స్నేహితులే దారుణంగా చంపారు.. | The brutal murder in Guntur | Sakshi
Sakshi News home page

స్నేహితులే దారుణంగా చంపారు..

Published Thu, Apr 21 2016 12:31 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

The brutal murder in Guntur

ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపారు. గుంటూరు జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. దాచేపల్లికి చెందిన అన్నం అజయ్‌కుమార్,అతని స్నేహితులు కలసి బుధవారం రాత్రి స్థానిక బార్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం నలుగురూ బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, జయ్‌కుమార్ కనిపించకుండా పోయాడు.

గురువారం ఉదయం యువకుడి మృతదేహం మాచర్ల మండలం కంభంపాడు వద్ద ఓ పాడుబడ్డ రైస్ మిల్ లో  చెట్ల పొదల మాటున స్థానికులు గుర్తించారు.  దీనిపై వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.


అయితే.. మద్యం మత్తులో స్నేహితులతో జరిగిన ఘర్షణే హత్యకు దారితీసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమైతున్నాయి. అజయ్ ని హతమార్చి ఎవరూ గుర్తించకుండా.. అతడి మృత దేహాన్ని రైస్ మిల్లులో దాచి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement