ప్రజాకూటమి సానుకూల పవనాలే మెజార్టీ నియోజకవర్గాల్లో కనిపించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. జిల్లాలో సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓడిపోగా.. టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో ఓటమి చెందగా.. కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాలను గెలుపొందింది. ఇక సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈ ఎన్నికల్లో తమ గత ప్రాభవాన్ని కాపాడుకోలేకపోయాయనే భావన ఈ ఎన్నికల ఫలితాలు కల్పించాయి. తుమ్మలకు స్వల్ప అస్వస్థత కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంతలోనే సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: స్పెషల్ జ్యూరీ రికగ్నిషన్ స్పోట్స్ మేల్ అవార్డు అజయ్ కూమర్ రెడ్డి
-
అనుష్క సన్నిహితులకు ఆహ్వానాలు..!
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం త్వరలో జరగనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఓ వైపు లంకతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. విరుష్క (విరాట్-అనుష్క) జోడీ వివాహం ఈ నెల 12న ఇటలీలో కొందరు సన్నిహితుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ సమయంలో మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటి అనుష్క తరపున కొందరు సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందినట్లు తెలుస్తోంది. కూతురి వివాహానికి తప్పకుండా హాజరుకావాలంటూ బంధువులు, తమ ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ స్వయంగా ఆహ్వానించారట. అయితే ఈ విషయాన్ని బయట ఎవరికీ లీక్ చేయోద్దని, ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ప్రచారమైతే పెళ్లి వేడుకకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనుష్క తండ్రి ఆందోళన చెందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు కోహ్లీ పెళ్లికి హాజరుకారని సమాచారం. వచ్చే వారం ఆ ఈవెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. -
భారత అంధుల క్రికెట్ సారథి అజయ్
ముంబై: ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇతని సారథ్యంలోని భారత జట్టు అంధుల వన్డే ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ టోర్నీ వచ్చే నెల 7 నుంచి 21 వరకు పాకిస్తాన్, దుబాయ్ వేదికల్లో జరుగుతుంది. ఎంపికైన జట్టుకు ఈనెల 6 నుంచి వచ్చేనెల 4 వరకు బెంగళూరులో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే జట్టు 5న పాక్‌కు బయల్దేరనుంది. 17 మంది సభ్యులున్న భారత జట్టులో కెప్టెన్ సహా నలుగురు ఏపీ ఆటగాళ్లు ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర్ రావు, దుర్గారావులకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి మహేందర్ వైష్ణవ్ ఉన్నాడు. అజయ్ సారథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత జట్టు టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. జట్టు: అజయ్ (కెప్టెన్), ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర్ రావు, దుర్గారావు (ఏపీ), జాఫర్, పంకజ్ భుయ్ (ఒడిశా), నరేశ్‌భాయ్ తుందా, గణేష్‌భాయ్ ముహుద్కర్, అనిల్ భాయ్ గరియా (గుజరాత్), వైష్ణవ్ (తెలంగాణ), సోను గోల్కర్ (మధ్యప్రదేశ్), బసప్పా వాద్గల్, ప్రకాశ్, సునీల్ రమేశ్ (కర్ణాటక), సురజిత్ ఘర (బెంగాల్), దీపక్ మలిక్, రామ్‌బీర్ (హరియాణా). -
నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం
ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశం లోనే అతిపెద్ద కుంభకోణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ అన్నారు. నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థ చర్య లు పేటీఎం వంటి చెల్లింపు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకేనన్నారు. శుక్ర వారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డితో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. నోట్ల రద్దుతో అవినీతి, నకిలీ నోట్ల నిర్మూలన, ఉగ్రవాదులకు ఆర్థిక వన రుల సమీకరణ వంటివాటికి అడ్డుకట్ట పడు తుందన్న అంచనాలు తప్పాయని అజయ్ చెప్పారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవ డానికే ప్రధాని మోదీ ‘క్యాష్ లెస్ సొసైటీ’ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. సర్కస్‌లో రింగ్ మాస్టర్లా మోదీ వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. దోచి పెట్టేందుకే.. నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత బీజేపీ నేతలు బ్యాంకుల్లో భారీగా డిపా జిట్లు చేసి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నా రని అజయ్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న ఒక బ్యాంకులో రూ.500 కోట్లు డిపాజిట్ అవ్వడంపై వివర ణ ఇవ్వాలన్నారు. సహారా, ఆదిత్య బిర్లా గ్రూప్, సుధాంశ్ సంస్థల నుంచి మోదీకి ముడుపులు అందాయని ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ నిర్దిష్టంగా పేర్కొన్నార న్నారు. కానీ ప్రధాని మోదీ ఈ ఆరోపణల పై వివరణ ఇవ్వకుండా, విచారణకు సిద్ధం కాకుండా జోకులు వేయడం ఎంతవరకు సమంజసమని అజయ్‌కుమార్ ప్రశ్నించా రు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఎంతో మంది రాజకీయ నాయకులకు, ఉన్నతాధి కారులకు సంబంధాలు ఉన్నాయని చెప్పిన సీఎం కేసీఆర్ కోర్టుకు అబద్ధాలు చెప్పారా అని వి.హనుమంతరావు ప్రశ్నించారు. -
బొలెరో వాహనం బోల్తా..యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్ : పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడి అజయ్‌కుమార్(20) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. పట్టణానికి చెందిన బోర్లు రామన్న కుమారుడు హర్షవర్ధన్, అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు కంబదూరు బైపాసు రోడ్డు నుంచి మల్లాపురం గ్రామం వైపు వెళ్తుండగా బొలెరో వాహనం టైర్లు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. -
స్నేహితులే దారుణంగా చంపారు..
ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపారు. గుంటూరు జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. దాచేపల్లికి చెందిన అన్నం అజయ్‌కుమార్,అతని స్నేహితులు కలసి బుధవారం రాత్రి స్థానిక బార్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం నలుగురూ బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, జయ్‌కుమార్ కనిపించకుండా పోయాడు. గురువారం ఉదయం యువకుడి మృతదేహం మాచర్ల మండలం కంభంపాడు వద్ద ఓ పాడుబడ్డ రైస్ మిల్ లో చెట్ల పొదల మాటున స్థానికులు గుర్తించారు. దీనిపై వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. మద్యం మత్తులో స్నేహితులతో జరిగిన ఘర్షణే హత్యకు దారితీసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమైతున్నాయి. అజయ్ ని హతమార్చి ఎవరూ గుర్తించకుండా.. అతడి మృత దేహాన్ని రైస్ మిల్లులో దాచి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. -
భార్యను, ఆమె ప్రియున్ని చంపేశాడు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో పాటు ఆమె ప్రియున్ని నేవి ఆఫీసర్ కిరాతకంగా చంపేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నేవీలో పనిచేస్తున్న దృవ్ కాంత్ విమల్ ఠాకూర్ కు సుష్మితతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. జుహు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వీరు కొంతకాలం వరకు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఉద్యోగ పనుల నిమిత్తం ఎక్కువ కాలం డ్యూటీలోనే ఉండే ఠాకూర్ గత నెల విధుల నుండి తిరిగి రాగానే సుష్మిత విడాకుల పత్రాలు చేతిలో పెట్టింది. తను అజయ్ కుమార్ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనితోనే కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సుష్మిత ప్రపోజల్‌కు ఠాకూర్ కూడా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం ఠాకూర్ ఉద్యోగానికి వెళ్లి బుధవారం తిరిగొచ్చాడు. అయితే భర్త ఇంకా డ్యూటీలోనే ఉన్నాడని భావించి సుష్మిత తన ప్రియుడితో అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన అజయ్‌కుమార్ మెడను నరికి, భార్యను దిండుతో నొక్కి ఠాకూర్ చంపేశాడు. అనంతరం టై తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు కానీ టై తెగిపోయింది. నెత్తురు మరకలతో ఉన్న ఠాకుర్ ఉదయాన్నె అపార్ట్మెంట్ బయటకు వచ్చి పోలీసులను పిలవాల్సిందిగా కోరాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పోస్ట్‌మ్యాన్ పోరాటం
తెలంగాణ పోరాట నేపథ్యంలో 1969- 72 మధ్య కాలంలో జరిగిన ఓ ప్రేమకథతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ పోస్ట్‌మ్యాన్’. అజయ్‌కుమార్, వేద జంటగా రమేశ్‌రెడ్డి స్వీయదర్శక త్వంలో నిర్మిస్తున్నారు. సాయిచంద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని న రసింహారెడ్డి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ‘‘కేవలం 50 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే ఇంగ్లీషు వెర్షన్‌కు కోటి రూపాయాలకు పైగా బిజినెస్ జరుగుతోంది’’ అని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు రఫీ, పులి అమృత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కలిసికట్టుగా పనిచేద్దాం
ఖమ్మం : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలని మధిర, ఖమ్మం ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఐతం సత్యం సన్మాన సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం జరిగింది. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నయాబజార్ కళాశాల నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన భక్తరామదాసు కళాక్షేత్రం వరకు కొనసాగింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఐతం సత్యం డీసీసీ అధ్యక్షుడిగా నియామకం పొందదం హర్షణీయమన్నారు. ఈయనకు ఉన్న అపార అనుభవం జిల్లా పార్టీ అభివృద్ధికి దోహద పడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు ఆదేశాలనుసారం నడుచుకోవాల్సిన అవసరం పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ త్యాగాల చరిత్ర గల ఇందిరాగాంధీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు రుణపడి ఉంటారన్నారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్న సోనియాగాంధీ ఆదర్శమూర్తి అని కొనియాడారు. ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వపడాలన్నారు. ఆమె ఆదేశాల మేరకు నియమితులైన ఐతం సత్యం నాయకత్వాన్ని గౌరవించాలన్నారు. అందరికీ అండగా ఉంటా : ఐతం నలుబై ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు అన్ని వర్గాల నాయకులతో పనిచేసిన అనుభవం ఉందని ఐతం సత్యం అన్నారు. ఏ ఒక్కరి వర్గానికి కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సోనియాగాంధీకి, అందుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు, గ్రంథాలయం చైర్మన్ దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, సేవాదళ్ అధ్యక్షుడు జావీద్, నాయకులు కూల్‌హోం ప్రసాద్, అశోక్, బాలాజీనాయక్, కక్కెర రాంమోహన్‌రావు, ఎస్ఏఎస్ అయ్యుబ్, మందడపు సత్యనారాయణ, దోరెపల్లి రవికుమార్, సిరిపురం సుదర్శన్, రషీద్, నాగబత్తిని రవి, కిషోర్‌బాబు, రాంప్రసాద్, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చల్లారని అసమ్మతి! ఐతం సత్యం సన్మాన సభకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రేణుకాచౌదరితోపాటు పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులు హాజరుకాలేదు. దీంతో డీసీసీలో రాజుకున్న అసమ్మతి సెగలు చల్లారలేదనే విషయం చర్చనీయాంశమైంది. -
విషాదరాగంలో వాడని సిగపూవు...
అమ్మ.. తను వత్తిలా కాలిపోతూ పిల్లలకు వెలుగునిస్తుంది. తను శిధిలమైపోతూ వసంతాన్ని పంచుతుంది. ఇప్పటివరకూ అమ్మ కథలతో చాలా సినిమాలొచ్చాయి. ఇంతలా ఏడిపించిన సినిమా మాత్రం లేదు. అమ్మ కొంగులో దాగిన కన్నీటి సంద్రం ‘మాతృదేవోభవ’. ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా ఓ రివైండ్... సినిమా చూసి అదిరిపోయాడు అజయ్‌కుమార్. హృదయం ద్రవించుకుపోవడం అంటారే... అదే ఫీలింగ్. ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా అది. ‘హూ విల్ లవ్ మై చిల్డ్రన్?’. జాన్ ఎర్మాన్ డెరైక్ట్ చేసిన సినిమా. తల్లికి కేన్సర్ వస్తుంది. పదిమంది పిల్లల బతుకేం కావాలి? పట్టించుకోని భర్త. అనాథల్లా వదిలేయలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో గూడు చూపించాలి. చివరిక్షణం వరకూ అదే తపన. ఎట్టకేలకు సాధిస్తుంది. తృప్తిగా కన్ను మూస్తుంది. నిజంగా జరిగిన కథ ఇది. దాన్నే హాలీవుడ్లో తీశారు. దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఓ సినిమా చేద్దామనుకున్నారు నిర్మాత కేఎస్ రామారావు. అభిలాష, ఛాలెంజ్‌లాంటి సూపర్హిట్లు తీసిన నిర్మాత ఆయన. అజయ్ కుమార్‌ని ‘కొంగుచాటు కృష్ణుడు’తో దర్శకుణ్ణి చేసింది ఆయనే. అతని రెండో సినిమా కోసమే ఈ కసరత్తులు.స్క్రిప్టు పని మొదలైంది. సత్యమూర్తి సంభాషణలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడే ఓ బాంబు పేలింది. ఆల్రెడీ ఇదే కథతో జయసుధను పెట్టి సీనియర్ దర్శకుడు పీసీ రెడ్డి, ‘కాల చక్రం’ అనే సినిమా చేస్తున్నారు. చాలామటుకు షూటింగ్ అయిపోయిందట కూడా. ఇప్పుడేం చేయాల్రా దేవుడా అని తలపట్టుకున్నాడు అజయ్‌కుమార్. అలాంటి పరిస్థితుల్లో కేఎస్ రామారావుకి ఓ వార్త తెలిసింది. మలయాళంలో ‘అక్ష దూత్’ అనే సినిమా పెద్ద హిట్టయ్యిందట. దానిక్కూడా మాతృక ఆ హాలీవుడ్ సినిమానే. మన తెలుగమ్మాయి మాధవి హీరోయిన్గా చేసింది. ఆ రైట్స్ కొనేసి తీస్తే తంటానే ఉండదు కదా అనుకుని రైట్స్ కొనుక్కొచ్చేశారు.అదే సమయంలో కేఎస్ రామారావు ‘అంగరక్షకుడు’ సినిమా తీస్తున్నారు. రాజశేఖర్ హీరో. రెగ్యులర్‌గా లొకేషన్‌కి వస్తుండేవారు జీవిత. వారిద్దరికీ ఆ కథ వినిపించి మీ ఇద్దరూ చేస్తే బావుంటుందన్నారు కేఎస్ రామారావు. పెళ్లయ్యాక నేను నటించకూడదని నిర్ణయించుకున్నా అని జీవిత నిరాకరించారు.ఒరిజినల్ వెర్షన్లో చేసిన మాధవినే తీసుకున్నారు. మరి మాధవి భర్త పాత్రకు ఎవరిని తీసుకోవాలి? కేఎస్ రామారావుని ఆ పాత్ర చేయమంటే ఒప్పుకోలేదు. ఫైనల్‌గా నాజర్‌ను తీసుకున్నారు. అప్పుడు కీరవాణి హవా నడుస్తోంది. పెద్ద సినిమాలన్నింటికీ ఆయనే సంగీత దర్శకుడు. మరి ఆయన ఇంత చిన్ని సినిమా చేస్తారా? ఓసారి రిక్వెస్ట్ చేద్దామని అజయ్ కుమార్ బయలుదేరాడు. మద్రాసులోని ఏవీయం స్టూడియోలో పని పూర్తి చేసుకుని, కారులో బెంగళూరు వెళ్లడానికి కీరవాణి సిద్ధమవుతున్నారు. ‘ఓ ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అని చెప్పి పక్కకు తీసుకెళ్లి కథ చెప్పేశారు అజయ్‌కుమార్. కీరవాణి వెంటనే ‘‘ఈ సినిమా నేనే చేస్తున్నాను’’ అని చెప్పి, అప్పటికప్పుడు రెండు బాణీలు కూడా కట్టేసి, వేటూరికి పంపించేశారు.హైదరాబాద్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని నర్సాపూర్‌లో ఎన్సీఎల్ ఫారమ్స్ ఆవరణలో ఓ ఇంటి సెట్ వేశారు. 1993 జూలై 1 నుంచి ఆగస్టు 19 వరకూ ఏకధాటిగా షూటింగ్. 37 లక్షల ఖర్చుతో సినిమా రెడీ! 1993 ఆక్టోబర్ 22న సినిమా రిలీజ్. ఓ థియేటర్లో 10 టికెట్లు. ఇంకో థియేటర్లో 15 టికెట్లు. టోటల్‌గా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. చూసినవాళ్లంతా బావుందంటున్నారు. కానీ చూసేవాళ్లే కరవు. వారం గడిచింది. థియేటర్ యజమానులకు రిజల్ట్ తెలిసి పోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్. గట్టెక్కడం కష్టం. కేఎస్ రామారావుకి ఫోన్ చేశారు. ఆయన మాత్రం స్టడీగా ఉన్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ‘‘ఏం ఫర్లేదు... ఇంకో రెండు వారాలు చూద్దాం. మీ నష్టానికి నాదీ భరోసా. ఇక నుంచి ప్రతి షోకి టిక్కెట్‌తో పాటు ఒక కర్చీఫ్ ఉచితంగా ఇవ్వండి’’ అన్నారు.ఎవరికీ ఏం అర్థం కాలేదు. చివరకు సినిమా చూడ్డానికొచ్చిన వాళ్లక్కూడా. ‘కర్చీఫ్ మేమేం చేసుకోం’ అన్నారు. కానీ లోపలికెళ్లాక అర్థమైంది అందరికీ. మనసుకు గండి పడింది. ఒకటే కన్నీళ్ల వరద. ఒక్క కర్చీఫ్ చాలడం లేదు. ఇలా మెల్లిమెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం, సంభాషణలు, అభినయం అన్నీ కూడబలుక్కుని మరీ మనసుని బరువెక్కించేసి కన్నీళ్లు పెట్టించేశాయి. ఇందులో మాధవిని తప్ప మరెవ్వరినీ ఊహించలేం. ఇక ఎక్కడ చూసినా హిట్ టాక్. కట్ చేస్తే... 6 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్. గ్రాండ్ ఫంక్షన్. శోభన్‌బాబు, నాగార్జున, జయప్రద, జయసుధ ముఖ్య అతిథులు. ఇలాంటి కథతో ‘పితృదేవోభవ’ తీస్తే పారితోషికం లేకుండా యాక్ట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు శోభన్‌బాబు. ‘అయ్యో, నాజర్ పాత్ర నేను చేయాల్సిందే’ అని రాజశేఖర్ వాపోయారు. అవార్డులకూ కొదవ లేదు. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు. ఇవన్నీ కాదు గానీ, ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో’ పాట రాసిన వేటూరికి ఉత్తమ సినీ గీత రచయితగా నేషనల్ అవార్డ్. శ్రీశ్రీ తర్వాత ఓ తెలుగు కవికి దక్కిన జాతీయస్థాయి గుర్తింపు.ఈ సినిమా చూడండి. అమ్మ మనసు తెలుస్తుంది. కన్నీళ్ల విలువ తెలుస్తుంది. అను బంధాల అనువాదం తెలుస్తుంది. గడ్డకట్టిన విషాదపు లోతు తెలుస్తుంది. రాలిపోయే పువ్వు పలికే రాగాల మూగ వేదన తెలుస్తుంది. - శ్రీబాబు ‘‘మలయాళంలో క్రైస్తవ నేపథ్యం ఉంటుంది. మేం అదంతా మార్చేశాం. ప్రారంభంలో రెండు, మూడు దృశ్యాలు మినహా సినిమా మొత్తం విషాదభరిత వాతావరణంలోనే నడుస్తుంది. నేనిప్పటి వరకూ 15 సినిమాలు డెరైక్ట్ చేశాను. కానీ నాకు ఈ సినిమానే ఇంటిపేరు అయిపోయింది. ఈ చిత్రం క్రెడిట్ మొత్తం కేఎస్ రామారావుదే. హిందీలో మనీషా కొయిరాలాతో ‘తులసి’గా నేనే రీమేక్ చేశా’’. - అజయ్‌కుమార్, దర్శకుడు -
మెయిన్ ‘డ్రా’కు అజయ్ అర్హత
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు అజయ్ కుమార్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అజయ్ 22-20, 23-21తో ఇటీవల జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన చాంపియన్ అరవింద్ భట్ (భారత్)ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు తొలి రౌండ్లో ఈ హైదరాబాదీ 21-13, 21-15తో దీపక్ ఖత్రీ (భారత్)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ తలపడతాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చేతన్ ఆనంద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. జాతీయ మాజీ చాంపియన్ అనూప్ శ్రీధర్ 21-14, 21-16తో చేతన్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల- జిష్ణు సన్యాల్ జోడి క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. రెండో అర్హత పోరులో గుత్తా జంట 12-21, 15-21తో తకెషి కముర-మిసాటో అరతమా (జపాన్) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో జెంగ్‌మింగ్ వాంగ్ (భారత్)తో పారుపల్లి కశ్యప్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; పెంగ్యూ డూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా (జపాన్)తో శ్రీకాంత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో ఆనంద్ పవార్; లాంగ్ చెన్ (చైనా)తో ప్రణయ్; ఇవనోవ్ (రష్యా)తో సౌరభ్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సిమోన్ (ఆస్ట్రియా)తో సైనా నెహ్వాల్, షిజియాన్ వాంగ్ (చైనా)తో పి.వి.సింధు పోటీపడతారు. -
పస్తులుంటున్నాం.. పైసలివ్వండి
యాచారం,న్యూస్‌లైన్: కష్టపడి పనులు చేసి పస్తులుంటున్నాం.. వెంటనే బకాయిలు చెల్లించాలని ‘ఉపాధి’ కూలీలు ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. సోమవారం తక్కళ్లపల్లి, పిల్లిపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని ఎంపీపీ చాంబర్లో మండల ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో కూలీలకు అందాల్సిన బకాయిలు రూ. 30 లక్షలకు పైగానే ఉన్నాయన్నారు. పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ఓ బ్యాంక్ పేదల డబ్బులను స్వాహా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్, ఈజీఏస్ నాగభూషణాన్ని పిలిపించుకొని బకాయిల వివరాల గురించి తెలుసుకున్నారు. వెంటనే బకాయిలు కూలీలకు అందేలా కృషి చేయాలని సూచించారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రత్యేకాధికారి హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కూలీలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి
బీహార్‌లో మావోయిస్టుల ఘాతుకం ఔరంగాబాద్/పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రాగఢ్ మోరె (సర్కిల్) సమీపంలో తాండ్వా-నబీనగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం పోలీసు జీపును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తాండ్వా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి అజయ్ కుమార్ సహా ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నబీనగర్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరై పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి తెగబడినట్లు అదనపు డీజీపీ (హెడ్‌క్వార్టర్స్) రవీంద్ర కుమార్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్పెషల్ ఆక్సిలరీ పోలీసు విభాగానికి చెందిన వారితోపాటు జీపు డ్రైవర్ అయిన హోంగార్డు కూడా ఉన్నట్లు చెప్పారు. పేలుడు అనంతరం ఘటనాస్థలి వద్ద పోలీసులకు చెందిన ఐదు రైఫిళ్లు కనిపించాయన్నారు. మావోయిస్టుల దాడి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్.కె. భరద్వాజ్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఔరంగాబాద్ జిల్లా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డగా ఉంటోంది. 21 మంది మావోయిస్టుల ఆస్తులు అటాచ్ దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో 21 మంది మావోయిస్టులకు చెందిన స్థిరచరాస్తులను నితీశ్ సర్కారు మంగళవారం అటాచ్ చేసింది. ఇందుకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు 39 కేసులు సిద్ధం చేయగా ప్రభుత్వం 21 కేసుల్లో అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్‌జీ భార్యకు చెందిన రూ. 25 లక్షల విలువైన స్థలం కూడా ఈ జాబితాలో ఉంది.