సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వేధింపులు భరించలేక ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు నలుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆస్పత్రిలోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అజయ్ రాసిన లేఖలో తుర్కయాంజల్‌కు చెందిన కాంగ్రెస్ నేత శివకుమార్, ఆస్పత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, ఓనర్ బావమరిది కొండల్ రెడ్డి, సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరంతా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అజయ్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment