నోట్ల రద్దు పేరిట ప్రజలను మోసగిస్తున్నారని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో ఓ ముస్లిం మతగురువు శనివారం ఫత్వా జారీచేశారు.
కోల్‌కతా: నోట్ల రద్దు పేరిట ప్రజలను మోసగిస్తున్నారని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో ఓ ముస్లిం మతగురువు శనివారం ఫత్వా జారీచేశారు. ‘నోట్ల రద్దుతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని మోదీ అమాయకులను మోసం చేస్తున్నారు.
ఆయన ప్రధానిగా కొనసాగాలని ఎవరూ కోరుకోవట్లేదు’ అని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ సయ్యద్ మహ్మద్ నురూర్ రెహ్మాన్ బార్కాతి అన్నారు.దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.