ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో అజయ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్‌రెడ్డి దంపతులకు అజయ్‌కుమార్‌రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్‌రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్‌రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..)
ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్‌కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment