నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం
ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశం లోనే అతిపెద్ద కుంభకోణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్‌కుమార్ అన్నారు. నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థ చర్య లు పేటీఎం వంటి చెల్లింపు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకేనన్నారు. శుక్ర వారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డితో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. నోట్ల రద్దుతో అవినీతి, నకిలీ నోట్ల నిర్మూలన, ఉగ్రవాదులకు ఆర్థిక వన రుల సమీకరణ వంటివాటికి అడ్డుకట్ట పడు తుందన్న అంచనాలు తప్పాయని అజయ్ చెప్పారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవ డానికే ప్రధాని మోదీ ‘క్యాష్ లెస్ సొసైటీ’ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా మోదీ వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు.
దోచి పెట్టేందుకే..
నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత బీజేపీ నేతలు బ్యాంకుల్లో భారీగా డిపా జిట్లు చేసి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నా రని అజయ్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న ఒక బ్యాంకులో రూ.500 కోట్లు డిపాజిట్ అవ్వడంపై వివర ణ ఇవ్వాలన్నారు. సహారా, ఆదిత్య బిర్లా గ్రూప్, సుధాంశ్ సంస్థల నుంచి మోదీకి ముడుపులు అందాయని ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ నిర్దిష్టంగా పేర్కొన్నార న్నారు. కానీ ప్రధాని మోదీ ఈ ఆరోపణల పై వివరణ ఇవ్వకుండా, విచారణకు సిద్ధం కాకుండా జోకులు వేయడం ఎంతవరకు సమంజసమని అజయ్‌కుమార్ ప్రశ్నించా రు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఎంతో మంది రాజకీయ నాయకులకు, ఉన్నతాధి కారులకు సంబంధాలు ఉన్నాయని చెప్పిన సీఎం కేసీఆర్ కోర్టుకు అబద్ధాలు చెప్పారా అని వి.హనుమంతరావు ప్రశ్నించారు.