
పెద్ద నోట్ల రద్దు అవినీతిని నిర్మూలిస్తుంది
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కచ్చితంగా అవినీతిని నిర్మూలిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రసంగించారు.
చాలామంది తమ జీవన విధానంపై ఆందోళన చెందుతున్నారని, పేదలు, వెనుకబడ్డ వారి జీవన విధానం మెరుగుపడాలని మోదీ అన్నారు. దీర్ఘకాలిక విధానాలతోనే పేదలు, వెనకబడ్డ వారి జీవన విధానం మెరుగుపడుతుందని, ఇందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత రావాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నిధులపై పారదర్శకత ఉండాలని మోదీ చెప్పారు.